24, జులై 2009, శుక్రవారం

వింత వార్త

మతం అన్నది మా కంటికి మచ్చయితే.. మతం వద్దు గితం వద్దు మాయా మర్మం వద్దు అన్నాడట ఓ కవి. కానీ, ఈ మాటలు, పాటలు పాడుకోవటానికి బాగానే ఉంటాయి. ఆచరణలోకి వస్తేనే వింతగా ఉంటుంది. దేశంలో నిజంగా మతం అన్నది ఓ వింత పదార్థం. అందుకే ఇదో వింత వార్త... మతపరమైన యాత్రలకు ప్రభుత్వం నిధులు సమకూర్చటంపై రాష్ట్ర హైకోర్టు స్టే విధించింది. అరవై ఏళు్లగా లేని ఇబ్బంది ఇప్పుడే ఎందుకు వచ్చింది?

1956లోనే తొట్టతొలి ప్రధానమంత్రి జవహర్‌లాల్‌ నెహ్రూ గారికి గొప్ప ఆలోచన వచ్చింది. మక్కాకు వెళ్లాలనుకునే పేద ముస్లింలకు ఆర్థిక సాయం చేయాలని. ఆలోచన కలిగిందే తడవుగా ఆయన పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టేశారు.. ఆమోదింప చేసుకున్నారు. అప్పటి నుంచి హజ్‌ యాత్రకు వెళ్లే ముస్లిం భక్తులకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందుతోంది. ఒక్కో వ్యక్తికి పాస్‌పోర్‌‌ట, వీసాలు ఇవ్వటంతోపాటు, 12వేల రూపాయల నగదును అందజేస్తారు. దీంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు, వైద్యం, మందులు, ఆహారం, బిర్యానీ పొట్లాలు వంటివి అందజేస్తాయి. ఇది నిరాటంకంగా సాగుతూనే ఉంది. అయితే... ఈ దేశంలో మంచుకొండల్లో మహాశివుని చూసేందుకు అమర్‌నాథ్‌కు వెళ్లటానికి, టిబెట్‌లో కైలాస మానస సరోవరయాత్రకు వెళ్లే యాత్రికులకు కూడా ఆర్థిక సాయం అందివ్వాలన్న డిమాండ్‌ను ఆ తరువాత ఏ ప్రభుత్వమూ మన్నించలేదు. ఇన్నాళ్ల తరువాత రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి క్రీస్తు ప్రభువు పుట్టిన పవిత్ర జెరూసలేంకు వెళ్లాలనుకునే పేద క్రైస్తవులకు ఆర్థిక సాయం అందివ్వాలని నిర్ణయించారు. 2008 జూలై 21న 29వ నెంబర్‌ జీవో రాష్ట్ర ప్రభుత్వం నుంచి విడుదల కూడా అయింది. నిరుటి బడ్జెట్‌లో సుమారు రెండు కోట్ల రూపాయలనూ కేటాయించేశారు. తరువాత ఎవరో చెప్తే... హిందూ ఆలయాలకూ ఇద్దామని ఆలోచన చేశారు.
ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగాన్ని రూపొందించుకున్నాం. ఈ దేశం లౌకిక రాజ్యమని పెద్ద పెద్ద అక్షరాలతో రాసుకున్నాం. (ఖిౌఠ్ఛిట్ఛజీ ఖిౌఛిజ్చీజూజీట్ట ఖ్ఛిఛిఠజ్చూట, ఈ్ఛఝౌఛిట్చ్టజీఛి, ్ఛఞఠఛజూజీఛి). అంటే భారత దేశం ఏ మతానికి సంబంధించిన దేశం కాదు. ఇక్కడి ప్రభుత్వానికి మతంతో ప్రమేయం లేదు. దేశంలోని ప్రజలందరి దగ్గర నుంచి పన్నుల రూపంలో వసూలు చేస్తున్న డబ్బులను మతపరమైన కార్యక్రమాలకు, విరాళాలకోసం వినియోగించరాదని 27వ అధికరణం స్పష్టంగానే చెప్తోంది. అయినా ప్రభుత్వాలు ఈ అధికరణాన్ని పరిగణలోకి తీసుకోలేదు. ఈ విధంగా మత కార్యకలాపాలకు వాడుకోవటం రాజ్యాంగంలోని 245, 246, 266 అధికరణాలకు విరుద్ధం కూడా. అయినా స్రభుత్వాలకు ఇవేవీ పట్టవు. ప్రజలకు సహాయం చేయటం, చేయూతనివ్వటం ప్రభుత్వాల బాధ్యత ఇందులో ఎవరికీ ఆక్షేపణలు ఉండక్కర్లేదు. దీనికి మతంతో ముడిపెట్టాల్సిన అవసరం లేదు. మతంతో ప్రమేయం లేని ప్రభుత్వాలు మతపరమైన యాత్రలకు నిధులు ఇవ్వవచ్చునా లేదా అన్నది తొలి ప్రశ్న. దీనికి ప్రభుత్వాల దగ్గర ఎలాంటి సమాధానం లేదు. ఉన్నా చెప్పే సాహసం ఎవరూ చేయరు. పేద ప్రజలకు సహాయం చేయటంలో తప్పేమిటని వాదన చేయవచ్చు. దీనికి అంగీకరించాల్సిందే. మరి పాకిస్తాన్‌లోని నాన్‌కానా గురుద్వారాకు ఏటా వేలాది సిక్కులు వెళ్లి పవిత్ర ప్రార్థనలు చేస్తుంటారు. భూటాన్‌లోని బౌద్ధారామాలకు వెళ్లే బౌద్ధులు అనేకమంది ఉన్నారు. ఇక కైలాస మానస సరోవరానికి, అమర్‌నాథ్‌ యాత్రకు వెళ్లే యాత్రికులు వేలల్లో ఉన్నారు. ఇలా వెళ్లే వాళ్లంతా సంపన్నులేం కాదు.. అంతా వారి వారి మతాలకు సంబంధించిన భక్తులే... వాళ్లలోనూ పేదలున్నారు. జీవితంలో ఒక్కసారి భగవంతుని దర్శనం చేసుకోవాలన్న తపన ఉన్నవారు వారు. కానీ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ ఒక్క మతానికి సంబంధించిన వారికి మాత్రమే ఎందుకు సొము్మలు చెల్లించాలి. ఇందుకోసం ఏటా ఇప్పటికే నాలుగు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. అటు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడే మొదలెట్టింది. హైకోర్టు ఆపిందనుకోండి అది వేరే సంగతి. ఇన్ని వందల కోట్లు ఖర్చు చేస్తున్న సర్కారు మిగతా మతాలకూ అదే రీతిలో సాయం చేయాలి.. ఆర్థిక సాయం ఇవ్వాలి. అలా ఇవ్వనప్పుడు లౌకికత్వానికి విలువేముంది? అమర్‌నాథ్‌ యాత్రికులకు తగిన సౌకర్యాలు కల్పించటం కోసం కొంత అటవీ భూమిని అమర్‌నాథ్‌ యాత్రాట్రస్‌‌టకు కేటాయించినందుకు కాశ్మీర్‌లో ముస్లిం అతివాద వర్గాలు ప్రళయాన్ని సృష్టించాయి. ఒక విధాన నిర్ణయం తీసుకుంటే దేశంలోని ప్రజలందరికీ మేలు చేసేలా ఉండాలి కానీ, అది ఒక వర్గానికో, ఒక కూటమికో మాత్రమే మేలు చేసేలా ఉండవద్దు. గమ్మత్తేమిటంటే, మతపరమైన యాత్రలకు ఆర్థిక సాయం చేయాలన్న పద్ధతి ప్రపంచంలోని ఏ ఒక్క దేశంలోనూ లేదు. చివరకు కరడు గట్టిన చాందసవాదులు ఏలుతున్న దేశాల్లోనూ ఈ పద్ధతి లేదు.. పైగా ఖురాన్‌ వంటి పవిత్ర గ్రంథాలు మక్కాకు వచ్చే భక్తులు వారి సొంత నిధులతోనే రావాలి తప్ప, ఎవరి దగ్గరో విరాళంగానో, సాయంగానో తీసుకున్న డబ్బులతో వస్తే ఫలితం రాదని స్పష్టంగా చెప్తున్నాయి. ప్రపంచంలోని అన్ని దేశాలూ ఈ సూత్రాలను ఖచ్చితంగా పాటిస్తున్నాయి. ఒక్క భారత దేశం తప్ప. ఒకరికి సాయం చేయటం తప్పు కాదు. అదే సమయంలో అదే విధంగా ఆర్తులందరికీ సాయం అందివ్వటం బాధ్యత. ఒకరికి కంచం నిండా అన్నం పెట్టి, పక్కనే ఉన్న వాడికి ఖాళీ కంచం చూపించినట్లే మన సర్కారు ప్రభువుల తీరు ఉంది. ఇది ప్రజల మధ్య సామరస్యం కంటే, విభేదాలను మరింతగా పెంచుతుంది. ప్రజల్లో వర్గాలు ఏర్పడితే, విభేదాలు పెచ్చరిల్లితే దేశ సార్వభౌమత్వానికి ఎంత ముప్పో మన వారికి తెలియంది కాదు. తాత్కాలిక రాజకీయ ప్రయోజనాలకు జాతి భవితవ్యాన్ని తాకట్టు పెట్టడం క్షంతవ్యం కాదు.




8 కామెంట్‌లు:

చిలమకూరు విజయమోహన్ చెప్పారు...

బాగా చెప్పారు.

Vinay Chakravarthi.Gogineni చెప్పారు...

baaga raastunnaru...........nenu daily readerni mee blog ki

Kathi Mahesh Kumar చెప్పారు...

మంచి వివరణ,విశ్లేషణ.

kovela santosh kumar చెప్పారు...

thanks for all of you. for giving best comments and reading my articles...

pavan kumar చెప్పారు...

Well said. Supreme court should take this issue and ensure that all religions are treated equally. Your posts are bringing lots of social awareness.

రమణ చెప్పారు...

చాలా బాగా వివరించారు.

అజ్ఞాత చెప్పారు...

(ఖిౌఠ్ఛిట్ఛజీ ఖిౌఛిజ్చీజూజీట్ట ఖ్ఛిఛిఠజ్చూట, ఈ్ఛఝౌఛిట్చ్టజీఛి, ్ఛఞఠఛజూజీఛి).
అదేంటీ చెప్పరా?

నేనొక్కడ్నే ఇంతకు ముందు మంచి మంచి ఆర్టికల్స్ మీద కామెంటేసాను. మరి నాకు థాంక్సు చెప్పలేదు కానీ, వీళ్ళకి చెప్తారా!? మతం అంటే చాలు ఎగేసుకొస్తారు! :)
(just kidding...నా బోటివాడి బోడి హాస్యం అనుకోండి)

తెలుసుకోవాలని ఉంది..మీరు సీనియర్ జర్నలిస్టు అన్నారు.పైగా మంచిగా రాస్తున్నారు.మరి ఇలా ఆర్టికస్ అచ్చేసేసుకుంటే, ఇదే ప్రొఫెషన్లో ఉన్న మీకు ఇది నష్టం కదా! ఎందుకు ఇలా వృధా చేసుకుంటున్నారు? డోంట్ మైండ్ మి ఆస్కింగ్...ఐ వాంటు నో వాట్ ఈజ్ ది ప్రొఫెషన్ ప్రాబ్లెం.

kovela santosh kumar చెప్పారు...

rayraj garu..manninchandi...meelanti sahridayulaku thanks cheppadam ante naaku neenu cheppukunnatle.. naa pai meekunna abhiprayaniki thanks.
ika ee proffessionlo meerannatlu kashtalu undane untayi. proffessionku nyayam chesake sonta pani... blog lo articles kevalam naa trupti kosame...antaku menchi emi ledu