2, జులై 2009, గురువారం

రైల్వేల్లో మనకు న్యాయం జరిగే అవకాశమే లేదా?

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఏర్పడి యాభై ఏళు్ల దాటిపోయింది. సగటున లెక్కేసుకున్నా ఏడాదికి కనీసం పది కిలోమీటర్ల మేర మాత్రమే రైల్వే లైను వేయగలిగారంటే ముక్కున వేలేసుకోవలసిందే. కానీ ఇది కఠిన వాస్తవం. గత నలభై ఏళ్లలో మన రాష్ట్రంలో పూర్తయిన రైలు మార్గం కేవలం 440 కిలోమీటర్లే..ఇక మిగతా పెండింగ్‌ ప్రాజెక్టుల గురించి ఏమని చెప్పేది.. ? ఎంత చెప్పుకున్నా ఏం ప్రయోజనం..?
పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా రవాణా సౌకర్యాన్ని ఏర్పాటు చేయటం రైల్వేల ప్రధాన బాధ్యత. కానీ ఆ బాధ్యతను రైలే శాఖ పూర్తిగా విస్మరించింది. కాదు.. కాదు.. రైల్వే మంత్రులు మర్చిపోయినట్లు నటిస్తున్నారు. దక్షిణ మధ్య రైల్వేకు ప్రధాన కేంద్రం మన రాష్ట్రంలో ఉన్నప్పటికీ, తమిళనాడు వారికి ఉద్యోగాలు ఎక్కువగా లభిస్తాయి. అయినా అడిగేవారుండరు. అత్యధిక ఆదాయం ఇక్కడి నుంచే రైల్వేలకు లభిస్తున్నా, కనీసం ప్రాజెక్టులైనా మనకు సక్రమంగా దక్కవు. కనీసం మంజూరైన ప్రాజెక్టులకైనా నిధులు అవసరమైనన్ని కేటాయిస్తారా అంటే అదీ లేదు.. ఉదాహరణకు 500 కోట్ల రూపాయలు అవసరమైన చోట యాభై లక్షలు విదిలిస్తారు.. ఇంతకంటే దౌర్భాగ్యం మరొకటి ఉండదు. కొత్త ప్రాజెక్టు ప్రకటించటానికి పెద్దగా అభ్యంతరం ఉండదు. ప్రాజెక్టులు ప్రకటించగానే అది సర్వేతో మొదలవుతుంది. ఇక అక్కడి నుంచి ఒక్క అడుగు కూడా ముందుకు కదలదు. ఇలా మన రాష్ట్రంలో సర్వేలు పూర్తి చేసుకుని, అసలు పని కోసం ఎదురుచూస్తున్న ప్రాజెక్టులు కొల్లలుగా ఉన్నాయి. ఎన్‌డిఏ హయాంలో రైల్వే శాఖకు సహాయమంత్రిగా మన రాష్ట్రం నుంచి బండారు దత్తాత్రేయ పనిచేసినప్పటికీ, ఆయన వల్ల ఒనగూరిన ప్రయోజనం మాత్రం అంతంత మాత్రమే...
దత్తాత్రేయ ఎన్ని మాటలైనా చెప్పవచ్చు గాక.. ఒకటి రెండు రైళు్ల తెస్తే తెచ్చి ఉండవచ్చు గాక.. కానీ... వాస్తవంగా మన రాషా్టన్రికి సంతృప్తి కర స్థాయిలో మేలు జరగటం కల్లో మాట. పోనీ మంజూరైన పథకాలనైనా సక్రమంగా పూర్తి చేశారా అంటే అదీ లేదు. గతంలో ఒకసారి కాజీపేటలో కోచ్‌ ఫ్యాక్టరీ అన్నారు. సర్వే చేయించారు. ఆ తరువాత రాజీవ్‌ గాంధీ గారు.. దాన్ని పంజాబ్‌కు తరలించుకుపోయారు. మొన్నటికి మొన్న అదే కాజీపేటలో ఎలక్ట్రిక్‌ రైలింజన్‌ వర్‌‌కషాప్‌ను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చినట్లే ఇచ్చి, లాలూ ప్రసాద్‌యాదవ్‌ బీహార్‌లోని తన నియోజక వర్గానికి తరలించుకుపోయారు. ఇదేమని ఆ మంత్రిని నిలదీసిన ఎంపిలు లేరు.
1993 నుంచి 2007 వరకు మన రాషా్టన్రికి ఆరు మాత్రమే కొత్త రైలు మార్గాలకు కేంద్రం పచ్చజెండా ఊపింది. నిధులు కూడా అప్పుడప్పుడూ విడుదలవుతూ వచ్చాయి. కానీ వీటిలో ఏ ఒక్కటి కూడా ఇప్పటి వరకు పూర్తి కాలేదంటే, రైల్వే శాఖ ఎంత గొప్పగా మన పట్ల వ్యవహరిస్తోందో అర్థం చేసుకోవచ్చు. 199394లో 517.63 కోట్ల రూపాయల వ్యయంతో పెద్దపల్లికరీంనగర్‌నిజామాబాద్‌ మార్గంలో 177.37 కిలోమీటర్ల పొడవున రైలు మార్గం పనులు మొదలయ్యాయి. సక్రమంగా నిధులు విడుదల చేస్తే అనుకున్న ప్రకారం రైలు మార్గం పూర్తయ్యేది. కానీ, నిధులు సరిగ్గా ఇవ్వకపోవటం, పనుల్లో అసాధారణ జాప్యం ప్రాజెక్టు విలువను అమాంతంగా పెంచేసింది. దీని ఫలితం ప్రాజెక్టు విలువ నాలుగు వేల ఎనభై మూడు కోట్లకు చేరుకుంది. ఇక నంద్యాలఎరగ్రుంట్ల, మునీరాబాద్‌రాయచూర్‌, గద్వాలరాయచూర్‌, జగ్గయ్యపేటమేళ్ల చెరువు మార్గాల పనులూ నత్త నడకనే నడుస్తున్నాయి. భూసేకరణలో జరిగిన జాప్యమే పనులు ఆలస్యం కావటానికి కారణమని అధికారులు అంటున్నారు. కానీ, రాష్ట్ర ప్రభుత్వం తన వాటా కింద ఇవ్వాల్సిన నిధులను విడుదల చేయకపోవటం కూడా సమస్యే. కడప బెంగుళూరు మార్గంలో వెయ్యి కోట్ల వ్యయంతో 255 కిలోమీటర్ల పనులకు గత సంవత్సరంలో కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినా అదీ ఇదే కారణంతో ఆగిపోయింది. కొత్తపల్లిమనోహరాబాద్‌ మార్గంలో కొత్త లైను ఏర్పాటుకు సంబంధించి కేవలం సర్వే మాత్రమే పూర్తయింది. పనుల నిధులను మాత్రం విడుదల చేయలేదు.
రెండోసారి విజయం సాధించటమే కాకుండా, కాంగ్రెస్‌కు కేంద్రంలో తిరుగులేని అధికారాన్ని దక్కించటంలో కీలక పాత్ర పోషించిన వైఎస్‌ మమతాబెనర్జీ నుంచి ఏమాత్రం సాధించినా రాషా్టన్రికి మేలు జరుగుతుంది

3 కామెంట్‌లు:

సుబ్రహ్మణ్య ఛైతన్య చెప్పారు...

ఆచివరివాక్యం మీలోని ఆశావాదిని తెలుపుతోంది. ఆతైకి ఇక్కడ పెద్దగా పనిలేదు కాబట్టి యూపీకో, బీహారుకో అంతదూరం పోలేకపోతే తమిళనాడుకైనా పంపెయ్యండి టికెట్ చేతిలోపెట్టి.

సుబ్రహ్మణ్య ఛైతన్య చెప్పారు...

మీకు గుర్తు ఉందో?లేదో? ఎవరో ఎంపీ ఆంధ్రకి అన్యాయం జరుగుతోంది అంటే వెంటనే లాంకోగారు అబ్బే అలాటిది ఏమీ లేదని నిండుసభలో ప్రసంగించారు. కొన్ని సందర్భాల్లో అందరినీ ఒప్పించటం కష్టం అని సూక్తులు వల్లించాడు.

Padmarpita చెప్పారు...

మీ పరిశీలనా దృక్పధం బాగుంది. ఆశావాదిగా జీవిద్దాం...ఏమంటారు?