నలభై ఏళ్ల పోరాటం ఫలించింది. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు ఆమరణ దీక్షకు, ఉవ్వెత్తున ఎగిసి పడ్డ విద్యార్థి ఉద్యమ తరంగాలకు కేంద్రం తల వంచక తప్పలేదు.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తామని కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం ప్రకటన చేయటంతోనే తెలంగాణ అంతటా సంబరాలు జరుపుకున్నారు... కేవలం చిదంబరం ప్రకటనతో తెలంగాణ రాష్ట్రం వచ్చినట్లేనా? రాష్ట్ర విభజన అంత తేలిగ్గా జరిగే పనేనా? టిఆర్‌ఎస్ నేతలు ఇంతటితోనే సంతృప్తి చెందుతారా?
అర్ధరాత్రి చిదంబరం ప్రకటనతోనే తెలంగాణ వచ్చేసినంత సంబరాలు ఆ ప్రాంతంలో మిన్నంటాయి. పదకొండు రోజుల కెసిఆర్ ఆమరణ దీక్ష ముగిసిపోయింది. కానీ, ఇంతటితో తెలంగాణ వచ్చేసినట్లేనా? దీని వెనుక జరగాల్సిన తతంగం ఎంతో ఉంది. ఇందుకు అనుకూలంగా రాజకీయ ప్రక్రియకు కేంద్రం పూనుకోవలసి ఉంది. కేంద్రం వెంటనే ఇందుకు పూనుకుంటుందా? ఎంత సమయం తీసుకుంటుంది? తాత్సారం చేస్తే టిఆర్‌ఎస్ ఇదే ఒత్తిడిని పెంచగలుగుతుందా? అన్నవి ఇప్పటికైతే అంతుపట్టని ప్రశ్నలే.
కేంద్ర హోం మంత్రి చిదంబరం నిన్న రాత్రి చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నట్లు పార్లమెంటులో స్పష్టం చేశారు.. ఇంతవరకు బాగానే ఉంది. కానీ, ఇప్పుడే అసలు కథ మొదలైంది. రాష్ట్ర విభజనకు సంబంధించి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రత్యేక బిల్లును రూపొందించాల్సి ఉంటుంది. దీనిపై కేబినెట్ ఆమోదం తెలపాలి. ఆ తరువాత ఇది పార్లమెంటు ఆమోదానికి వెళు్తంది. ఆ తరువాత కానీ రాష్ట్ర ఏర్పాటుపై రాష్టప్రతి ముద్ర పడదు..
రాష్ట్ర ఏర్పాటుకు ఇంత తతంగం జరగాల్సి ఉంది. ఈలోపే రాష్ట్రంలో మిగతా ప్రాంతాల నుంచి కాంగ్రెస్ అధిష్ఠానం పై ఒత్తిళు్ల తీవ్ర స్థాయిలో మొదలయ్యాయి. రాష్ర్ట విభజనను వీలైనంత సంక్లిష్టం చేసే దిశగా రాజకీయ ఒత్తిళు్ల పెరిగాయి. ఎవరికి తోచిన రీతిలో వాళు్ల.. ఎత్తులు, పై ఎత్తులతో ముందుకు వెళు్తన్నారు.. రాషా్టన్న్రి విభజించటం అంటూ జరిగితే రాయలసీమనూ విడగొట్టాలని ఆ ప్రాంత ఎమ్మెల్యేలు... ఉత్తరాంధ్ర ఇవ్వాలనీ అక్కడి వారు... స్వరం పెంచారు..
ఇక ఆంధ్ర ప్రాంత ఎమ్మెల్యేలు, ఎంపిలయితే కేంద్రం నిర్ణయాన్ని ఎంత మాత్రం హర్షించలేకపోతున్నారు.. తెలంగాణకు మొదట్నుంచీ వ్యతిరేకంగా ఉన్న ఎంపి లగడపాటి రాజగోపాల్ తన పదవికి రాజీనామా సమర్పించటం ఒత్తిడి రాజకీయమే. అటు రాయలసీమ ఎమ్మెల్యే జెసి దివాకర్ రెడ్డి కూడా ఇలాంటి ఎత్తుగడే వేశారు..పార్టీలకు అతీతంగా ఒకరి వెంట ఒకరుగా రాజీనామాల బాట పడుతున్నారు... అధిష్ఠానం నిర్ణయం కాంగ్రెస్ పార్టీలో ఒకరకంగా చిచ్చు పెట్టిందనే చెప్పాలి.
విచిత్రమేమంటే చిదంబరం తెలంగాణకు అనుకూలంగా ప్రకటన చేసేంత వరకు అధిష్ఠానం నిర్ణయం మాకు శిరోధార్యం అంటూ వచ్చిన కాంగ్రెస్ నేతలంతా ఒక్కసారిగా గందరగోళంలో పడ్డారు.. అధిష్ఠానం అంత తేలిగ్గా తెలంగాణకు అనుకూలంగా ప్రతిస్పందిస్తుందని ఆంధ్రప్రాంత ప్రజాప్రతినిధులు ఊహించలేదు.. పార్టీ ప్రకటన వెలువడటంతో ఇక ఒత్తిడి రాజకీయం తప్ప వారికి మరో ప్రత్యామ్నాయం లేకుండా పోయింది. అధిష్ఠానం నిర్ణయాన్ని కాదనే పరిస్థితి లేదు.. అందువల్ల రాజీనామాలు చేయటం ద్వారా అసెంబ్లీలో తీర్మానం ఆమోదం పొందకుండా చేయాలన్నది వారి ఎత్తుగడా? అన్న సందేహమూ వ్యక్తమవుతోంది. వీలైనంత ఎక్కువమంది రాజీనామా చేస్తే, రాష్ట్రంలో రోశయ్య సర్కారును మైనారిటీలో పడేయాలన్నది వారి వూ్యహం కావచ్చు. తద్వారా తెలంగాణ ప్రక్రియను జాప్యం చేయవచ్చు... ఈ రకమైన ఒత్తిళ్లకు కాంగ్రెస్ అధిష్ఠానం దిగివస్తుందా? తాను ముందుగా చేసిన ప్రకటనకు కట్టుబడి ఉంటుందా అన్నది వేచి చూడాలి..
తెలంగాణలో ఉద్యమం ప్రజల భావోద్వేగాల నుంచి పుట్టుకొచ్చింది...ఇది ఒక్క రోజులోనో, ఒక్క క్షణంలోనో, ఒక్క రాత్రి లోనో వచ్చింది కాదు..కూర్చున్న పళాన ఉన్నట్టుండి తీసుకున్న నిర్ణయం కాదు.. ఉద్యమం పతాకస్థాయికి చేరుకున్న తరువాత కానీ కాంగ్రెస్ దిగిరాలేదు.. బోలెడు తర్జనభర్జనలు చేసిన తరువాత కానీ, నిర్ణయం తీసుకోలేదు.. మిగతా డిమాండ్ల మాదిరిగా కేవలం ఒత్తిడి రాజకీయపు డిమాండ్ ఎంతమాత్రం కాదన్న వాస్తవాన్ని మన నాయకులు విస్మరించటం దురదృష్టం.
why it was happen?
ఎందుకిలా జరిగింది.. ? అందరిలోనూ అంతర్మథనం.. ఎవరెన్ని చెప్పినా అధిష్ఠానం వినదనే ధీమాతోనే వారంతా ఇంతకాలం ఉన్నారు.. ఎవరెంతగా గింజుకున్నా తెలంగాణకు అనుకూలంగా ప్రకటన రాదనే అనుకున్నారు.. అదే ధైర్యంతోనే తెలంగాణలో జరుగుతున్న ఆందోళనను నిరసించారు.. అధిష్ఠానం ఇస్తే తీసుకోండన్నారు..తీరా అదే అధిష్ఠానం తెలంగాణ ఇస్తామని అనేసరికి అంతా ఒక్కసారిగా నాలుక్కరుచుకున్నారు.. ఏం చేయాలో తోచక గింజుకుంటున్నారు..
తెలంగాణేతర ప్రజాప్రతినిధులందరిలోనూ ఇదే ఆందోళన.. అయోమయం... తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ఇంకా మొదలే కాలేదు.. కేంద్ర హోం మంత్రి చిదంబరం తెలంగాణ అనుకూల ప్రకటన చేసి 24 గంటలైనా కాలేదు.. తెలంగాణేతర ప్రజాప్రతినిధుల్లో ఒకటే దిగులు.. ఒకటే గుబులు... ఇన్నాళ్ల నుంచి పల్లెత్తు మాటైనా మాట్లాడని ప్రతినిధులంతా ఒక్కసారిగా నిద్రలేచారు... ఒకరి వెంట ఒకరుగా రాజీనామా లేఖలు పట్టుకుని స్పీకర్ దగ్గరకు క్యూలు కట్టారు.. మీడియాలో ఒక్కొక్కరి రాజీనామా వార్త విని, తామూ ఆ దారి పట్టకపోతే బాగుండదేమో అన్న అభిప్రాయంతో కొందరు ప్రతినిధులు రాజీనామా చేశారు.. మాకు అన్యాయం జరిగిందంటూ వాపోయారు.. మమ్మల్ని అడగలేదన్నారు.. ఏకపక్షమన్నారు... అమ్మ ఇలా చేస్తుందనుకోలేదన్నారు... ఆవేదన కొందరిది.. ఆగ్రహం ఇంకొందరిది...
కాంగ్రెస్ నాయకులు రాజీనామా చేస్తుంటే మిగతా పార్టీలు మాత్రం ఊరకే కూచుంటాయా? మీరు తీర్మానం పెడితే మేము సమర్థిస్తామంటూ ఇంతకాలం సన్నాయి నొక్కులు నొక్కిన తెలుగుదేశం ఎంపిలు, ఎమ్మెల్యేలు కూడా రాజీనామా రాగాలు ఆలపించారు.. కాంగ్రెస్ తనను అడక్కుండానే నిర్ణయం తీసుకుందని చంద్రబాబు గారు తెగ ఇబ్బంది పడిపోయారు.. తెలంగాణ తీర్మానానికి పూర్తిగా సమర్థన వ్యక్తం చేస్తూ ప్రణబ్ కమిటీకి లేఖ రాసిన తరువాత బాబుగారికి ఎదురైన ఇబ్బంది ఏమిటో అర్థం కాదు.. తెలుగుదేశం నాడు తెలంగాణకు అనుకూలంగా స్పందించినట్లే.. ఇవాళ కాంగ్రెస్ స్పందించింది. నాడు ప్రజల ఆకాంక్షలకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నామని బాబుగారు చెప్పినట్లే.. ఇవాళ కాంగ్రెస్ కూడా అదే ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటున్నట్లు కుండబద్దలు కొట్టింది... కానీ, బాబుగారికి కాంగీ నిర్ణయం మింగుడుపడలేదు.. కారణం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఇష్టం లేదా? అదే నిజమైతే 2009 ఎన్నికల్లో ప్రజలను మోసగించినట్లే కదా? దీనికి ఆయనేం జవాబు చెప్తారు?..
పాపం చిరంజీవి.. ఆయన దగ్గర ఉన్న ప్రతినిధులు దాదాపు అందరూ రాజీనామా చేశారు.. అంతా గొర్రెదాటుగా ముందుకు వెళ్లేసరికి చిరంజీవి కూడా కొంత ఒత్తిడికి లోనైనట్లు స్పష్టం అయింది.
వాస్తవం ఏమంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నిర్ణయం అన్ని రాజకీయ పార్టీలు ఆరోపిస్తున్నట్లు రాత్రికి రాత్రి తీసుకున్న నిర్ణయం ఎంతమాత్రం కాదు. కోర్ కమిటీలో అన్ని విధాలా చర్చించి, రాజకీయ లాభనష్టాలు అన్నీ బేరీజు వేసుకోకుండా కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయం తీసుకోదు.. తెలంగాణ విషయంలోనూ జరిగింది అదే. కాంగ్రెస్ కేంద్ర నాయకత్వం ఒక రాష్ట్ర రాజకీయ సమీకరణాలను జాతీయ దృష్టితోనే ఆలోచిస్తుంది. జాతీయ స్థాయిలో పార్టీ బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తుంది. దాని నిర్ణయానికి అంతా తలొగ్గాల్సిందే.. అధిష్ఠానాన్ని కాదని విడిగా ముందుకు వెళ్లే పరిస్థితి కాంగ్రెస్ నాయకులకే కాదు.. ఏ పార్టీ నాయకులకూ దాదాపు ఉండదు... తెలంగాణేతర ఎంపిలతో సోనియాగాంధీ ఇప్పటికే మాట్లాడారు.. ఆ తరువాత కూడా కాంగ్రెస్ ప్రతినిధులు తమ నిర్ణయాలకు కట్టుబడి ఉంటారా? వేచి చూడాలి.
2 కామెంట్‌లు:
తెలంగాణా రాష్ట్రమనే ఆలోచనే సమైక్యాంధ్రకు వ్యతిరేకం గా ఒక ఎత్తుగడ,కుట్ర.
ఇదంతా రాజకీయ కుట్రే ... మీరు కాదంటారా ... రాజకీయ నాయకులూ పదవులకోసం జరుపుతున్న పోరాటం ఇదంతా
కామెంట్‌ను పోస్ట్ చేయండి