31, డిసెంబర్ 2009, గురువారం

ప్రచార సారథి...

రెండో ప్రపంచ యుద్ధం జరిగిన కాలంలో ప్రత్యర్థులను పక్కదారి పట్టించేందుకు అబద్ధాలను నిజాలుగా ప్రచారం చేసే ఎత్తుగడను జర్మన్‌ నియంత హిట్లర్‌ వేశాడు.. అది అలా ఇలా కాదు... మరో వందేళ్ల వరకూ గుర్తుండి పోయే రీతిలో సక్సెస్‌ అయింది. హిట్లర్‌ ఆ పనిని తన మంత్రివర్గంలో సమాచార మంత్రిగా పని చేస్తున్న గోబెల్‌‌సకు అప్పగించాడు.. తన బాధ్యతను పూర్తిగా నిర్వర్తించాడు.. ఒక అంశాన్ని పదే పదే చెప్పటం ద్వారా.. వూ్యహాత్మకంగా వెల్లడించటం ద్వారా దాన్ని నిజమని సర్వజనులూ నమ్మేలా చేయటం గోబెల్‌‌స పని.. దాన్ని ఆయన ఎలా నిర్వర్తించాడంటే.. గోబెల్‌‌స ప్రచారం అన్నది ఒక జాతీయంగా స్థిరపడిపోయింది.


ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం గోబెల్‌‌స మార్గంలోనే వెళు్తన్నట్లుంది. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం ఊపందుకొని నెలరోజులు ఇప్పటికే దాటిపోయింది. ప్రజాపాలన పూర్తిగా స్తంభించిపోయింది. పాపం ఏ ముహూర్తాన ముఖ్యమంత్రి కుర్చీ ఎక్కారో కానీ, రోశయ్యకు నూరు రోజుల్లో వెయ్యి కష్టాలను ఎదురుచూడాల్సి వచ్చింది. మిగతా సమస్యల మాటెలా ఉన్నా, తెలంగాణ ఉద్యమం మాత్రం రోశయ్యకు కొరకరాని కొయ్యగా మారిపోయింది. కరవమంటే కప్పకు కోపం.. విడవమంటే పాముకు కోపం అన్నట్లుగా ఇరు ప్రాంతాల నాయకుల మధ్య నలిగిపోతున్నారు..
ఇప్పుడు తెలంగాణ ఉద్యమం నుంచి ప్రజల దృష్టిని మళ్లించటం సిఎం రోశయ్యకు అత్యంత అవసరం అయింది. సమస్యను రుజుమార్గంలో వెళ్లి పరిష్కరించటం ఎలాగూ తన వల్ల కాదు.. ఆ పని కేంద్ర ప్రభుత్వం ఎలాగూ భుజానికెత్తుకుంది. కాబట్టి... తన స్థాయిలో తాను చేయదగింది ఏముందని ఆయన వందిమాగధ బృందం మంచి కసరత్తే చేసింది. చివరకు గోబెల్‌‌స వారికి ఫ్లాష్‌లా తట్టాడు... ఇంకేం ప్రశాంతంగా సచివాలయంలో పెద్ద మనిషి కూర్చుని శాంత గంభీర స్వరంతో నాలుగు మాటలు మాట్లాడటమే కదా చేయాల్సింది అని డిసైడ్‌ అయిపోయారు..ఈ బాధ్యత మంత్రులకు అప్పగించలేరు.. ఎందుకంటే మంత్రులు రెండుగా చీలిపోయారు.. ఆయన మాట వినే పరిస్థితిలో లేరు.. తెలంగాణ మంత్రులు ఎలాగూ వీక్‌..పైగా గోడమీద పిల్లులు కాబట్టి వారికి కనీస గుర్తింపు ఎలాగూ ఉండదు కాబట్టి వారి అవసరం ఎలాగూ ఉండదు.. అందుకని తానే స్వయంగా రంగంలోకి దిగారు..
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం వల్ల రాషా్టన్రికి, దాని అభివృద్ధికి తీరని అనర్థం వాటిల్లబోతోందని అందరికీ భూతద్దాలు పంచిపెట్టడం ప్రారంభించారు.. ఎందుకంటే తెలంగాణ ఉద్యమాన్ని చూడాల్సింది ఆ అద్దాల్లోంచేనన్నారు.. మామూలుగా చూస్తే అర్థం కాదన్నారు. తనకు తోడుగా రాష్ట్ర పోలీసు బాసునూ ఇతోధికంగా సాయం చేయమన్నారు.. ఇంకేం.. ఇద్దరు కలిసి గోబెల్‌‌సను తమపై ఆవహింప చేసుకున్నారు..
పోలీసు బాసు గిరీశ్‌కుమార్‌ ఈ ప్రచారానికి నాంది పలికారు.. డిసెంబర్‌ 30వ తేదీన తెలంగాణ జెఏసి ఇచ్చిన బంద్‌ పెను హింసాత్మకంగా మారబోతోందని, మానవబాంబులు వచ్చి బీభత్సాన్ని సృష్టిస్తారన్నంత భయోత్పాతాన్ని హైదరాబాద్‌లో గిరీశ్‌ కుమార్‌ సృష్టించారు.. రకరకాల బలగాలను రంగంలోకి దింపి, ముఖ్యంగా ఆంధ్ర ప్రాంత ప్రజలు నివసించే ప్రాంతాల్లో కవాతులు నిర్వహించారు.. పోలీసు పదఘట్టనలతో ప్రజల్లో ముందుగా ఆందోళన కలిగింది.. సర్కారుకు కావలసింది అదే....తెలంగాణ వాదుల పై స్థానిక ఆంధ్ర ప్రాంత ప్రజలకు వ్యతిరేకత కలగాలన్నదే సర్కారు యోచన.. బంద్‌ ప్రశాంతంగా జరుగుతుందని జెఎసి అదే పనిగా ఊదరగొడుతున్నా పోలీసులకు ఇవేవీ పట్టలేదు. శాంతియుతంగా ధర్నాలు చేస్తున్నా 5490 మందిపై అడ్డగోలుగా కేసులు పెట్టేశారు.. వాళ్లను ఆపేది ఎవరు? అడ్డుకునేదెవరు? తెలంగాణ ఉద్యమంలో రాజకీయ నాయకత్వం ఎలాగూ విఫలమైంది. విద్యార్థుల అజెండాపై సాగుతున్న ఉద్యమానికి సరైన మార్గనిర్దేశనం చేసేవారు లేరు.. ఎవరూ లేకుండానే ఉద్యమం ఇప్పటికి ఉధృతంగానే కొనసాగుతోంది. పోలీసు ప్రచారం సాగుతూనే ఉంది. బంద్‌ ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు ఇవ్వకుండా ఆటపాటలతో, వినూత్నంగా నిరసన తెలుపుతూ ప్రశాంతంగా ముగిసింది. ఉద్రిక్తతల సృష్టి పోలీసులదేనని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సంతృప్తికర ప్రకటన చెప్పకనే చెప్పింది.
ఇక రోశయ్య గారు.. తెలంగాణ ఉద్యమం వల్ల రాషా్టన్రికి రావలసిన పరిశ్రమలన్నీ తరలిపోతున్నాయన్నారు.. హైదరాబాద్‌కు ఉన్న బ్రాండ్‌ నేమ్‌ అంతా వెళ్లిపోతోందని, ఇక రాషా్టన్రికి ఒక్క పరిశ్రమ కూడా వచ్చే పరిస్థితి లేదంటూ పిక్చరిచ్చేశారు... అదే విలేఖరుల సమావేశంలో ఎన్ని పరిశ్రలు వెళ్లిపోయాయని ప్రశ్నిస్తే.. జవాబు లేదు.. ఏ పారిశ్రామికవేత్తలు వెళ్లిపోతామని చెప్పారంటే సమాధానం లేదు...
ఇక మర్నాడు మరో వింత ప్రెస్‌కాన్ఫరెన్‌‌స జరిగింది. నలభై నిమిషాలు జరిగిన విలేఖరుల సమావేశం అజెండా కేవలం సినిమా పరిశ్రమ.. ప్రభుత్వం చాలా కష్టపడి సినీ పరిశ్రమను చెనై్న నుంచి తీసుకువస్తే అది తిరిగి చెనై్నకి తరలిపోతోందని, ఎవరూ చెనై్నకి వెళ్లవద్దంటూ విజ్ఞప్తుల మీద విజ్ఞప్తులు చేశారు.. తెలంగాణాకు చెందిన ఆర్టిస్టులు ఎవరెవరు పరిశ్రమలో ఉన్నారో చిట్టా చదివి వినిపించారు.. అదేమిటి మీరు విడగొడుతున్నట్లు మాట్లాడుతున్నారని ఓ విలేఖరి అడిగితే, మీరెలా అర్థం చేసుకుంటే అలా చేసుకోండన్నారు.. ఎవరు తరలి వెళ్తామన్నారో ఆ విషయాన్ని మాత్రం రోశయ్య చెప్పలేదు.. తీరా తెల్లవారి సినీ పరిశ్రమ పెద్ద అయిన నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ భలే స్టేట్‌మెంట్‌ ఇచ్చారు.. ఆయన అలా ఎందుకన్నారో అర్థం కాలేదన్నారు.. చెనై్నకి ఎవరూ తరలి వెళ్లరని అన్నారు.. రెండు రాషా్టల్రు ఏర్పడితే సినీపరిశ్రమకు చాలా లాభమని కూడా భరద్వాజ సెలవిచ్చారు. రెండు రాషా్టల్ల్రో ఇన్సెంటివ్‌లు దండుకుని సినీపరిశ్రమ బాగా లాభపడుతుందనీ అన్నారు.. పాపం రోశయ్య గారి గోబెల్‌‌స సక్సెస్‌ కాలేకపోయింది. ఇలాంటి ప్రచారాలు తెలంగాణ ఉద్యమం కొనసాగినన్నాళూ్ల జరుగుతూనే ఉంటాయి. ఇందులో సందేహం లేదు.. తెలంగాణ విడిపోవటాన్ని ఆంధ్రప్రాంత నేతలు అన్ని విధాలా అడ్డుకుంటారు.. చివరి నిమిషం వరకూ అడ్డుపుల్ల వేసేందుకు ప్రయత్నిస్తారు.. ఎందుకంటే వారికి తెలుగువారంతా ఒకటిగా ఉండాలన్న ప్రేమ కాదు.. హైదరాబాద్‌పై ఆప్యాయత అంతకంటే లేదు.. మిగతా జిల్లాలు వారి కంటికే కనపడవు.. వారిని ప్రధానంగా వెంటాడుతోంది ఒకే ఒక్క ఆందోళన.. సాగర్‌ నీళు్ల.. పోలవరం నిర్మాణం... థర్మల్‌ పవర్‌... తెలంగాణ ఏర్పడితే ఈ వనరుల్లో తమకు కోతపడతాయని వాళు్ల భయపడుతున్నారు.. ఎందుకంటే ఇంతకాలం వీటిని నూటికి నూరు పాళు్ల వినియోగించుకున్న తమకు ఇప్పుడు వాటాల వారిగా వస్తే ఎలా అన్నదే సమస్య... రెడీమెడ్‌గా దొరికే వనరులను వాడుకోకుండా, తమ దగ్గరున్న వనరులను ఇప్పటి నుంచే వాడుకోవటం ఏమిటన్నది వారి ఆందోళన. అందుకే చివరి క్షణం వరకూ తెలంగాణా ఏర్పాటుకు మోకాలడ్డటం ఖచ్చితం... నీలం సంజీవరెడ్డి స్పష్టంగా చెప్పిన సంగతే ఇది.. వేరే ఎవరూ ప్రత్యేకించి దీనిపై అనేది ఏం లేదు.. అందుకే తెలంగాణ ప్రజలపై, వారి ఉద్యమంపై ఈ రకమైన చాటుమాటు దాడులు చాపకింద నీరులాగా జరుగుతున్నాయి.వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి