2, జులై 2009, గురువారం

ఎంఎంటిఎస్‌ రెండో దశకైనా మోక్షం లభిస్తుందా?

రాజధాని నగరంలో సునాయాసంగా రవాణాకు దోహదపడుతున్న వ్యవస్థ ఎంఎంటిఎస్‌. ఏటేటా లక్షల సంఖ్యలో రోడ్ల పైకి వస్తున్న వాహనాల కారణంగా నెలకొన్న ట్రాఫిక్‌ ఇబ్బందులకు ప్రత్యామ్నాయంగా నిలిచిన వ్యవస్థ. 2003లో 9 రైళ్లతో ప్రారంభమైన ఈ వ్యవస్థ రెండో దశ ప్రారంభం కోసం నిరీక్షిస్తుంది. ఈసారైనా రైల్వే మంత్రి తన బడ్జెట్‌లో కరుణిస్తారా లేదా చూడాలి.
గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని లక్షలాది ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్న కల ఎంఎం టిఎస్‌ రెండోదశ. పాతకాలం నాటి లోకల్‌ రైళ్లకు ప్రత్యామ్నాయంగా వేగంగా ప్రయాణించే ఎంఎంటిఎస్‌ రైళ్లను రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో రైల్వే శాఖ చేపట్టింది. 9 రైళు్ల , 64 ట్రిప్పులకో రోజూ దాదాపు 60 వేల మంది ప్రయాణికులను గమ్యం చేరుస్తున్నాయి. ప్రస్తుతం వీటి సంఖ్య 16కు చేరుకుంది. లక్షమంది ఈ సౌకర్యాన్ని వినియోగించుకుంటున్నారు.
ఎంఎం టిఎస్‌ రెండోదశ ప్రతిపాదనల పట్ల రైల్వే శాఖ దోబూచులాడుతోంది. భువనగిరిసికిందరాబాద్‌, మనోహరాబాద్‌సికిందరాబాద్‌, ఉందానగర్‌శంషాబాద్‌ తదితర ప్రాంతాలకు ఎంఎంటిఎస్‌ సేవలను విస్తరించాలన్నది ఈ ప్రతిపాదనల సారాంశం. ప్రతి ఏటా రైల్వే బడ్జెట్‌లో ఈ పనులకు సంబంధించిన ప్రకటన వస్తుందని ఆశించటం, ఏమీ రాకపోవటంతో నిరాశపడటం మామూలైపోయింది. రాజధానిలో మెట్రో రైలు ప్రాజెక్టు సత్యం స్కాం కారణంగా నిలిచిపోవటంతో ఎంఎంటిఎస్‌ రెండో దశ అయినా పూర్తయితే, కొంత వరకైనా ట్రాఫిక్‌ సమస్యను పరిష్కరించుకోగలమని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే ముఖ్యమంత్రి వైఎస్‌ స్వయంగా పూనుకుని 614 కోట్ల రూపాయలతో రెండో దశ పనులను చేపట్టాలని కేంద్రాన్ని కోరారు. ఎంఎంటిఎస్‌ కోసం ప్రత్యేకంగా ట్రాక్‌ను నిర్మించాలన్న ప్రతిపాదన కూడా ప్రజలు చేస్తున్నారు. ఎందుకంటే సాధారణ ఎక్‌‌సప్రెస్‌ రైళు్ల నడుస్తున్న ట్రాక్‌లనే ఎంఎంటిఎస్‌లు కూడా వినియోగించుకోవటం వల్ల ఆలస్యంగా గమ్యం చేరటం ఇబ్బందిగా మారింది.
రైల్వే శాఖపై అవసరమైన స్థాయిలో ఒత్తిడి తీసుకువస్తే ఎంఎంటిఎస్‌ రెండో దశ కష్టమేం కాదు..

1 కామెంట్‌:

Praveen Mandangi చెప్పారు...

నేను కూడా హైదరాబాద్ వెళ్ళినప్పుడు సిటీ బస్సులలో ప్రయాణం చేస్తుంటాను. ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఆగిపోవడాలూ, ఆలస్యాలూ. MMTS సర్వీసులు ఎక్కువ అందుబాటులో లేకపోవడం వల్ల వాటిని వినియోగించలేదు.