తెలంగాణ ఉద్యమం రోశయ్య కుర్చీ కిందకు నీళు్ల తీసుకురానుందా? రోశయ్య వ్యతిరేక వర్గం ఉద్యమాన్ని పక్కదారి పట్టించేందుకు ప్రయత్నించనుందా? సిఎం సీటునుంచి రోశయ్యను తప్పించేందుకు ఉద్యమాన్ని పావులా వాడుకునేందుకు ప్రయత్నం జరుగుతున్నదా? టిఆర్‌ఎస్ అదే చెప్తోంది... నేతలు అదే ఆరోపిస్తున్నారు... కానీ వాస్తవం ఏమిటి? ఉద్యమాన్ని కాంగ్రెస్‌లోని రాజకీయ శక్తులు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నాయా?
తెలంగాణ ఉద్యమం వడివడిగా అడుగులు వేస్తూ ముందుకు కదులుతోంది. సర్కారుకు ఊపిరి సలపనీయకుండా, రోజుకో రూపంలో, రోజుకో మార్గంలో ఉద్యమాన్ని విద్యార్థులు, మేధావులు, వివిధ వర్గాల తెలంగాణ ప్రజలు ఉధృతంగా ముందుకు తీసుకువెళు్తన్నారు... ఎల్లుండి జరుగబోయే అసెంబ్లీ ముట్టడి పన్నెండు రోజుల ఉద్యమ ప్రస్థానంలో అతి పెద్ద మలుపు...
శాసన సభ సమావేశాలు ఓ పక్క జరుగుతుండగా అసెంబ్లీని ముట్టడించే ప్రయత్నం చేయటం విద్యుత్ ఉద్యమం తరువాత ఇదే తొలిసారి.. కానీ, ఈ మహా ముట్టడి వెనుక కుట్రకోణం దాగి ఉందని తెలంగాణ రాష్ట్ర సమితి తీవ్రంగానే ఆరోపిస్తున్నది. ఉద్యమంలో మావోయిస్టులు, ఇతర అసాంఘిక శక్తులు చేరి హింసాత్మకం చేసే అవకాశం ఉందని ఓ వైపు పోలీసులు చేస్తున్న ప్రచారాన్ని తిప్పి కొడుతూనే ముఖ్యమంత్రి రోశయ్యను గద్దె దింపడానికి అసెంబ్లీ ముట్టడిని పావులా వాడుకుంటున్నారన్నది తెరాస వాదన.
మరో సీనియర్ నాయకుడు నాయిని నర్సింహారెడ్డి ఇంకాస్త దూకుడుగా ముందుకెళ్లి దివంగత వైఎస్ సన్నిహితుడు కెవిపిని వేలెత్తి చూపిస్తున్నారు...
గతంలో చెన్నారెడ్డిని, ఇతర కాంగ్రెస్ ముఖ్యమంత్రులను దింపేందుకు రకరకాల కుట్రలు జరిగిన ఆరోపణలను కాంగ్రెస్‌లోని అసమ్మతి వర్గాలు ఎదుర్కొన్నాయి. ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉత్పన్నమైంది. అయితే ఈ ప్రచారం అంతా రోశయ్యను పక్కకు తప్పించేందుకా? లేక తెలంగాణ ఉద్యమం నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకా? లోగుట్టు తెలిసేదెవరికి?
5 కామెంట్‌లు:
udyamaanni neeru garchadaniki denikaina tegistaru...
తెలంగాణా ప్రజలు ప్రత్యేక రాష్ట్రం కోరుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి సోలిడారిటీ ఇస్తున్నాను. నేను తెలంగాణాలో ఉన్నది నాలుగేళ్ళు. మా అమ్మానాన్నలు ఎనిమిదేళ్ళు తెలంగాణాలో ఉన్నారు. అది వరంగల్, కాజీపేట, కరీంనగర్ పట్టణాలలో. వ్యక్తిగతంగా నాకూ, తెలంగాణాకూ ఉన్న సంబంధం అంతవరకు. తెలంగాణా వస్తే హైదరాబాద్ లో వ్యాపార సామ్రాజ్యాలు నిర్మించుకున్న రామోజీ రావు లాంటి ఆంధ్రా వ్యాపారులకి నష్టం. హైదరాబాద్ కి 800 కిలో మీటర్లు దూరంగా శ్రీకాకుళంలో బతుకుతున్న నాకు ఎలాంటి నష్టం ఉండదు. ప్రత్యేక తెలంగాణా వల్ల చాలా మంది ఆంధ్రుల జీవితాలలో ఎలాంటి మార్పూ రాదు. తెలుగువాళ్ళకి రెండు రాజధానులు వస్తాయి. కొత్తగా విశాఖపట్నం చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు (విజయనగరం జిల్లా కొత్తవలస, భోగాపురం మండలాలు)లో రియల్ ఎస్టేట్స్ ధరలు పెరుగుతాయి. ఇలా కోస్తా ఆంధ్రలో కొంత మంది జీవితాలు ఆర్థికంగా బాగుపడతాయి.
kvp కి కాని ys jagan కి కాని ఎలాంటి అవసరం లేదు. జగనే కాంగ్రెస్ కాంగ్రెస్ జగన్.
future congress is jagan. ఈరొజు జగన్ ఒక శక్తి.జగన్ ఒక్కడె future congrees leader. there is no jagan no congress. this words tells from heart.. sonia know about kk vh ds. she always big proirity about jagan.
kk ds vh వీళ్లకి ఎంతమంది వొట్లు వెస్తారు. వాళ్ళనె అడగండి.
తెలంగాణా ఉద్యమాన్ని ఎవరికీ కావలసిన విదంగా వాళ్ళు వాడుకుంటున్నారు.....జగన్ ప్లీజ్ స్టాప్ ది గేమ్స్.....నిజమైన స్టూడెంట్స్ are not doing these arachakam....they dont get get anything by spoiling a bus....
రవీంద్రనాథ రెడ్డికి హైదరాబాద్ లో ఆస్తులు ఉన్నాయి. ప్రత్యేక తెలంగాణా రావడం రవీంద్రనాథ రెడ్డికి ఇష్టం లేనప్పుడు అతని మేనల్లుడు జగన్ కి కూడా ఇష్టం ఉండదు. జగన్ బెంగళూరులో ఉన్నా, హైదరాబాద్ లోని అతని మేనమామ ఆస్తుల విలువ తగ్గకూడదు అని అనుకుంటాడు. మన రాజకీయ నాయకులకి బంధు ప్రీతి ఎక్కువ కదా.
కామెంట్‌ను పోస్ట్ చేయండి