25, డిసెంబర్ 2009, శుక్రవారం

ప్రజల ఉద్యమం అంటే ఇది

ఇప్పుడు తెలంగాణ రగిలిపోతోంది. నిజమైన ప్రజల ఉద్యమం ఏమిటో ఇప్పుడు ప్రపంచం కళ్లారా చూస్తోంది... నవంబర్‌ 29 నుంచి డిసెంబర్‌ 23 వరకు జరిగిన ఉద్యమాలన్నీ ఒక ఎత్తు... డిసెంబర్‌ 23 నుంచి తెలంగాణలో జరుగుతున్న ఉద్యమం ఒక ఎత్తు... ఇంతవరకు ఒక్క రాజకీయ నాయకుడు ప్రత్యక్ష ఆందోళనలోకి దిగలేదు..

కేంద్ర ప్రభుత్వం అలియాస్‌ సోనియా అర్థం లేని అనర్థ ప్రకటన తెలంగాణను నిప్పుల కుంపటిగా మార్చేసింది. తెలంగాణలోని అన్ని జిల్లాల్లో , హైదరాబాద్‌తో సహా అన్ని జిల్లాల్లో దిష్టిబొమ్మల చలిమంటలు చెలరేగాయి. హైదరాబాద్‌లో జాయింట్‌ యాక్షన్‌ కమిటీ నిర్మాణంలోనే తెలంగాణ నేతలు తలమునకలైపోయారు.. కానీ, వీధుల్లో జనం వీరవిహారం చేశారు.. వాళ్ల ఆగ్రహావేశాలకు, ఆక్రోశానికి కనపడ్డ బస్సు కనపడినట్లు ధ్వంసం అయింది. రైలు బోగీలు తగులబడిపోయాయి. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులు నష్టపోతున్నాయి. కేవలం విద్యార్థుల వల్లనే ఉద్యమం ఇంత తీవ్రం కాలేదు... ఇది స్పష్టం.. నాయకులు అసలు డైరెక్‌‌ట ఫ్రేమ్‌లోకి ఎంటరే కాలేదు.. ఇదీ సుస్పష్టం... కాలనీల్లో,, గల్లీల్లో, వీధుల్లోకి వేల మంది జనం వచ్చారు.. ఒక చోట రాస్తారోకో చేశారు.. రాస్తారోకోల్లో రోడ్డుపైనే వండుకు తిన్నారు.. ఇంకోచోట ఆవేశంతో తలో రాయి తీసుకువచ్చి సరిహద్దు దారిని గోడ కట్టి మూసేశారు.. ఇంకోచోట రైళ్లను ఆపేశారు.. బోర్డులపై తెలంగాణ అని రాశారు.. ఆంధ్రప్రాంత వ్యాపార సంస్థలను లక్ష్యం చేసుకున్నారు...
చిదంబరం ప్రకటన తరువాత కొంత సాఫ్‌‌ట కార్నర్‌గా మాట్లాడిన కాంగ్రెస్‌ ఎంపిలు ఈ తీవ్రతను చూసి వెంటనే రూటు మార్చేశారు.. రాజీనామాలు క్షణం ఆలస్యం చేయకుండా చేసేశారు...తిరగబడ్డ జనాన్ని చూసి అన్ని పార్టీల నాయకులు, మంత్రులూ కూడా ఆందోళనలోకి దిగిరాక తప్పని పరిస్థితి ప్రస్తుతం తెలంగాణాలో నెలకొని ఉంది. ప్రజలు ఏం చెప్తే అదే బాటలో నడిచి తీరాల్సిన పరిస్థితిని నాయకులకు కల్పించటంలో జనం విజయం సాధించారు... ఏం చేయాలో తోచక ప్రభుత్వం అదనపు బలగాలను పిలిపించుకుంది... ఖచ్చితమైన అణచివేతకు రంగం సిద్ధం చేసుకుంది... క్యాంపస్‌లో విద్యార్థులను అణచివేయవచ్చు. కానీ వీధుల్లో సామాన్య ప్రజల ఆగ్రహాన్ని ఎలా చల్లారుస్తారు.. 1969 లాగా కాల్పులు జరిపే అవకాశాలు లేకపోలేదు.. అలా చేస్తే ఉద్యమం ఆగిపోతుందా? జనం రెచ్చిపోతారా? ఏం జరుగుతుంది. ప్రశాంతంగా ఆంధ్ర, తెలంగాణ ప్రజలు ఉంటున్న ప్రాంతాల్లో సమైక్యం పేరుతో చిచ్చు రేపారని ఎప్పుడో ఆంధ్రప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడ్డ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. వాస్తవం ఏమంటే వాళూ్ల తెలంగాణాకు సై అంటున్నారు.. జై కొడుతున్నారు.. అటు కోస్తాంధ్ర నుంచి ఎంపి హర్షకుమార్‌ సైతం తెలంగాణ ఇచ్చేయాలంటూ మాట్లాడుతున్నారు. ప్రజలంటే వీళు్ల... నిజమైన ప్రజాభిప్రాయం అంటే ఇది. భావోద్వేగం అంటే ఇది. 2009 సంవత్సరాంతంలో ప్రజల గుండె లోతుల్లోంచి పెల్లుబికిన ఉద్యమ జ్వాలకు ప్రతి తెలుగువాడు సాక్షీభూతంగా నిలుస్తున్నాడు.

14 కామెంట్‌లు:

మాగంటి వంశీ మోహన్ చెప్పారు...

హబ్బా! భలే చెప్పారు కోవెలగారూ ! - గాలిగోపురం మీద విహారం చేస్తూన్నంత ఆనందంగా కళ్ళు విచ్చుకున్నాయి. ఇంత ఆనందం నిజమైన కోవెలకు వెళ్ళినప్పుడు కూడ పొందలా !

అజ్ఞాత చెప్పారు...

>>కేంద్ర ప్రభుత్వం అలియాస్‌ సోనియా అర్థం లేని అనర్థ ప్రకటన తెలంగాణను నిప్పుల కుంపటిగా మార్చేసింది.<<

మన తప్పులేమిటో మనం తెలుసుకోకుండా పక్కనోడిని అనడం మాననంత కాలం మన మధ్య చిచ్చు ఆగదు.

బ్లాగులో కాయ చెప్పారు...

బాగా రాశావ్. .. ఇంకా ఇలాంటివి రాయి ... అలాగే ఈ ప్రాంతాలను అభివ్రుద్ది చేయడానికి ఆలోచనలను కూడా వ్రాయి.....

అజ్ఞాత చెప్పారు...

నువ్వు కూడా పోయి అందులో దూకు దరిద్రం వదులుతుంది , నిన్న దాకా సోనియా మీ నాయకుదుడి కి అమ్మ కదా ఇవాళ మతి తప్పిందా . నీ లాంటి దరిద్రులే ఉన్నట్టున్నారు సిగ్గు లేకుండా బస్సు లు కాల్చారు అని చెప్పుకున్తున్నావ్ నీ లాని వాళ్లు మీడియా ని ఎలుతుంటే ఇక ఇలా కాక ఎలా ఉంటది . రోజు ఒక సారి పురుగులు పది చావమంటున్నారు అనుతున్నావ్ కదా అది కాదు నీలాంటి వాడే ఒక పెద్ద పురుగు ఛీ ఛీ

Saahitya Abhimaani చెప్పారు...

ఏమి చెప్పారండి! ఆంధ్రప్రదేశ్ లో పది కోట్లకు పైగా జనాభా ఉన్నట్టుగా అంచనా. మీరనే ఉద్యమాలలో ఇలా రోడ్డునపడ్డవాళ్ళు ఇటుపక్కనగాని అటు సమైక్య ఆంధ్ర అనిగాని ఎంతమంది ఉంటారని మీ ఊహ? అటొక 20వేలు ఇటోక 25వేలు. మొత్తం జనాభాకు వీళ్ళు ప్రతినిధులా. క్షణికావేశంలో హడావిడి చేస్తుంటే అదే ప్రజాభీష్టం అనుకుంటే అంతకంటే పొరబాటు మరొకటిలేదు. వేర్పాటుకు ఇంత ఇష్టమైతే, 1969 తెలంగాణ ఉద్యమం వెను వెంటనే మూడేళ్ళల్లో 1972లో ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం వచ్చినప్పుడు, ఆ ఉద్యమాన్ని తెలంగాణ ప్రాతంనుండి కూడ వత్తాసు పలికి ఉంటే, పరిస్థితి ఎలా ఉండేది? ఒకపక్కవాళ్ళు ప్రత్యేకం అన్నప్పుడు రెండోపక్కవాళ్ళు మెదలకుండా ఊరుకోవటం, మరికొన్నాళ్ళకు వేర్పాటు అని 350 మందిని పోలీసు కాల్పుల్లో కోల్పోయిన వాళ్ళే సమైక్య మంత్రం పఠించటం, చూస్తుంటే తెలియటంలేదా ఇవన్ని (రెండుపక్కలా) రాజకీయ నాయకుల ప్రమేయంతోనే ఇవన్ని జరుగుతున్నయని. వాళ్ళు ప్రజాభీష్టమని ఊరికే నాటకాలాడుతున్నారు. మరో ఆరునెల్ల తరువాత చూడండి, అసలు ఇటువంటిది ఒకటి జరిగిందా అని ఆశ్చర్యపోతాము అప్పటి రాజకీయ చిత్రాన్ని చూసి.

జింతాకు చెప్పారు...

ఉద్యమం కాదు ఉన్మాదం...
నలుగురి ఉసురుపోసుకొని, పది మందికి శాపం పెటి....చేసేది అసలైన ఉద్యమం అంటారు.. భేష్.

మీలాంటి మేధావులే హింసను అసలైన ఉద్యమం అని సమర్ధిస్తూంటే తల తిరిగిపోతోంది. రేపట్నుంచి మాకు కూడూ గుడ్డా, గొడ్డూ గోదా వద్దు... ఇప్పటికిప్పుడు లెక్కలు చూసుకోకుండా రాష్ట్రాన్ని చీల్చెయ్యండి అంటారు. ఇప్పుడు జార్ఖండ్ పరిస్థితి చూస్తున్నారుగా రాష్ట్రం చిన్నది, పార్టీలు ఎక్కువ. తలా పిడికెడు సీట్లు వచ్చేసరికి హంగ్ అసెంబ్లీ. నాయకులకు లాలూచీ పడటంతోనే సరిపోతుంది. ఇంకెక్కడి అభివృద్ది. రాష్ట్రం అంటే మనుష్యులోయ్ మట్టి కాదో అన్నాడో మహానుభావుడు (మీ రాష్ట్రంకు వారు కాదులెండి). మట్టి కోసం మనుష్యుల్ని వేరు చేసి సాధించేదేమిటి? ఈ ఉద్యమాలు మీకు జరిగిన అన్యాయాలకు వ్యతిరేకంగా చేసుంటే బాగుండేది. రేపు తెలంగాణా వచ్చిన తరువాత, ఈ రాజకీయ రాబంధులను నిలదీసే దమ్ములు ఎవ్వరికీ ఉండవు చూడండి. వినాశకాలే విపరీత బుద్ది.

అన్నట్టు.. మూడున్నర కోట్ల మందికి నిరసన తెలిపితే ఇంత హింస జరిగింది. మరి రేపు ఆరున్నర కోట్ల మంది హింస చేస్తే తట్టుకోగరలరా? హింసతో సాధించేదేమీ లేదు బాసూ. విద్వేషాల నడుమ విడిపోవడం అనేది జాతుల మధ్య శాశ్వత దూరం అవుతుంది. ఇండియా...పాకిస్తాన్ లగా.

చూస్తూండండి... ఏమి జరుగుతుందో.

venkatesh చెప్పారు...

orpanatanam anedi okati undi.. adi andhra vallaku konchem ekkuva untundi.. telangana ku anukulanga okka maata rasinaa sahinchaleni paristhiti, vaishamyam ippudu nelakoni unnayi.. nijaalu cheptene nindinchamantaru.. balavantudi daashteekam mundu balaheenudu eppudu niluvaledu sumaaaa..mee pakvaannaalalo karivepakula upayogapadataniki telanganaa kavaali.. asalu vishayanni matladakunda kosaru nu pattukoni velladatam.. manaku anukoolamaina maatalni maatram erukoni vimarshinchatam meeku alavaate.. manandari jaati okate ani meerantunnaru.. ee vyasa rachayita purugu jaatiki chindinavadaite.. mari meeroo?

kovela santosh kumar చెప్పారు...

jintaku ji.. thanks for your comment.. i appriciate that you accept my state.. by mentioning about gurajada.. you people forget that "matti". but telangana people are lives totally depend on that matti only. matti is god for our telangana.

satya చెప్పారు...

ఏమి అనుకోకపొతే నాదో అమాయక ప్రశ్న. ఇలానే తెలంగాణ చుట్టూ ఉన్న అన్ని రాష్ట్రాలవాళ్ళు గోడ కడితే పరిస్థితి ఏంటో? మహా గొప్ప పని చేసినట్లు, ఇదే నిజమైన ఉద్యమం అన్నట్లు కితాబులిచ్చారు. ఇంకో పక్క sec144, sec30 ఎందుకు అని అడుగుతారు? ప్రైవేట్ ఆస్తులు ధ్వంసం చేస్తుంటే ఏ సెక్షన్ పెట్టాలో తమరే చెప్పాలి? అసలు కేంద్రం ఒక నిర్ణయం ప్రకటిస్తే వెనక్కు తీసుకోవటం అసాధ్యం అని ఊదరగొట్టిన వాళ్ళు ఇప్పుడు మళ్ళీ ఎందుకు ఉద్యమం నడిపిస్తున్నారు? 9 వ తారీఖు అడగని టైం ఫ్రేం ఇప్పుడెందుకు కావాలి? అసలు బస్సుల విద్వంసాన్ని ఉద్యమం అనరు.. ఉన్మాదం అంటారు. విద్వంసం ద్వారా ఉద్యమం నడపాలనుకునేవాడు ముందుగా తన ఇంటి నించే మొదలుపెట్టాలి.

జింతాకు చెప్పారు...

@Kovela santosh kumar,

అదే మరి గురజాడగారిని అర్థం చేసుకోకపోవడమంటే. మనుష్యులు అనుకోబట్టే మట్టికి విలువ.
ఏంటి సార్..మీ మట్టి దేవుడా.. మరి కోస్తా మట్టి ??..

kovela santosh kumar చెప్పారు...

nenu matti annane kaani.. telangana matti, kosta matti ani analedu... meeru korukune.. mato kalisi undalani korukune mee samaikyataku saraina artham idannamata.. bagundi andamaina vetakaram..

జింతాకు చెప్పారు...

@Kovela santosh kumar,

వెటకారం చేసే ఉద్దేశ్యంతో వ్రాయలేదు వ్యాఖ్య. ఆవేశాలు జనాలను కొన్ని సార్లు తప్పుడు మార్గంలోకి తీసుకుపోతాయి. దేశం కన్నా రాష్ట్రం కన్నా మనం ముందు మనుష్యులం. లక్షల సంవత్సరాల నుండి మనం ఒకరికి ఒకరు సాయం చేసుకోబట్టే ఏ జీవీ చెందని విధంగా అభివృద్ది మనుష్యుల చెందారు. ఒకరి మీదొకరు ద్వేషాలు పెంచుకోవటం వినాశనానికే దారి తీస్తుంది. మీరు వెచ్చించే శక్తి సాటి మనిషిని ఆనందంగా ఉండే విధంగా చెయ్యండి. అంతే కానీ ఉద్యమం పేరుతో ఇలా కాల్చుకుతినటం కాదు (సమక్యం కూడా..).
గుండెల మీద చెయ్యేసుకొని చెప్పండి, సామాన్య జనంకు రాష్ట్రాలతో పని ఉందా?

kovela santosh kumar చెప్పారు...

జింతాకు గారూ .. నేను మీతో ఏకీభవిస్తున్నాను.. ఆవేశాలు నిజంగానే జనాలను తప్పుడు దారిలోకి నెట్టుతాయి. ఈ ఆవేశాలను రెచ్చగొట్టడం వల్లనే ఇప్పుడు తెలంగాణ తగులబడుతోందనే నేనంటున్నాను.. నేను గత మాసంలో కనీసం 20 పోస్‌‌టలనైనా ఈ టపాలో ఉంచాను.. ఎక్కడా నేను ఆంధ్ర ప్రాంతం వాళ్లను నిందించలేదు.. తీరిగ్గా ఉన్నప్పుడు ప్రతి పోస్‌‌టనూ పరిశీలించుకోవచ్చు. 1956 నుంచి తెలంగాణ ప్రాంతం కలిసి నప్పటి నుంచి రెండు ప్రాంతాల వాళ్లను సమైక్యంగా ఉంచటానికి సామాజికంగా, ఆర్థికంగా, సాంస్కృతికంగా, రాజకీయంగా ఒక్క ప్రయత్నమైనా జరగలేదన్నది నేను ప్రశ్నించాను.. ఒక్కో రంగంలో జరిగిన అభివృద్ధి అనుకోండి, వివక్ష అనుకోండి వాటిలో తేడాలను వివిధ అంశాల వారిగా ప్రశ్నించాను.. నాకు తెలసిన అంశాలను పొందు పరిచాను.. ఎక్కడా నిందించలేదు.. నా ప్రశ్నలకు వినమ్రంగా అన్న పదాన్ని వాడుతూనే జవాబు ఆకాంక్షించాను..తప్పులుంటే రుజువు చేయమని అడిగా.. కానీ ఒక్కదానికైనా జవాబు చెప్పకపోగా తిట్టారు.. నిందించారు.. పేదవాడి కోపం ఎప్పుడూ పెదవికే చేటు తెస్తుంది కదా.. ప్రపంచంలో రాజ్యం వీరభోజ్యమే కదా...
మీరు ఈ రెండు విలీనం అయినప్పటి నుంచి రెండు ప్రాంతాల మధ్య ఇంటిగ్రిటీ కోసం ఒక్కక్షణమైనా ప్రయత్నం జరిగిందా..? మీరన్నట్లు సామాన్య జనానికి రాష్ట్రంతో పని లేదు.. మీరన్నట్లు కూడూ గూడూ గొడ్డూ గోదానే కావాలి... వాటి కోసం పోరాడి పోరాడే ఇంతవరకు వచ్చింది. అభివృద్ధి ఫలాలు సమంగా పంపిణీ జరిగి ఉండి, ప్రజల మధ్య సమభావాన్ని పెంపొందించే ప్రయత్నం జరిగి ఉంటే ఇవాళ ఈ సమస్య వచ్చి ఉండేదే కాదు.. బయట జరుగుతున్న ఆందోళనలను కాసేపు పక్కన పెట్టండి, గత ఇరవై రోజులుగా కూడా ఇదే బ్లాగుల్లో జరుగుతున్న చర్చల్ని నిశితంగా నిష్పాక్షికంగా గమనించండి... పరస్పర ఐక్యత కోసం ఏ ఒక్కరైనా ప్రయత్నించారా? హృదయపూర్వకంగా సమాధానం చెప్పండి.. సమైక్యంగా మనం ఎప్పుడు ఉన్నాం? ఇది విద్వేషంతో కూడిన ప్రశ్న కాదు.. గుండెల మీద చేయేసుకుని ఆలోచించుకుని చెప్పండి.. నేను మిమ్మల్ని అభిమానిస్తున్నా.. మరి మీరు? ఇదే ప్రశ్న ప్రతి తెలంగాణ ప్రజ అడుగుతోంది.. సహేతుకంగా, విశ్వాసం పాదుకొల్పేలా జవాబు ఇవ్వండి.. ఇంత ఉద్యమం పది రోజుల పాటు ఆంధ్రప్రాంతంలో జరిగింది.. మీరు ఐక్యంగా ఉండాలనుకున్నది తెలంగాణతో.. ఎవరితో కలిసి ఉండాలని కోరుకుంటున్నారో వారి వద్దకు వచ్చి ఆప్యాయంగా కన్విన్‌‌స చేసే ప్రయత్నం జరగలేదు.. ఇప్పుడు తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం యుటర్‌‌న తీసుకోగానే సంబరాలు జరుపుకున్నారే కానీ, తెలంగాణ ప్రాంతంలో జరుగుతున్న ఆందోళనలపై సానుభూతితో స్పందించారా? మీరు ఉద్యమం ఎందుకు చేస్తున్నారు.. మనమంతా కలిసి ఉందాం.. మీ సమస్యలు ఏమిటి? వాటికి పరిష్కారాలు చూద్దాం.. ఇదిగో ఈ విధంగా ఖచ్చితంగా పరిష్కరిద్దాం అంటూ నిర్మాణాత్మకంగా అడిగిన వాళు్ల ఒక్కరంటే ఒక్కరున్నారా? „కలిసి ఉందామనుకునే వాళు్ల విడిపోదామనుకునే వాళ్ల దగ్గరకు రాకపోతే మానే.. మాట్లాడటానికి సైతం ఇష్టపడలేదు కదా.. దీన్నేమనాలి? గుండెల మీద చేయేసుకుని చెప్పండి.. మనం కలిసి ఉండగలమా? నిజాయితీతో...మీరూ నన్ను మొండిగా వాదిస్తున్నారని తిట్టుకుంటే ఏం చేయలేను.. ధన్యవాదాలు..

satya చెప్పారు...

ఇక్కడున్న సెటిలర్స్ కు అండగా ఉంటామని చెప్తున్నారు.. కాని ఆలూ లేదు, చూలూ లేదు... రాష్ట్రం రాకముందే 'తెలంగాణ నిరుద్యోగ సంఘర్షణ సమితీ అని ఒకటి పుట్టుకొచ్చింది. వీళ్ళు సంగారెడ్డి లోని BSNL క్వార్టర్స్ లో నివాసముండే ఉద్యోగుల ఇళ్ళకు "ఆంధ్రా ఉద్యోగులు తమ ఉద్యోగాలకు రాజీనామా చేసి వారి ప్రాంతాలకు వెళ్ళిపోవాలని, ఖబడ్దార్" అంటూ నోటీస్ లు అంటించి వెళ్ళారు. ఆల్రెడి తెలంగాణ నవనిర్మాణ సేన కూడా స్థాపించారు. మరి వీరి ఉత్సాహం ఎవరి మీద చూపుతారో.. KCR ఇలాంటి చర్యలను అడ్డంగా, నిలువుగా, వంకరగా ఖండిస్తారు. మీ లాంటి మేధావులు ఇది అసలైన ప్రజా ఉద్యమం అని సంబరపడతారు.