25, డిసెంబర్ 2009, శుక్రవారం

దోషులెవరు?

ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగుదేశం ఎమ్మెల్యేలపై దాడి జరిగింది.. దాడికి బాధ్యులు విద్యార్థులేనా? తానే దాడి చేసానంటూ మీడియా ముందుకు వచ్చిన శ్రీకాంత్‌రాజా? ఒక సీనియర్‌ రాజకీయ నాయకుడిపై అమానుషుంగా దాడి జరిగి 24 గంటలైన తరువాత కూడా ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు..? నిందితుని ఎందుకు అదుపులోకి తీసుకోలేదు? ప్రభుత్వ తాత్సారం వెనుక మతలబు మరేదైనా ఉందా? నాగం జనార్ధనరెడ్డిపై జరిగిన దాడిలో దోషులెవరు?
నాగంపై దాడికి బాధ్యులెవరు?
విద్యార్థులా? శ్రీకాంతరాజా?
ఎఫ్‌ఐఆర్‌లో శ్రీనాథ్‌రాజు పేరు ఎందుకు చోటు చేసుకోలేదు?
అసలు దోషులు ఎవరు?

ఉస్మానియా యూనివర్సిటీలో తెలుగుదేశం ఎంఎల్‌ఎ నాగం జనార్ధనరెడ్డిపై దాడి జరిగినప్పటి నుంచీ రకరకాల ప్రచారాలు వెలుగులోకి వచ్చాయి. ఒక సీనియర్‌ నాయకుడిపై జరిగిన దాడిపై సర్వత్రా నిరసన వ్యక్తమైంది. కొందరు దుండగులు కోపావేషాలతో నాగం జనార్ధనరెడ్డిని కొట్టడాన్ని మీడియా ప్రస్ఫుటంగా ప్రసారం చేసింది. దాడి చేసిన వ్యక్తి క్షణాల్లోనే మీడియా గుర్తించింది.
నల్గొండ జిల్లా తిరుమలగిరి సమీపంలో మాచనపల్లికి చెందిన నాగరాజు అలియాస్‌ శ్రీకాంత్‌ రాజుగా నిందితుని గుర్తించింది. పోలీసులు కూడా ఈ విషయాన్ని ధృవీకరించారు.
శ్రీకాంత్‌రాజు మాజీ నక్సలైటు ఇతనిపై రాబరీ, దోపిడీలు, హత్య వంటి దాదాపు 40 కేసులు నమోదయి ఉన్నాయి.
నాగం జనార్ధన రెడ్డిని తాను కొట్టినట్లు శ్రీకాంత్‌రాజు పూర్తిగా అంగీకరించాడు.. ఎలక్ట్రానిక్‌ మీడియాతో ఫోన్లలో మాట్లాడుతూ కెసిఆర్‌ను నిందించినందుకే నాగంను కొట్టినట్లు అంగీకరించాడు.. మరి ఇతని విషయంలో పోలీసులు ఎందుకు నిర్లిప్తంగా ఉందో అర్థం కాదు... పైగా నాగం జనార్ధన రెడ్డి గన్‌మన్‌ వి రామ్‌గోవర్ధన్‌ ఫిర్యాదు మేరకు ఓ ఎఫ్‌ఐఆర్‌ కూడా నమోదయింది. ఇందులో 147, 148, 355, 427, 149 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఇందులో ఎక్కడా శ్రీకాంత్‌ పేరు లేదు... కొందరు ఉస్మానియా విద్యార్థులు అన్నదే నిందితుల స్థానంలో ఉంది. మరి తాను కొట్టినట్లు ఒప్పుకున్న శ్రీకాంత్‌ వ్యవహారం వీడియో ఫూటీజ్‌తో సహా అందుబాటులో ఉన్నప్పుడు అతనిపై సర్కారు ఎందుకు చర్యకు పూనుకోవటం లేదు..?
విద్యార్థులు తాము కొట్టలేదన్నారు.. నిందితుడు శ్రీకాంత్‌ తాను కొట్టానని ఒప్పుకున్నాడు.. మరి ఎవరిపై కేసు పెట్టాలి? ఎవరిని విడిచిపెట్టాలి? సామాన్యుడికి సైతం అర్థమయ్యే ఈ అంశంలో పోలీసులు ఎందుకు ఇలా వ్యవహరించాల్సి వచ్చింది.. వారి వెనుక పనిచేసిన శక్తులేమిటి? విద్యార్థుల ఉద్యమాన్ని బలహీనం చేసేందుకే సర్కారు ఈ విధమైన ఒత్తిడిని విద్యార్థులపై రుద్దుతోందా?
శ్రీకాంత్‌రాజు తల్లితెలంగాణ పార్టీ కార్యకర్తగా పనిచేశాడు.. ఇప్పుడు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అనుచరుడని ప్రచారంలో ఉంది... అసలు బయటి వ్యక్తి అయిన శ్రీకాంత్‌రాజు క్యాంపస్‌లోకి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? ప్రేక్షకుడిగా చూడాల్సిన వ్యక్తి నాగం దగ్గరకు వెళ్లి ఎందుకు చేయి చేసుకోవలసిన అవసరం ఏమొచ్చింది? తాను ఒక్కడిగా వెళ్లానని శ్రీకాంత్‌రాజు అంటున్నాడు.. పది బైకులపై దుండగులు వచ్చారని ప్రత్యక్ష సాక్షు్యలంటున్నారు? ఎవరిది నిజం? నిజం ఏదైనా నాగంపై దాడి చేసింది విద్యార్థులు కాదన్నది నిష్ఠుర సత్యం. మరి పోలీసులు పక్షపాతంతో వ్యవహరించారని అనుకోవాలా? లోగుట్టు పెరుమాళ్లకెరుక.......

3 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

ఇంకెందుకు ఒకడు మీకు అలవాటైన కూత కూయండి అందోల్ల పని అని ఇంకా indirect గా ఎందుకు ? అన్దోల్లకు పనా పాటా తూ తూ

Phani చెప్పారు...

tappEmi jaragalEdu, ishtam ochinattu maatlaaditE intakantE ekkuva jarugutayi...

అజ్ఞాత చెప్పారు...

తెలబానూ! ఓ తెలబానూ!
సొంతింటికే నిప్పుపెట్టే ఓ తెలబానూ!
కన్నతల్లికే ద్రోహంచేసే ఓ తెలబానూ
సొంత అన్నదమ్ములనే ద్వేషించే ఓ తెలబానూ
కొరివిదయ్యాలకు కోరస్ పాడే ఓ తెలబానూ
శకుని మామ(జయశంకర్), దురహంకారి
దుర్యోధన (కేసీఆర్)మాయలో మెదడు
మొద్దుబారిన ఓతెలబానూ
ఇకనైనా కళ్ళుతెరిచి చూడు
మాతృవందనం చేసుకో
భ్రాతృహననం ఆపుకో