20, జులై 2009, సోమవారం

ఇప్పుడేం చేస్తారు?

పాకిస్తాన్‌ ఇప్పుడేమంటుంది? మన పాలకులకు ఇకనైనా పౌరుషం వస్తుందా? ముంబయిపై యుద్ధానికి తెగబడింది పాకిస్తాన్‌ ప్రేరిత తీవ్రవాదులేనని ముష్కరుడు అజ్మల్‌ ఆమీర్‌ కసబ్‌ పూర్తిగా అంగీకరించాడు. లష్కర్‌ ఏ తొయెబా కమాండర్‌ జకీర్‌ ఉర్‌ రహమాన్‌ లఖ్వీ మాస్టర్‌ మైండ్‌ అన్న విషయాన్ని కుండబద్దలు కొట్టాడు... మన్మోహన్‌జీ ఇప్పుడేం చేస్తారు? కైరో ప్రకటన ప్రకారం పాక్‌తో ఉగ్రవాదం ఊసులేని చర్చలా? ముష్కరులపై చర్యలా?

పాకిస్తాన్‌ ఏమిటో మళ్లీ రుజువైంది. పాక్‌ సైనిక వ్యవస్థ భారత దేశాన్ని బద్ధ శత్రువుగా పరిగణిస్తున్న వైనం మరోసారి నిజమైంది. ముంబయి పై యుద్ధానికి తెగబడ్డ ఉగ్రవాది అజ్మల్‌ ఆమీర్‌ కసబ్‌ నిప్పులాంటి నిజాలను ఊహించని విధంగా బయటకు కక్కేశాడు. తనతో పాటు టెరర్రిస్టుల బృందం కరాచీ నుంచి సముద్ర మార్గం గుండా ఎలా ముంబయికి చేరుకున్నదీ... అక్కడి నుంచి ముంబయిలోని మూడు ప్రాంతాలపై ఎలా దాడులకు పాల్పడిందీ పూసగుచ్చినట్లు వివరించాడు. ముంబయి దాడుల్లో పోలీసులకు చిక్కిన ఏకైక టెరర్రిస్టు కసబ్‌. సముద్ర మార్గం మీదుగా తమను కరాచీ నుంచి తరలించింది లష్కర్‌ ఎ తొయెబా కమాండర్‌ ఇన్‌ ఛీఫ్‌ జకీ ఉర్‌ రహమాన్‌, అబు హమ్‌జా అని గుట్టు రట్టు చేశాడు. కసబ్‌ కన్ఫెషన్‌ స్టేట్‌మెంట్‌తో డిఫెన్‌‌స లాయర్‌ కళు్ల బైర్లు కమ్మాయంటేనే అర్థం చేసుకోవచ్చు, కసబ్‌ ఎలాంటి షాక్‌ ఇచ్చాడో. పాకిస్తాన్‌లోని ఫరీద్‌కోట్‌కు చెందిన కసబ్‌ 150 మందిని ప్రాణాలు బలిగొన్న ముంబై దాడుల ఘటనలో కసబ్‌ కీలక నిందితుడు. పాకిస్తాన్‌ నౌకాదళం ఇతనికి పూర్తిస్థాయి సైనిక శిక్షణ ఇచ్చింది. సముద్ర గర్భంలో ఎక్కువకాలం ఉండి పోరాడే శిక్షణ కూడా కసబ్‌ పొందాడు. వీళ్లందిరనీ లష్కర్‌ చీఫ్‌ లఖ్వీ తన కనుసన్నల్లో ముందుకు నడిపించాడు. ఈ విషయాన్ని భారత దర్యాప్తు బృందం దాడులు జరిగిన రోజుల వ్యవధిలోనే వెల్లడించింది.. పాక్‌ సర్కారుకు ఆధారాలతో సహా రుజువులు చూపించింది. పాకిస్తాన్‌పై ఒత్తిడి తీసుకురండంటూ అమెరికా బాసులకు భారత సర్కారు వినతులు చేసుకుంది. బాబ్బాబూ.. కాస్త మా వైపు చూడకుండా హెచ్చరించండంటూ వైట్‌హౌస్‌లో అప్పటి దొర బుష్‌ను వేడుకుంది. బుషూ్ష కాసేపు బుసకొట్టాడు. ఆయన వందిమాగధ బృందమూ తందానా పాడింది. తరువాత వచ్చిన ఒబామా గద్దెనెక్కక ముందునుంచే నిప్పులు కక్కాడు. మనం ఇస్తున్న సాయాన్నంతా పాకిస్తాన్‌ భారత్‌పై అణు దాడికి సన్నద్ధం కావటానికే వాడుకుంటోందని తెగ ఆవేదన చెందాడు. తీరా పీఠం పై కూర్చున్నాక ఆ సంగతే మర్చిపోయాడు. ఎప్పటిలాగే నిధుల మంజూరీని ఉదారంగా ఇచ్చేస్తున్నారు. పాక్‌కు ఈ సంగతులన్నీ తెలుసు కాబట్టే.. కసబ్‌ అనేవాడు తమ దేశానికి చెందిన వాడు కానే కాదంది. ప్రపంచం మెహర్బానీ కోసం లఖ్వీని అరెస్టు చేసినట్లే చేసి విడుదల చేసేసింది. అసలు భారత్‌ ఇచ్చినవి సాక్ష్యాలే కాదు పొమ్మంది. తరువాత కసబ్‌ తమవాడేనని చిన్నగా ఒప్పుకుంది. కానీ, 26/11 దాడులకు తమకు ఎలాంటి సంబంధం లేదన్న పాత పల్లవిని మాత్రం వదల్లేదు. పైగా బలూచిస్తాన్‌లో భారత్‌ తాలిబన్లతో కుమ్మకై్క తమపై దాడులకు దిగుతోందని ఆరోపించింది. మన ప్రధానమంత్రి మహా ఉదారులు కదా.... మొన్న కైరోలో పాకిస్తాన్‌ ప్రధానమంత్రి ఈ మాట అన్నదే తడవుగా దానిపై చర్చకు సిద్ధమని అజెండాలో చేర్చేశారు. బలూచిస్తాన్‌లో దాడులపై చర్చకు భారత్‌ ఒప్పుకుంది కానీ, భారత్‌పై ఉగ్రవాదాన్ని ప్రేరేపింస్తున్నారన్న ఆరోపణలపై మాత్రం చర్చించరట. ఉగ్రవాదుల ఊసు లేకుండానే చర్చలు జరిపేందుకు సింగ్‌జీ క్షణం ఆలస్యం చేయకుండా ఒప్పేసుకున్నారు. ఇదేమిటని విపక్షాలు ప్రశ్నేస్తే.. అదంతే లెమ్మని కొట్టిపారేశారు. ఇవాళ కసబ్‌ పాక్‌ ముసుగును పూర్తిగా తొలగించాడు. మరి సింగ్‌జీ ఇప్పుడేం చేస్తారు? ఇంకా శాంతి పన్నాలు పలుకుతూనే ఉంటారా? అమెరికా విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్‌ ఇప్పుడిక్కడే ఉన్నారు కదా? ఈ స్టేట్‌మెంట్‌పై ఆమె కామెంట్‌ ఏమిటని ప్రశ్నించవచ్చు కదా? మన ప్రభుత్వానికి ఆ ధైర్యం ఉందా? ఇప్పటికైనా పాకిస్తాన్‌ను నిలదీసే ధైర్యం మన్మోహన్‌కు ఉందా? అంటే అనుమానమే. పాకిస్తాన్‌ వద్ద అణ్వస్త్రం ఉందన్న కారణం చేతనో, మరో రాజకీయ సమీకరణాల వల్లనో పాక్‌లోని ఉగ్రవాద శిబిరాలను విచ్ఛిన్నం చేయటంలో ముందడుగు వేయలేకపోతున్నాయి.




5 కామెంట్‌లు:

Praveen Mandangi చెప్పారు...

తమది దేశ భక్తుల పార్టీ అని చెప్పుకునే పార్టీ కదా. ఉగ్రవాదం విషయంలో వాళ్ళకి చిత్తశుద్ధి లేక పోయినా, వోట్ల కోసం చిత్త శుద్ధి ఉందని చెప్పుకోవాలి.

Saahitya Abhimaani చెప్పారు...

యేమి చెయ్యరండి. మనవాళ్ళు చెయ్యటాని యేమున్నది. యెమన్న చెస్తే, మనదేశంలోనే ఉన్న పిరికి ఉదారవాదులు ఊరుకుంటారా. ముందు సమస్య వీళ్ళదగ్గరనుంచే. రేపు కసాబ్ ముష్కరుడికి శిక్షపడినా(??), అమలు చెశే అవకాశం ఉన్నదంటారా?? మనకున్న అరుంధతీ రాయి లు, కమ్యునిస్ట్ మానవతా(!!)వాదులు ఎంత అల్లరి చెస్తారు( వీళ్ళకి (జిహాది) టి.వి (రాజ్దీప్ సర్ దేసాయి, భార్క దత్, వంటి వాళ్ళు వంత పాడి ఇటువంటి అల్లరి చేసే ఓ నలుగురికి అమితమైన ప్రచారం, ప్రాచుర్యం కలిగిస్తారు-పనికిరాని పానెల్ చర్చలు పెట్టి మనం యేనాడు వినని చూడని వాళ్ళని పట్టుకొచ్చి, వాళ్ళకి ముందుగానే తయారు చేసిన స్క్రిప్ట్ చదివించి, మాట్లాడించి ). మెజారిటీలో ఉన్న మనలాంటి వాళ్ళం నిశ్శబ్దంగా ఉండటానికి అలవాటు పడ్డాం కదా, పేపర్లో ఈ వార్త చదివి పేజీ తిప్పేస్తాం (అంతకన్న మరేముంది చెయ్యటానికి!!). చివరికి ఈ టెర్రరిస్ట్ కి పిల్లనివటానికి కూడ కొంతమంది ముందుకొచ్చినా ఆశ్చర్యం లేదు. ఈ మధ్యనే టైంస్ ఆఫ్ ఇండియాలో పనె చెసే ఆడ జర్నలిస్ట్ ఒక పానెల్ చర్చలో, కసబ్ కు ఉన్న హాస్య ప్రియత్వం గురించి చాలా ముచ్చటగా చెప్పటం (వాడేదో ఆమే కొడుకైనట్టు) విన్నాను. అన్నీ అయినాక, పాకిస్తాన్లో తప్పుడు ఆరోపణలో మరణ శిక్షపడిన భారత ఖైదీ ని విడిపించుకోవటాని వీడిని సకల మర్యాదలతో(కొత్త బట్టలు, వాళ్ళింట్లో వాళ్ళకి కానుకలతోసహా) వాఘా భోర్డర్ దగ్గర వదిలేస్తారు. కులదీప్ నయ్యర్ గారు ఆనంద భాష్పాలు విడుస్తారు.

kovela santosh kumar చెప్పారు...

siva garu.. na avedananu artham chesukunna vallu intakalaniki dorikaru. ee avesham bharatiyulandarilo vaste.. meeranna koddi mandi aa chupulaki kottukupotaru...aa pourushame kavali
santosh kumar

Praveen Mandangi చెప్పారు...

మన ఇండియన్ పాలకులు పాకిస్తానీ పాలకుల కంటే గొప్పవాళ్ళు కాదు. సిటీ ఎలైట్ కథ చివరి వరకు చదవండి. http://sahityaavalokanam.net/kathanilayam/2009/august/city_elite.html

Saahitya Abhimaani చెప్పారు...

I was proved wrong. After all to err is human and sometimes, we underestimate our Government.