23, డిసెంబర్ 2009, బుధవారం

నేను నా దీక్ష

గౌరవనీయ ఎంపి లగడపాటి రాజగోపాల్‌జీ సినిమాటిక్‌ దీక్ష డ్రామా ప్రస్తుతానికి సుఖాంతం అయింది. దేశంలో నిరశన దీక్షలకు సరికొత్త నిర్వచనం ఇచ్చిన దీక్ష లగడపాటి రాజగోపాల్‌ది. అయిదు రోజుల పాటు దీక్ష చేసినా అసాధారణ ఆరోగ్యపటిమకు యావత్‌ ప్రపంచం నివ్వెర పోయింది. దీక్ష ప్రారంభించటానికి ముందు 81 కిలోగ్రాముల బరువున్న రాజగోపాల్‌ దీక్ష కారణంగా రోజుకు 1.25 కిలోగ్రాము తగ్గుతూ వచ్చినా

(దీక్ష అంటే నిరాహార దీక్షనా కాదా అన్నది ఆయన చెప్పలేదు.. ఇవాళ ప్రెస్‌ కాన్ఫరెన్‌‌సలో కూడా దీక్ష అనే చెప్పారు.. ఇంగ్లీషు వెర్షన్‌లో మాత్రమే ఫాస్‌‌ట అన్న పదాన్ని వాడారు.. ఎందుకంటే వారం క్రితం లాల్‌బహదూర్‌ స్టేడియంలో కూర్చున్నప్పుడు తింటే తింటాం.. లేకపోతే లేదు.. అని విస్పష్టంగా మైకుల ముందు చెప్పారు. కూడా.. దాన్ని అక్షరాలా పాటించారు...) ఆయన ఆరోగ్య పటిమ ఎంతమాత్రం తగ్గలేదు.. సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో రాజగోపాల్‌ చెప్పిన వివరాలే ఇవి. ఒక మనిషి బరువు రోజూ కిలోంబావు తగ్గినా ఆరోగ్యంగా ఉన్నారంటే అది మామూలు విషయం కాదు.. ప్రతి ఒక్కరూ ఆయన దగ్గర ధ్యానం, యోగ నేర్చుకోవలసిందే... షిర్టీ సాయిబాబా ప్రతిరోజూ ఖండయోగ సాధన చేసే వారట... శరీరంలోని అంగాలన్నీ ముక్కలు చేసి విసిరేసినట్లు పడేసి తిరిగి మళ్లీ అతికించుకునే వారని ఆయన గురుచరిత్రలో సంత్‌ హేమాడ్‌ పంత్‌ రాస్తారు... అలాగే లగడపాటి రాజగోపాల్‌ చేస్తున్న యోగా కూడా ఏదో అసాధారణమైన యోగమే. కేవలం ప్రాణాయామంతోనో.. కేవలం ధ్యానం తోనో ఇది సాధ్యమయ్యే పని కాదు.. అయిదు రోజుల్లో ఆరు కెజిల బరువు తగ్గినా ఇంత బాగా పిటి ఉష కంటే స్పీడ్‌గా పరిగెత్తి పరిగెత్తి ఊహించని రీతిలో జంప్‌ చేసి మరీ మంచం మీద పడుకోగానే మత్తుగా మూల్గడం ఓ గొప్ప అనుభూతి.. ఎంతో సాధన చేస్తే కానీ అలాంటి ఫీట్‌ సాధ్యం కాదేమో.. దీక్ష 19వ తేదీన్నే విరమించినట్లు రాజగోపాల్‌గారే స్వయంగా ప్రకటించారు.. ఎప్పుడైతే ఫ్లూయిడ్‌‌స ఎక్కించారో అప్పుడే దీక్ష విరమించినట్లు లెక్క అన్నారు.. దీక్ష విరమించినట్లు దీక్ష చేస్తున్న వ్యక్తే స్వయంగా భావిస్తున్నప్పుడు ఘనాహారం తీసుకోలేదా? కారణం ఏమిటి? ఐవి ఫ్లూయిడ్‌‌స ఎక్కించటంతోనే కోర్టు ఆదేశాలతోనే అనుకోండి.. దీక్ష భగ్నం అయినట్లు, ముగిసినట్లు లగడపాటి స్వయంగా చెప్తున్నారు.. మరి ఘనాహారం తీసుకోకుండా ఉండాల్సిన అవసరం ఏముంది? అప్పుడే దీక్ష ముగిసినట్లు ఆయనే స్వయంగా భావిస్తే ఘనాహారం తీసుకోకపోవటం అన్నది ఒక నాటకమా? మరి చివరి నిమిషం దాకా ఆయన అనుచర వందిమాగధ గణం, ఆయన అనుచర నాయకుడు జెసి దివాకర్‌ రెడ్డి, మర్రి శశిధర్‌ రెడ్డి చివరకు నిమ్‌‌సలో కూడా లగడపాటి దీక్ష చేస్తున్నారనే ఎందుకు చెప్తూ వచ్చారు.. 19న దీక్ష విరమించినట్లు విలేఖరులతో చెప్పిన లగడపాటి వాళ్లకు మాత్రం చెప్పలేదా? కోర్టు ఆదేశాలతో దీక్ష భగ్నం అయినట్లు భావిస్తే.. మరి మిగతా నేతలు మాత్రం దీక్ష కొనసాగిస్తున్నట్లు ఎందుకు చెప్పినట్లు? మంగళవారం మధ్యాహ్నం దీక్ష విరమించనున్నట్లు ఎందుకు ప్రకటించినట్లు.. అసలు ఆయన దీక్ష ఎప్పుడు ముగిసింది? లగడపాటి తనంత తానుగా చెప్పినట్లు 19వ తేదీ ఉదయాన్నా? లేక లగడపాటి తనంత తానుగా ప్రెస్‌క్లబ్‌లో గ్లూకోజ్‌ నీళు్ల తాగినప్పుడా? ఏది నిజం?
19వేదీన దీక్ష విరమించినట్లు ఆయన అనుకున్నప్పుడు ఆయన ఆహారం తీసుకుని ఉండవచ్చు. అలాంటప్పుడు ఆయన ఆసుపత్రిలో వైద్యం తీసుకోవలసిన అవసరం ఏముంది? వైద్యమే అక్కరలేనప్పుడు నాటకీయ ఫక్కీలో నిమ్‌‌సకు పారిపోయి రావలసిన అవసరమే లేదు.. అందరి కళు్ల గప్పి మంచంపై ఎగిరి గంతేసి పడుకొని అనారోగ్యం నటించాల్సిన అగత్యమే లేదు.. మరి లగడపాటి ఎందుకీ చర్యకు పాల్పడ్డారు? ఏదో విజయవాడ పోలీస్‌ కమిషనర్‌ను మేనేజ్‌ చేసి ఆయన హైదరాబాద్‌కు తప్పించుకుని వచ్చి ఉండవచ్చు. ఏదో సినిమాలో బ్రహ్మానందం అన్నట్లు మీది తెనాలే, మాది తెనాలే అన్న లెవల్లో కమిషనర్‌తో మాట్లాడి ఉండవచ్చు.. అందుకే ఆయన దర్జాగా ఆసుపత్రి నుంచి బయటకు వచ్చి వెళ్లి పోతున్నా పోలీసులు చేష్టలుడిగి చూస్తూ ఉండిపోయారు.. విజయవాడ ఆసుపత్రి వద్ద పోలీసుల వ్యవహార శైలి లగడపాటి కదలికల గురించి వారికి తెలుసునన్న విషయం విస్పష్టంగా చెప్పకనే చెప్తున్నాయి. మీడియాలో ఆ విజువల్‌‌స వారి పాత్రను అనుమానాస్పదంగా చూపుతున్నాయి. అందుకే రోశయ్య సర్కారుకు వారిపై వేటు వేయకతప్పలేదు.. నిమ్‌‌సకు రావటం అన్నది కెసిఆర్‌ను ఒక విధంగా ఇమిటేట్‌ చేయటమే.. ఐవి ఫ్లూయిడ్‌‌స ఎక్కించుకోవటానికి నిమ్‌‌స దాకా రావాలా? మరో గమ్మత్తేమిటంటే తమ దగ్గర మెరుగైన సౌకర్యాలు లేవంటూ ఆసుపత్రి వర్గాలు ఇచ్చిన ఓ రిపోర్టును చూసి తనను డిశ్చార్జి చేశారని అనుకున్నారట ది గ్రేట్‌ లగడపాటి. అలా భావించేసి రాత్రికి రాత్రి క్వాలిస్‌ ఎక్కేసి.. ఆసుపత్రి గేట్లు బద్దలు కొట్టుకుంటూ సారీ ఢీ కొట్టుకుంటూ వెళ్లిపోయారట.. డిశ్చార్జి అయిన రోగులు బయటకు ఎలా వెళ్లాలో.. చాలా చక్కగా చేసి చూపించారు లగడపాటి.. ప్రజలకు ప్రజాప్రతినిధులకంటే ఆదర్శులు ఎవరుంటారు చెప్పండి.. తనను తాను డిశ్చార్జి చేసినట్లు భావించిన లగడపాటి ఆసుపత్రి నుంచి బయటకు వచ్చాక నిమ్‌‌సకు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? సమైక్యాంధ్ర కోసం ప్రాణాలైనా అర్పించాలని తీర్మానించుకున్న మహానుభావుడు మళ్లీ దీక్షా శిబిరానికి వెళ్లి ఎందుకు కూర్చోలేదు? తెలుగువారందరినీ ఒకటిగా ఉంచాలని ప్రాణార్పణకు సిద్ధపడ్డ వ్యక్తి వైద్యాన్ని కోరుకోవటం ఏమిటి? చివరకు నిమ్‌‌సకు ఆయన వస్తే ఆయనకు ఏం వైద్యం చేయాలో అక్కడి డాక్టర్లకు బుర్ర బద్దలు కొట్టుకున్నా అర్థం కాలేదు.. ఓ సెలైన్‌ బాటిల్‌ ఎక్కించి, ఒకటి రెండు పరీక్షలు చేసేసి బాబూ ఇక బాగున్నావ్‌ వెళ్లమన్నారు..దీనికోసం ఐసియు బెడ్డు... పోలీసు పహారా.. సామాన్య రోగుల నానా అవస్థలు.. టిఆర్‌ఎస్‌ ఆందోళనలు.. భేష్‌... ఒక నాయకుడి డ్రామాకు ఇంతకంటే సంరంభం ఏం కావాలి? లగడపాటి ఎందుకు నిమ్‌‌స వచ్చారో అదీ ఆయన విలేఖరుల సమావేశంలో చెప్పకనే చెప్పారు.. తాను నిమ్‌‌స వచ్చింది హైదరాబాద్‌లో ఒక అస్థిర వాతావరణాన్ని సృష్టించటానికి.. తాను నిమ్‌‌సకు వస్తే.. టిఆర్‌ఎస్‌ ఎలాగూ ఆందోళన చేస్తుందని, తెలుసు.. విద్యార్థులూ తీవ్ర విధ్వంసానికి పాల్పడతారని ఆయన భావించి ఉండవచ్చు. ఎందుకంటే అంతకు ముందురోజే ఆయనకు, ఓయు విద్యార్థుల మధ్య ఎన్‌టివి లైవ్‌షోలో వాగ్వివాదం జరిగింది. విద్యార్థులు చెప్పులు చూపించేంతగా ఆవేశకావేశాలు వచ్చాయి. దాన్ని దృష్టిలో ఉంచుకునే ఆయన ఈ ప్లాన్‌ వేసుకున్నారు..తాను రావటం వల్ల విధ్వంసం జరిగితే.. తనకే రక్షణ లేనప్పుడు మిగతా ఆంధ్రులకు రక్షణ ఎక్కడుంటుందని ప్రశ్నించేందుకు అవకాశం ఉంటుంది.. ఇది ఒక విధంగా మరింత ఆందోళనకర వాతావరణాన్ని సృష్టించేందుకు, తద్వారా కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు ఆస్కారం ఉంటుంది. కానీ, ఆయన మూర్ఖత్వానికి తగిన గుణపాఠం చెప్పారు విద్యార్థులు.. ఖాళీ నిరసనలతో సరిపుచ్చారు.. చేసుకున్నవాడికి చేసుకున్నంత అన్నట్లు లగడపాటి చర్యే ఆయనకు రివర్‌‌స అయింది. అధిష్ఠానం నుంచి పిలుపు వచ్చింది. ఇలాంటి పిచ్చి చేష్టలకు భద్రత కల్పించటం తనవల్ల కాదని పోలీసు కమిషనర్‌ కుండబద్దలు కొట్టారు.. ఢిల్లీ నుంచి అహ్మద్‌ పటేల్‌ మందలింపు లాంటి సూచన చేశారు. జెసి వచ్చి హెచ్చరించారు.. గంటలో సీన్‌ మారిపోయింది. నిరాహార దీక్ష విరమిస్తున్నట్లు ప్రకటించారు..ప్రెస్‌క్లబ్‌కు వచ్చి తన చర్యలను సమర్థించుకోవటానికి నానా నానా తంటాలు పడి మరీ ఇబ్బంది పడి..జవాబులు చెప్పీ చెప్పక.. గాంధీనీ, ఫ్లూయిడ్‌‌సనీ, ప్రాచీన ఆధునిక దీక్షలనీ ప్రస్తావిస్తూ పాపం లగడపాటి విలేఖరుల సమావేశాన్ని ముగించారు..

లగడపాటిని ఇన్ని రోజుల పాటు దీక్షకు అనుమతించిన ప్రభుత్వం కెసిఆర్‌ను వేదిక దగ్గరకు పోకుండానే అరెస్టు చేసింది.. అక్కడి నుంచి ఖమ్మం ఆసుపత్రికి తరలించింది. 24 గంటలు కాకుండానే ఆయన జ్యూస్‌ తాగుతున్న విజువల్‌ మీడియాకు లీక్‌ చేసింది. ఆ వార్త వినగానే తెలంగాణాలో దావానలం పుట్టింది. కెసిఆర్‌ దీక్ష విరమిస్తే.. ఆసుపత్రి నుంచి బయటకు రానివ్వమని తీవ్రస్థాయిలో విద్యార్థులు ఆందోళన కారులు హెచ్చరించారు.. దిష్టిబొమ్మలు తగులబెట్టారు.. దీక్ష నుంచి ఒక్క క్షణం కూడా ఆదమరవకుండా జాగ్రత్తపడ్డారు. ఆ తరువాత కెసిఆర్‌ నిజాయితీతో దీక్షను కొనసాగించారు. తాను నిమ్‌‌సకు వస్తానని ఆయన కోరలేదు. ఆయన కుటుంబ సభ్యులే మానవహక్కుల సంఘానికి ఫిర్యాదుచేసి మరీ నిమ్‌‌సకు తరలించేలా చూసుకున్నారు.. టోటల్‌ పేరెంటల్‌ ఫ్లూయిడ్‌‌స ఇవ్వటం వల్ల మనిషి 30 సంవత్సరాలైనా దీక్షలో ఉండవచ్చని లగడపాటి చెప్పారు.. కానీ, కెసిఆర్‌ దీక్ష చేస్తున్న సమయంలో నిమ్‌‌స డైరెక్టర్‌ ప్రసాదరావు స్వయంగా మాట్లాడుతూ టిపిఎన్‌ ఇచ్చినంత మాత్రాన ఇబ్బంది ఉండదని భావించటం పొరపాటని, ఘనాహారం తీసుకోకపోవటం వల్ల రక్తంలో గట్‌‌స బ్యాక్టీరియా సమస్యాత్మకం అవుతుందని అది క్రమంగా రోగనిరోధక శక్తిని తగ్గిస్తుందన్నారు.. ఏ మీడియా చానల్లోనైనా ఈ వాయిస్‌ రికార్డుల్లో ఉంది వెరిఫై చేసుకోవచ్చు.... మరి లగడపాటి మోసపూరిత డ్రామాకు ఆంధ్ర కాదు కదా.. విజయవాడలో ఒక్క మనిషి కూడా ఆయన్ను నిలదీసే సాహసం చేయలేదు.. ఆ దము్మలు లేవు ఎవరికీ.. లగడపాటి చర్యను విద్యార్థులైనా గట్టిగా ప్రశ్నించిన పాపాన పోలేదు.. ప్రజల్లోంచి.. తెలుగుతల్లి గర్భసంచిలోంచి పుట్టుకొచ్చిన ఉద్యమ స్ఫూర్తికి ఇంతకంటే తార్కాణం ఏముంది? ఇక అజ్ఞాతలు ఏమంటారో...

11 కామెంట్‌లు:

పదనిసలు చెప్పారు...

మీ టపాకు ధన్యవాదములు. మీ టపాకు సమాధానంగా నేను టపా వేయవలసి వచ్చింది. మీ టపాలోని కొన్ని ప్రశ్నలికి నా టపాలో జవాబులు దొరుకుతాయేమో చూసుకోండి.. :) మీ సౌలభ్యం కోసం నా టపా లంకె..

http://padanisalu.blogspot.com/2009/12/blog-post_22.html

అజ్ఞాత చెప్పారు...

lagadapati lanti latukoru galla gurinchi matladavaddu anna.okanokanni urikichi urikichi tannale.

Jai telangana

అజ్ఞాత చెప్పారు...

no telugu person will accept your comments. you will know what kind of person is lagadapati in near future. please remember you telangana's no more part of telugu people. in the past few days I come to know the nature of telangana people. I hate telangana people now.

Trader చెప్పారు...

This post sucks on a whole. KCR's drama was far more entertaining than lagadapati's.

KCR had idli and sambar in the hospital. His family members didnot even allow doctors for an hour each day when they visited him. But lagadapati was open to everybody.


Moreover, KCR is with saline all 10 dayz. He acted as if he is going to die and then got discharged the next day he gave up the so called "Deeksha". Now you can assume who is more sincere.

If after 5 days of "Deeksha" lagadapati running is wrong, then what is it called if after 10 days of so called "Deeksha" KCR runs home.

c'mon man.. it's not a wrong thing you raise ur voice for telangana. But its wrong to support some stupids like KCR. Try to come out of your ignorance and get a life. lol..

Trader చెప్పారు...

accept the comment if you really have guts. :) ..

కొండముది సాయికిరణ్ కుమార్ చెప్పారు...

కెసిఆర్ లు, లగడపాటిలు ప్రజానాయకులా, జోకర్లా!!

kovela santosh kumar చెప్పారు...

ఓ వేణు సార్‌ ... మీ కామెంట్‌ను యాక్సెప్‌‌ట చేసేందుకు గట్‌‌స దేనికి? మామూలుగానే ఉంది. నువ్వు పురుగుల పడి చస్తావ్‌ అన్న కామెంట్‌నే యాక్సెప్‌‌ట చేశా.. మీరు సంయమనం కోల్పోకుండానే రాశారు.. విమర్శను విమర్శగా స్వీకరించటానికి సహృదయత ఉండాలి కానీ ద్వేషం ఉండకూడదు.. మీరు నాపోస్‌‌ట కొంతవరకైనా చదివి కామెంట్‌ రాశారనే అనుకుంటాను...కాకపోతే పూర్తిగా చదివినట్లు నేననుకోవటం లేదు.. కొంతవరకైనా చదివినందుకు ధన్యవాదాలు..
మొదటిది కెసిఆర్‌ డ్రామాలను ఏరోజూ ఏ ఒక్క తెలంగాణ వాదీ ఎంటర్‌టైన్‌ చేయలేదు.. ఆయన డెడ్‌లైన్లు, డెత్‌వారంట్లు ఇచ్చినప్పుడు ఎన్నికల్లో దిమ్మతిరిగేట్లు ఓడగొట్టారు.. ఆమరణ దీక్ష చేయటానికి ఆయన పూనుకున్నప్పుడు కూడా ఆయనపై తెలంగాణలో 80శాతం ప్రజలకు ఆయన ఎంతవరకు కొనసాగిస్తారన్న విశ్వాసం లేదు.. కాకపోతే లగడపాటిని దీక్ష చేయనిచ్చారు.. ఈయన్ను అసలు దీక్షే చేయనివ్వలేదు... ఇక ఆయన ఒకటిన్నర రోజు దీక్ష చేశారని లగడపాటివారే అన్నారు... ఖమ్మం మెజిస్ట్రేట్‌ ముందు హాజరుపరిచి అక్కడి జైలుకు తరలించినప్పుడు అక్కడ ఆయన ఆహారం తీసుకోలేదనటానికి స్పష్టమైన రికార్డెడ్‌ ఆధారాలున్నాయి. జైలు అధికారుల వద్ద.. అక్కడి నుంచే ఆయన్ను ఆసుపత్రికి షిఫ్‌‌ట చేశారు... ఆసుపత్రిలో జ్యూస్‌ తాగిన విజువల్‌‌స మీడియాలో వచ్చాయి. వాటిని అంతా చూశారు.. ఇందులో సందేహం ఎవరికీ ఉండనవసరం లేదు... మీరన్నట్లు ఇడ్లీ సాంబార్‌ తిని ఉంటే ఉండవచ్చు కూడా.. మీ మాటను నేను ఎంతమాత్రం కాదనటం లేదు.. ఇప్పటి పోస్‌‌టలో నేను కెసిఆర్‌ను సమర్థించనూ లేదు.. కెసిఆర్‌ ఒకరోజులో దీక్ష విరమించినట్లు మీడియాలో వార్తలు రాగానే తెలంగాణ ప్రజలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.. ఆసుపత్రి నుంచి బయటకు వస్తే శవయాత్ర చేస్తామని హెచ్చరించారు.. దిష్టిబొమ్మలు దగ్ధం చేశారు.. ఇవన్నీ కెసిఆర్‌ను భయపెట్టాయో.. మేల్కొల్పాయో తెలియదు కానీ, పది రోజుల పాటు సెలైన్లపైనైనా దీక్ష చేశారు... తమ నాయకుడు మాట తప్పితే దారిలోకి తీసుకువచ్చి దీక్షలో తిరిగి కూర్చోబెట్టిన సత్తా తెలంగాణ ప్రజల్లో ఉంది.. ఈ విషయాన్ని ఈ పోస్‌‌టలో విస్పష్టంగా రాశాను...
ఇక ఆయన దీక్ష విరమించింది కేంద్రం స్పష్టమైన హామీ ఇచ్చిన తరువాతే అన్న సంగతి మీరు మరిచినట్లున్నారు.. ఒక లక్ష్యం కోసం దీక్షకు పూనుకున్న వ్యక్తి, ఆ లక్ష్యాన్ని సాధించిన తరువాత దీక్ష విరమించకపోతే ఏం చేస్తారు? కెసిఆర్‌కు తెలియదు..మాకూ తెలియదు.. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తామని కాంగ్రెస్‌ కాదు.. కేంద్ర ప్రభుత్వం విస్పష్టమైన ప్రకటన చేశాక కెసిఆర్‌ దీక్ష విరమించినట్లు ప్రకటించారు.. మీరన్నట్లు సెలైన్‌ దీక్షే కావచ్చు... దీక్షల్లోని డొల్లతనాన్ని నిన్న లగడపాటి ఎలాగూ బయటపెట్టారు కదా... మొత్తం మీద కెసిఆర్‌ స్పష్టమైన హామీనైతే సాధించిన తరువాతే ఇంటికి వెళ్లారు.. అది కూడా వెంటనే డిశ్చార్జి చేయలేదు.. రెండు రోజుల పాటు నిమ్‌‌స వైద్యులు ఆసుపత్రిలోనే ఉంచారు.. ఆయన ఆరోగ్య పరిస్థితి కొంత కుదుటపడ్డదని నిర్ధారించుకున్న తరువాత డిశ్చార్జి చేశారు.. ఆయన లగడపాటి లాగా పరిగెత్తలేదు.. వీల్‌చైర్‌లో కూర్చొన్న ఆయన్ను తీసుకెళ్లారు.. అంబులెన్‌‌సలో తీసుకువెళ్లారు.. పదిరోజులు విశ్రాంతి తీసుకున్న తరువాతే ఆయన తిరిగి బయటకు వచ్చారు.. to be continued

kovela santosh kumar చెప్పారు...

కెసిఆర్‌ దీక్ష చేసిన అన్ని రోజుల్లోనూ రెండు గంటలకోసారి నిమ్‌‌స డైరెక్టర్‌ ప్రసాదరావు గారు స్పెషల్‌ మెడికల్‌ బులెటిన్‌ ప్రసారం చేశారు.. కెసిఆర్‌ ఆరోగ్య పరిస్థితి గురించి వివరించారు.. చివరి రోజున అంటే తొమ్మిదో తేదీన ఆయనే ఇక నేనేం చేయలేనంటూ చేతులెత్తేశారు.. ఆయన్ను కెసిఆర్‌ మేనేజ్‌ చేశారా అంటే ఆంటే ఆయన తెలంగాణా వాడేం కాదు.. ఆంధ్రప్రాంతానికి చెందిన వైద్యుడే... ఇక నిమ్‌‌స అన్నది ప్రభుత్వ ఆసుపత్రి.. కెసిఆర్‌ జ్యూస్‌ తాగిన సంగతిని ఖమ్మం ఆసుపత్రిలోనే కెమెరాతో షూట్‌ చేసి మీడియాకు విడుదల చేసిన సర్కారు, కెసిఆర్‌ ఏ చిన్న తప్పటడుగు వేసినా బయటపెట్టేందుకు సిద్ధంగా ఉంటుందన్న వాస్తవాన్ని చిన్న పిల్లవాణ్ణి అడిగినా చెప్తాడు.. ఎందుకంటే ఉద్రిక్తతలు తగ్గి కెసిఆర్‌ డిఫేమ్‌ కావటం ప్రభుత్వానికి అవసరం... కానీ అలా చేయటానికి అవకాశం లేకపోయింది.. చివరకు ప్రకటన వచ్చిన తరువాతే ఆయన జ్యూస్‌ తాగారు.. మీరు స్టుపిడ్‌ లగడపాటిని గుడ్డిగా సమర్థించారు.. సంతోషం.. కానీ. కెసిఆర్‌ ఒకనాటి స్టుపిడిటీని నేను వేలెత్తి చూపానన్న వాస్తవాన్ని పాతపోస్టుల్లోకి వెళ్లి చూస్తే మీకు తెలుస్తుంది.. కేసియార్‌ దీక్ష విరమించినప్పుడు ఆయన్ను నిలదీసి బలవంతంగా కూర్చొబెట్టిన తెలంగాణ విద్యార్థులను అడిగితే మీకు తెలుస్తుంది... చివరగా ఒక మాట.. ప్రాంతం మీద అభిమానం ఉండటం తప్పుకాదు.. సమస్యే కాదు.. దొంగ నాయకుల డొల్లతనం ఏమిటో బయటపడిన తరువాత కూడా సమర్థించుకోవాలనుకోవటమే తప్పు... ఆంధ్రప్రాంతం గొప్పగా అభివృద్ధి చెందినంత మాత్రాన తెలంగాణాను, ఆ ప్రాంత వాసులను గుడ్డిగా విమర్శించటం తప్పు.. మేము ప్రశ్నలు వేస్తున్నాం.. మాకు తెలిసిన నిజాలను వెల్లడిస్తున్నాం.. అందులో ఒక్కదానికి సరైన జవాబులు చెప్పండని కోరుతున్నాం.. తప్పులుంటే ఎత్తిచూపమని అడుగుతున్నాం.. కానీ, ఏ ఒక్కదానికీ నిర్మాణాత్మకంగా స్పందించిన అజ్ఞాతలు లేరు.. నిజాల్ని అంగీకరించే ధైర్యమే లేదు.. ఎక్కడ మొత్తం పోస్టు చదివితే కన్విన్‌‌స కావలసి వస్తుందేమోనని భయం ఒకటి వెంటాడుతూ ఉండవచ్చు. తప్పు కాదు. సైద్ధాంతిక విభేదాల్లో ఇది సహజమే. ఏ ఒక్కదానికీ మారు మాటాడకుండా, తోచినపదాలతో తిట్లతో, శాపనార్థాలతో ఎదురుదాడులు చేస్తున్నారు కొందరు.. . బాధితులం మేము.. భరిస్తాం. మీరైనా సంయమనంతో సద్విమర్శ చేశారు. ధన్యవాదాలు

అజ్ఞాత చెప్పారు...

ముసుగులో గుద్దులాట ఎందుకు. అంధ్రప్రదెశ్ అంటే హైదరబాదు..హైదరబాదు అంతే అంధ్రప్రదెశ్ . హైదరాబాదు కాకుండా రాష్త్రంలో ఒక్క జిల్లా ఐనా లేదా పట్టణమైన self sufficient ఐనది చూపించండి చూద్దాం! వూల్లో దోమలకి పొగవేయడానికి కూడా డబ్బులు హైదరాబాదు నుంచి మంజూరు అవ్వాలి.ఈ రాష్త్రంలో వుద్యోగాలు create చేయబదుతున్న ఏకైక పట్టణ హైదరబాదు. ఇప్పుడు ఈ రాష్త్రాన్ని రెండుగా చేసినా , మూడుగా చేసిన అందరికి హైదరబాదులో సమాన వాటా దక్కాలి. అంతేనా కాదా? ఇప్పుడు జరుగుతున్న సమైక్యవాద పోరాటం అందుకే!

vishnu_nkd చెప్పారు...

ayya agnatalu meenunchi naa ko samadanam kavali 50 tr kritam telugu vadanevadu ee rastram lo lera ?vividiga undi vallu sukangaa lera mari ippudu vachina kastalento evelaa yella cheritra kaligina ee nelaa ennosarlu vida bhadindi kalapa badindi manam matrame diniki bhaditulam kadu maro vishayam meeru kovela blog lo vimarshinchadaniki try chestunnaru adi mari na lanti telanganavadini ea vidanga santrupti chestundi andukani vimarshinchalante telanganku jarigina anyalu nijam kadani nirupinchandi appudu merekadu memukuda jai andhrapradesh antam antekani ado maa akroshanni cheppukuntunnam ante ardam ledu telanganaku jarigindi nayame i te nirupinchandi maro vishayam hyd guri matladukovam anavasaram andralounna mamulivadi ki hyd gurchi avasaram ledu alage hyd vachinna mamulu andra vadiki ikkadi nunchi velle avasaram kudaledu kcr lanti vallyna maa lanti vallynaa kevalam telangana rakunda emchestaro ani bhadato antunna matale avi marokati rojuchastunna jenanni chustunte kuda meeku teliyadam leda telangana korukune avasaram anto kevalam swaparipalanakosame kani meepie dweshamto kadu ardam chesukondi marokati telangankosam tananu tanu chamkuntunna vadu telanganaku meeruga addu padite mimmmalnichamdanikuda venakadadu kadantara intaga penchukunna bavedtogalato kaliundadam avasarama vidipoyeee kalisudalemaa ??? kalisundi kotladukuntune undamaa???

అజ్ఞాత చెప్పారు...

memu vachake investmentlu pettake telangana vikasinchindani.. kaabatti vaallaki sonta abhiprayalu undakudadani.. vaallu maa banisalugane undalani andhra netala vaadana.. aakansha...anduke inta durmargapu addankulu kapistunnaru... telangana vallanu vaaru manushuluga kaadu.. banisalugaane chustunnaru.. vaari abhipraayalaku, akroshaniki asalu viluva ekkadundi