16, డిసెంబర్ 2009, బుధవారం

తెలంగాణ ఎందుకోసం?

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అన్నది కేవలం రాజకీయ అవసరమేనా... లేక.. ప్రజల అవసరమా.. దీనిపై రకరకాల ప్రచారాలు రాష్ట్రంలో కొనసాగుతున్నాయి. తెలంగాణను అభివృద్ధి చేసింది.. ఆంధ్రా నాయకులే అన్నది సమైక్య వాదుల వాదన. ఇది నిజమేనా.. ఈ యాభై ఏళ్ల కాలంలో తెలంగాణ ఎంత అభివృద్ధి చెందింది.. విశ్లేషణాత్మక వ్యాసం..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం.. రెండు ప్రాంతాలు మనస్పూర్తిగా అంగీకరించడంతో ఏర్పాటు కాలేదు. తెలుగువారంతా ఒక్కరాష్ట్రంగా ఏర్పడాలని తెలంగాణ ప్రజలు ఎప్పుడూ కోరుకోలేదు. ఇలా కోరుకున్నదంతా.. ఆంధ్రా,సీమ ప్రాంతాల వారే. వారికి.. ఇక్కడి నాయకగణం మద్దతు పలకడంతో.. రెండు రాష్ట్రాలుగా ఉండాల్సిన తెలుగు నేల.. ఒక్కటిగా ఏకమయ్యింది. కానీ.. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత.. దేశంలో భాషాప్రయుక్తరాష్ట్రాలుగా ఏర్పాటు చేయడానికి అప్పటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ ఏర్పాటుచేసిన మొదటి స్టేట్ రీ ఆర్గనైజేషన్ కమిటీ.. ఆంధ్రా, హైదరాబాద్‌లు కలిసి ఒకే రాష్ట్రంగా ఏర్పడడానికి అంగీకరించలేదు. 1961 జనరల్ ఎలక్షన్స్‌లో వచ్చే ఫలితాలను బట్టి.. నిర్ణయం తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి ఈ ఫజల్ అలీ కమిషన్ సూచించింది. నాయకుల ఉత్సాహం ముందు కమిషన్ సిఫార్సులు ఆవిరైపోయాయి. 1956 నవంబర్ ఒకటిన ఆంధ్రా-హైదరాబాద్ రాష్ట్రాలు కలిసి.. ఆంధ్రప్రదేశ్ అవతరించింది. అయితే.. ఆంధ్రాతో పోల్చితే.. తెలంగాణ ప్రాంతం అభివృద్ధిలో వెనకపడి ఉండడంతో.. ఓ ప్రత్యేక ఒప్పందాన్ని చేసుకున్నారు. అదే పెద్దమనుషుల ఒప్పందం. తెలంగాణ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం కోసం ఎన్నో రూల్స్ ఇందులో పొందుపరిచారు.. కానీ అమలు చేయడం మరిచిపోయారు. ముందుగా చెప్పుకోవాల్సింది.. ఒక ప్రాంతానికి చెందిన వారు ముఖ్యమంత్రి అయితే.. మరో ప్రాంతానికి చెందిన వ్యక్తిని ఉపముఖ్యమంత్రిని చేయాలనే. కానీ ఈ నిబంధన అమలయ్యింది అతి తక్కువ కాలం మాత్రమే. ఈ 53 సంవత్సరాల కాలంలో.. 15 మంది రాష్ట్రానికి ముఖ్యమంత్రులైతే.. ఇందులో ముగ్గురు మాత్రమే తెలంగాణ ప్రాంతానికి చెందిన వారు. ఈ ముగ్గురూ కలిసి సరిగ్గా ఏడేళ్లపాటూ పాలించింది లేదు.. రాష్ట్రంలోని కీలక పదవి ఇలా ఆంధ్రాసీమ నేతలకే పరిమితమయ్యింది. సమైక్య రాష్ట్రంకోసం రాజధానిని త్యాగం చేశామని సీమ వాసులు గర్వంగా చెప్పుకోవచ్చు కానీ.. ముఖ్యమంత్రి పదవినే తెలంగాణ వదులుకోవాల్సి వచ్చింది..
అంతేకాదు.. తెలంగాణ ప్రాంతం కోసం బడ్జెట్‌ను ప్రత్యేకంగా రూపొందించాలని... రాష్ట్రానికి అయ్యే వ్యయాన్ని ఆంధ్రా,తెలంగాణ ప్రాంతాల మధ్య సమానంగా పంచాలని.. ఏ ప్రాంతం నిధులు ఆ ప్రాంతానికే ఖర్చుపెట్టాలని.. మరికొన్ని నిబంధనలు ఈ పెద్దమనుషుల ఒప్పందంలో ఉన్నాయి. కానీ... ఇవి కూడా అమలుకు నోచుకోలేదు. తెలంగాణ ప్రాంతం నుంచి ఎన్నికైన ప్రజాప్రతినిధులతో కలిసి ఓ రీజనల్ కమిటీ ఏర్పాటు చేయాలన్నది కూడా ఒప్పందంలో భాగం. తెలంగాణ ప్రాంతంలో సమస్యలపై ... ఈ కమిటీ ప్రభుత్వానికి సిఫార్సులు చేస్తుంది. వాటిని కేబినెట్ ఆమోదించాలి. ఏదైనా వివాదం ఉంటే.. గవర్నర్‌కు నివేదించాలి. తుది నిర్ణయాన్ని ఆయనే తీసుకుంటారు. ఈ పద్దతి ఎక్కువకాలం కొనసాగలేదు. ఇలా ఏరకంగా చూసినా పెద్ద మనుషుల ఒప్పందంతో తెలంగాణకు ఒరిగిందేమీ లేదు. 1969 లో తెలంగాణ ఉద్యమం తర్వాత అమలు చేస్తామన్న ఆరు సూత్రాల పథకం కూడా తెలంగాణలో మార్పులను తీసుకురాలేదు. ఒక్క సెంట్రల్ యూనివర్సిటీ హైదరాబాద్‌లో ఏర్పడినా.. దీనివల్ల.. ఇక్కడి ప్రాంతానికి జరిగిన మేలు.. ఇతర ప్రాంతాలతో పోల్చితే ఎక్కువేమీ కాదు. తెలంగాణ విద్యార్థుల కన్నా... ఆంధ్రా విద్యార్థులకే ఇందులో సీట్లు ఎక్కువగా దక్కుతున్నాయి. ఉద్యోగాల్లోనూ.. స్థానికులకే ప్రాధాన్యం ఇవ్వాలన్న నిబంధనను కూడా పాలకులు తుంగలో తొక్కారు. ఈ నిబంధనలను అమల్లోకి తీసుకురావడానికి 1985లో విడుదల చేసిన జీవోనే ఇంతవరకూ అమలు కాలేదంటే.. తెలంగాణపై పాలకులకున్న ప్రేమ ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు..
పారిశ్రామిక రంగం
సమైక్య రాష్ట్రంలో కలిసిన తర్వాతే.. తెలంగాణ అభివృద్ధి చెందిందన్న భావన చాలామందికి కలిగి ఉండొచ్చు.. కానీ నిజం మాత్రం వేరు. ఏ రంగాన్ని తీసుకున్నా.. సమైక్య రాష్ట్రంలోనే తెలంగాణకు అన్యాయం జరిగిందని చెప్పాలి. కంపెనీల దగ్గర నుంచి మొదలుపెడితే.. పరిస్థితులు ఎంతలా మారాయో అర్థం చేసుకోవచ్చు. తెలంగాణలోని ప్రభుత్వ కంపెనీల్లో సింహభాగం నిజాం హయాంలో కొలువుతీరినవే. 1921 లో సింగరేణి, 1937లో నిజాం షుగర్ ఫ్యాక్టరీ, 1942లో ఆల్విన్ మెటల్ వర్క్క్, 1943లో ప్రాగా టూల్స్, 1946లో సిర్ఫూర్ పేపర్ మిల్స్, 1947లో హైదరాబాద్ ఆస్‌బెస్టాస్ ఏర్పాటయ్యాయి. ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత.. సింగరేణి మినహా మిగిలినవాటి గేట్లు మూసుకుపోయాయి. నిజాం షుగర్స్, పేపర్‌మిల్స్ ప్రైవేటు పరమయ్యాయి. అజాంజాహీ మిల్స్ అనూహ్యంగా మూతపడింది. ఈ సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా పెట్టిన కంపెనీ తెలంగాణ ప్రాంతంలో ఒక్కటీ లేదు.
విద్య
విద్యాపరంగా.. తెలంగాణ ఎప్పుడూ వెనకపడే ఉంది. రాష్ట్రంలో దాదాపు సగం జనాభా తెలంగాణలోనే ఉన్నప్పటికీ.. ప్రభుత్వ విద్యాసంస్థలు మాత్రం 25 శాతమే ఈ ప్రాంతంలో ఉన్నాయి. మొత్తం 72 ప్రభుత్వ ఐటీఐలకు గానూ.. తెలంగాణలో ఉన్నవి కేవలం 26....... 91 పాలటెక్నిక్ కాలేజీలకు గానూ.. ఈ ప్రాంత వాటా 20... ఎయిడెడ్ విద్యాసంస్థలూ ఎక్కువగా ఉన్నది ఆంధ్రా ప్రాంతంలోనే.. ఇక తెలంగాణ విద్యారంగంలో దూసుకువెళ్లే ఛాన్స్ ఎక్కడ ఉంది?
వ్యవసాయం
తెలంగాణలో నిర్లక్ష్యానికి గురైన మరో రంగం వ్యవసాయం. సాగుకు పనికివచ్చే భూమి తెలంగాణలో 64 లక్షల హెక్టార్లుంటే.. కోస్తాంధ్రలో 46 లక్షల ఎకరాలు మాత్రమే ఉంది. అయితే.. సాగు విషయానికి వస్తే మాత్రం.. రెండు ప్రాంతాల మధ్య ఎంతో అంతరం. ఆంధ్రాలో బీడు భూమిని చూడాలంటే.. భూతద్ధం వేసుకుని వెతకాలి. ఎటుచూసినా పచ్చని పొలాలతో కళకళలాడుతూనే ఉంటుంది. అదే తెలంగాణలో కొన్ని చోట్ల తప్ప.. అంతా బీడే. కృష్ణా, గోదావరి నదులు తెలంగాణలోనే ఎక్కువగా ప్రయాణిస్తున్నా... ఈ ప్రాంతంలో ప్రాజెక్టులు కట్టడంపై ప్రభుత్వాలు దృష్టి పెట్టలేదు. నిజామాబాద్ జిల్లాలో శ్రీరాం సాగర్ కట్టడం మొదలుపెట్టి 46 సంవత్సరాలు గడుస్తున్నా.. పనులు మాత్రం ఇప్పటికీ పూర్తి కాలేదు. అంతెందుకు.. రాష్ట్ర విలీన సమయంలో.. తెలంగాణలో ఎంత సాగు భూమి ఉందో.. ఇప్పటికీ అంతే సాగవుతోంది. ముఖ్యంగా తెలంగాణలో సాగు ఎక్కువగా జరిగే.. చెరువులు, కుంటలు ఈ యాభైఏళ్లకాలంలో 75 శాతం మాయమైపోయాయి. అదే సమయంలో రాష్ట్ర ఏర్పాటు సమయంలో ఆంధ్రా ప్రాంతంలో 30 లక్షల ఎకరాలు సాగవుతుండగా.. ఇప్పుడది 70 లక్షల ఎకరాలకు చేరుకొంది.. మరి అభివృద్ధి చెందింది.. తెలంగాణానా.. లేక ఆంధ్రాప్రాంతమా..
ఉద్యోగాలు
ఇక ఉద్యోగాల్లో జరిగిన అన్యాయాల సంగతి అంతా ఇంతా కాదు. న్యాయంగా అయితే.. 2:1 నిష్పత్తిలో ఆంధ్రా, తెలంగాణ ప్రాంతాల మధ్య ఉద్యోగాల పంపకం జరగాలి. రాష్ట్రంలో మొత్తం 14 లక్షల మంది ప్రభుత్వోద్యోగులుంటే.. అందులో తెలంగాణ వారి వాటా కేవలం రెండున్నర లక్షలు మాత్రమే. ఇందులోనూ.. అత్యున్నతస్థాయిలో ఉన్నవారు చాలా తక్కువ మంది. రాష్ట్ర పరిపాలనను నియంత్రించే.. సచివాలయంలో అయితే.. కీలక పోస్టులన్నీ.. సీమాంధ్రులవే. రాష్ట్రం ఏర్పడినప్పటినుంచి.. ఇప్పటివరకూ.. ఒక్క అడ్వకేట్ జనరల్ కూడా తెలంగాణ ప్రాంతానికి చెందిన వారు కాకపోవడం ప్రభుత్వాల తీరుకు అద్దం పడుతోంది. పైగా.. ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పటి నుంచి.. తెలంగాణకు రావల్సిన వాటా.. ఎప్పుడూ రాలేదని వాదిస్తున్నాయి ఉద్యోగ సంఘాలు.

రాష్ట్ర ఆదాయంలో దాదాపు 45 శాతం తెలంగాణ ప్రాంతం నుంచే వస్తోంది. ఇదే సమయంలో.. ఇక్కడ ఖర్చు పెడుతున్న మొత్తం మాత్రం కేవలం 28 శాతం మాత్రమే. అంటే.. 17 శాతం నిధులు ఎక్కడి పోతున్నట్లు? తెలంగాణను అభివృద్ధి చేశామని ప్రభుత్వం చెబుతుండొచ్చు.. కానీ.. నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ సమస్యను యాభై ఏళ్లుగా ఎందుకు తీర్చలేకపోతున్నారు? రాష్ట్రంలో జరిగిన రైతు ఆత్మహత్యల్లో ఎక్కువగా తెలంగాణలోనే ఎందుకు జరిగాయి? సిరిసిల్ల చేనేత కార్మికులు ఎందుకని ఆత్మహత్యలు చేసుకోవాల్సి వస్తోంది? ఇలా సమాధానం దొరకని ప్రశ్నలు ఎన్నో. సమైక్యాంధ్ర కోసం.. ఆందోళన చేస్తున్న ఈ నాయకుల్లో ఒక్కరు కూడా తెలంగాణకు అన్యాయం జరిగినప్పుడు మాట్లాడలేదెందుకు?

18 కామెంట్‌లు:

balu చెప్పారు...

అసలు ఈ కె సి ఆరు,మధు యాక్షీ గాడూ సర్వే గాడూ ఈ 5 ఎళ్ళలో వాళ్ళ ఎంపీ నిధులతో వాళ్ళ నియోజకవర్గం లో ఎమి వూడబొడిచారో కాస్థ చెపుతారా

balu చెప్పారు...

ఆంధ్ర ప్రాతం లో బీడు నే లలు చూడాలంటే దుర్భిణీ అఖర్లేదు మీ కళ్ళకున్న గంతలు తీసి చూస్తే నల్గొండ ప్రక్కనే క్రిష్నా జిల్లాలో గుంటూరు లొ పల్నడు ప్రాంతంలో ప్రకాశం జిల్లా 90 % మరియు ఈస్ట్ గోదావరి జిల్లాలో సగభాగం, శ్రీకాకుళం విజియనగరం ఎక్కడైనా చూడవచ్చు

cartheek చెప్పారు...

telngaananu K.C.R dochuku thinadamkosam vidadeeya mantunnadu..

అజ్ఞాత చెప్పారు...

balasubrahmanyam garu.. meela ekavachnamto unparliamentary padalu vaade sahasam telangana vaallu cheyaleru.. endukante meeru balavantulu.. memu badhitulam.. nandini pandini cheyagala samarthulu... gobels nu minchina veerulu.. abhivriddhi vishayam lo meeku uttarandhra ku polika...? gattiga aravatam dwaranno.. matlaadatam dwaranno intakalam adhipatyam chelayincharu... maa daggara abhivridhi jaragaledante.. maa daggara jaragaledantam samaadhanama? gata aravai ellalo evaru bagu paddaro.. evaru anigi poyaro meerannatlu durbhini veyakkaraledu lendi.. addagoluga.. banda bootulu raasi titla dandakaani vinipinchinanta matranna nijam abaddhamai podu...ivala telangana noru nokkesi rashtra erpaatunu apeste.. anta kalisi untaranna bhrama meeku.. naaku ledu.. kaka pote veelainanta kaalam ee prantanni dochukovataniki... ikkadi engili metukuli tinenduku meeku avakasam dorukutundi.. alage kaniyandi

హరి - HARI చెప్పారు...

౧)రాష్ట్ర ఆదాయంలో దాదాపు 45 శాతం తెలంగాణ ప్రాంతం నుంచే వస్తోంది. ?

సమాధానం- ఇందులో హైదరాబాదు కూడా ఉంది.
మిగిలిన పది జిల్లాలనుండి ఎంత ఆదాయం వస్తుందో చెప్పండి.

౨) ఇదే సమయంలో.. ఇక్కడ ఖర్చు పెడుతున్న మొత్తం మాత్రం కేవలం 28 శాతం మాత్రమే.?

సమాధానం- ఈ లెక్కలు చూపేటప్పుడు హైదరాబాదుకు జరిగే ఖర్చును తెలివిగా మినహాయించారు.

వాస్తవాలు తెలుసుకోండి. ఒకరి మాట విన్నప్పుడు అది ఎంత వరకు నిజమో అని నిర్ధారించడానికి విజ్ఞతను ఉపయోగించాలి.

అజ్ఞాత చెప్పారు...

hari garu..
telangana nunchi vastunna adayamlo motam hyderabad nunche vastunnadanna abhiprayanikaina vacharu santosham... migata padi jillala nunchi enta adayam vastondanii prashnincharu.. andukoo santosham..mee lekka prakaram migata padi jillala nunchi okka rupayi ravatam ledu... hyd nunchi 45 shatam adayam vastondi.. migata 65 shatam andhra prantam nunchi vastondi. ante migata telangana jillalu okka rupayi kuda generate cheyaleni durbhara stitilo unna sangati oppukunnaru.. ante padi jillalanu rupayi kuda sampadinchaleni dourbhagyam loki nettesaru mee palaka vargam.. mee vargam valla inni jillalu ghosha padutunnayi.. anduke adugutunnaru pratyeka rashtranni.. meeredo uddharistarani meeto kalisinanduke innellalo inta dusthithiki karanamayyaru.. inka unte meerantunna padi jillalanu edari ga marustaru... addagoluga nindincheppudu nijalni angeekarinche dhairyam undali.. vijnatato vyavaharinchali..

అజ్ఞాత చెప్పారు...

Kharchulu lekka chuste hyderabad telangana lo bhagamaaa? lekapote telangana kaada?eppatiki edi avasaramaite adi matladataru meeru.. ee dashteekam tone andhra minaha anni prantalanu tokkipedutunnaru... karadugattina british varasuluga eduti vadini anachivesi adhipatyam chelayistunnaru... telangana vaallanu addadiddamga tittadam annadammula lakshanama? kalisi undatam ante telangana pai titla varsham kuripinchatama? idi kalisi kaapuram cheyatam kaadu.. ishtam leni bharyato balavantamga vyabhicharinchinatlu... hamasa medalo vilasamga gadipe vaariki, dabbunna maarajulaku deeni gurinchi vere cheppedemundi?

హరి - HARI చెప్పారు...

అజ్ఞాత గారు.....

తెలంగాణా వస్తుంది సరే. నేను దానికి వ్యతిరేకం కాదు.
నేను పుట్టింది రాణీగంజ్(సికిందరాబాదు)లోనే.
నాకు ఇప్పుడు ముప్పై ఏండ్లు. ప్రస్తుతం వైజాగ్ లో ఉన్నాను.
ఇప్పుడు నేను ఎవ్వరిని?

వందల సంవత్సరాల క్రితం వచ్చిన తురకవారికి, నాకు తేడా ఏమిటి. అప్పటిది వలస పాలన.
ఈ 54 సంవత్సరాలది కూడా వలస పాలన అని మీకు అనిపిస్తుంది. అది అవగాహనా లోపం....

హైదరాబాదును చూసి ప్రత్యేకం కావాలి అనుకుంటున్నారు గానీ, గుండెలపై చెయ్యేసుకుని మీ అంతరాత్మని అడగండి.
ఇంతటి సిరుల రాజధాని లేని రాష్ట్ర్ర్టం ఎవరికీ అవసరం లేదు.
ఇది అవకాశవాదం.......

కొందరి రాజకీయ నాయకుల, అశక్తుల మాటలు విని ఇలా వాదించడం అమాయకత్వం.....

అజ్ఞాత చెప్పారు...

hari garu.. dhanyavaadalu... ilanti arogyakara charcha jarigite chalu...meerannatlu hyderabadnu chusi telangana pratyeka rashtram kaavalani korukuntunnarannadi nirhetukam... ippati varaku jarigina telangana udyamamlo jarigina vadopavaadalanni gamaninchandi.. vishleshinchandi... ee okkaru kuda hyderabad prastavana cheyaledu.. nenu ghantapathanga cheppagalanu...telangana prantaniki.. ikkada vanarula viniyogam lo.. upadhilo.. samskritika vivakshalo jarigina anyayaanni prashnincharu... peddamanushula oppandam ullanghannu prashnincharu.. aru sutrala pathakam ullanghanannu prashnincharu... 610 go amalu cheyalekapovatanni prashnincharu.. ee prashnalu levanettina pratisaari hyderabadlo abhivriddhi cheyatam telanganalo abhivridhi chesinatle ani dashteekamga vadistunnadi andhra prantam vaalle.. telangana prastavana chesina pratisaari hyd ni chupinchi andolana chestunnadi andhra pranta sodarule.. ivala hyderabad vadulukuntamanate samaikyam undadu.. gimaikyam undadu... ee udyamalanni chappuna challarutayi... migata jillalu vaariki avasarame ledu.. telugu jaati okati .. samaikyam ante artham idena? okka saari mee antaraatmanu adagandi..andaram okati ante artham emiti.. abhivriddhi.. annam annadammulandariki samanamga pettatam kaada? idi amayakatvam kaadu.. avedana... andaram okatiga undalani kunda baddalu kotti matlade vaallu koddi rojuluga blagullo telangana vaarini ela dummetti postunnaro chustunnaru... annadammuluga melagalani korukone vaari ilagena undalsindi... cheppandi

నిజం చెప్పారు...

చాలా క్లియర్ గ విషయం చెప్పారు...తెలంగాణా ఎందుకు అనేవారు ఈ టపా చదివాకా వేస్ట్ కామెంట్స్ చేయరని కోరుకుందాం ......సమైక్య ఆంధ్ర కోరుకునే ఒక్క నాయకుడు కూడా 50 years లో ఒక్కసారి కూడా తెలంగాణా గురించి పట్టించుకోలేదు ఎందుకు?

అజ్ఞాత చెప్పారు...

"చిరంజీవి ప్రజారాజ్యం ను కాపాడుకోవటం కష్టం. సుబ్బరంగా కాంగ్రెస్ లో లేదా తెదేపాలో లేదా బీజేపీలో విలీనం చేయటం మంచిది. అన్నా జయప్రకాష్ అన్నా! నువ్వు గుడక పార్టీ మూసేసి ఎందులోనైనా కలిసిపో. పుట్ట గొడుగుల లెక్క ఇన్ని పార్టీలు ఏమిటికి ?"

are be sale KCR party pedate adi tappu kadu migata evarina pedite meru vorchukoleru. oka chepala kada undi "tanu bayatapadtam chetakdu inkokallani bayataoadanivvadu" dinne edvatam antaru. first niku nuvvu ga telanganiki emi chesavao alo chinchu.

అజ్ఞాత చెప్పారు...

రాష్ట్రం కలిసి ఉన్న ఒక్కటే, విడిపోయిన ఒక్కటే. కానీ హైదరాబాద్ సంగతి ఎం చేస్తారు? దయచేసి అది తెలంగాణా వాళ్ళది మాత్రమే అని అనకండి అది ఆంధ్రప్రధెశ్ ప్రజలందరిది,తెలంగాణా వాళ్ళది మాత్రం కాదు. రాష్ట్రం విడిపోతే హైదరాబాద్ ఆధాయాన్ని మిగిలిన తెలంగాణా జిల్లాలను అభివృద్ధి చేయడానికి ఉపోయోగిస్తారా? అప్పుడు హైదరాబాద్ వాసులకు అన్యాయం జరిగినట్టు కాదా? కేవలం లెక్కల ఆధారంగా రాష్ట్రాన్ని విడగొట్టమంటున్నపుడు మరి అనేక ప్రాంతాల నుండి వలస వచిన అనేక లక్షల మంది ప్రజలను కలిగి ఉన్న హైదరాబాద్ విషయంలో ఎన్ని లెక్కలు చూపించాలో చెప్పండి? తెలంగాణా రాష్ట్రం వచిన తర్వాత హైదరాబాద్ మీద వచిన ఆధాయాన్ని మొత్తాన్ని హైదరాబాద్ అభివృద్ధికే ఉపోయోగిస్తారా చెప్పండి. ఎంతో అభివృద్ధి చెందింది అనుకునే హైదరాబాద్‌లో కూడా వెనకబడిన ఏరియాలు ఉన్నాయి, ఇక్కడ కూడా నిరుధ్యొగూలు ఉన్నారు,రాష్ట్రంలోని మిగిలిన 22 జిల్లాల ప్రజలకు లేని అత్యంత భారీ సమస్య నీటి సమస్య......మీరు తెలంగాణాలో సాగునీరు లేదని భాధపడుతున్నారు, హైదరాబాద్లో తాగడానికి కూడా నీళ్ళు ఉండవు సర్ ఒక్కొక్కసారి. ఇవి మాత్రమే కాదు ఇంకా చాలా సమస్యలు చెప్పగలం.
హైదరాబాద్ నగర ఆధాయాన్ని నగరానికే ఖర్చు పెడితే ఈ సమస్యలన్ని తీరిపోతాయి అది కేవలం స్వయంపరిపాలన వల్ల మాత్రమే సాధ్యం. కాబట్టి ఎలాగో రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేయమంటున్నారు దానికి బదులు మూడు ముక్కలు చేయండి. కలిసి ఉంటే కనీసం ఆంధ్రులు ఐన పెట్టుబడులు పెట్టి నగరాని అభివృద్ధి చేస్తారు. విడిపోతే మీరు చెప్పిన తెలంగాణా కష్టాలు తీర్చడానికే హైదరాబాద్ ఆధాయాం సరిపోతుంది. పెట్టుబడులు పోతాయి హైదరాబాద్ ప్రజలు అన్యాయం ఐపోతారు. కాబట్టి కలిసి ఉండాలి లేదా హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతం చేసి ఉమ్మడి రాజధానిగా ఉంచాలి.

అజ్ఞాత చెప్పారు...

ayya,

telangana kedo anyaayam jarigipoyindani goggolu pedutunnaru.

ekkada jarigindandi anyaayam.

"neekaalmokta baanchan" ane stiti nijam nuchi vidipoye naati ki unna telanganani itara praanta vasula pettubadulatho atu vallu baagu padi, itu veellaki atmaviswaasam teesukoni vacchi bagu cheyadam anyaaayama?

enno manchi vasatulu unna
Vizag/Vijayawada ni abhivriddi cheyakunda Guttala begam pet ane palleturuni HITEC city ga marchadam anyaayama.

Kaneesam Seema andhrallo 5-10 vela mandiki udyogam choopinchagala industries emaina unnaya? Ikkada BHEL to DRDL, ICRISAT to Agriculture University and IIT's inka cheppukunte chaalane unnai.

PRATHIBHA UNNAVAADINI EVVADU EE PRAPANCHAM LO EKKADA AAPALEDU.

KANEESAM EE 56 SAMVATSARALALO VACCHINA MEE PRATINIDHULU EMI CHESARO ADAGAKUNDA SAAMANYUDIKI KADUPUKINTHA PETTANI EE PRATYEKA VAADANNI MANUKONDI.

CHETANAITHE MEE PRATINIDHULANI CHEPPULATHO KOTTI NIDHULANU ENDUKU TEESUKONI RAALEKAPOTUNNARO NADI VEEDHI LO NILADEESI ADAGANDI. ANTHE KAANI PILLALA CHADUVULU PAADU CHESI, PANI PAADU CHESE EE PANIKIMAAALINA VADANALU KATTI PETTANDI

అరుణ్ చంద్ర చెప్పారు...

ఇలాంటి వాదనలన్నీ అప్పనంగా హైదరాబాదును దోచుకుందామనే......సంయుక్త ఆంధ్రప్రదేశ్ విషయం వదిలేద్దాం, తెలంగాణా ప్రాంత పార్లమెంటు సభ్యులకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేనిధులు ఏమి చేశారో ఎపుడైనా అడిగారా? ఆంధ్రలో ఎక్కడ చూసినా పచ్చటి పొలాలా? ఇంత అన్యాయపుమాట పగవాడు కూడా అనడు. ప్రకాశం, పల్నాడు, అనంతపురం ప్రాంతాలు తెలంగాణలో పాలమూరు మినహాయిస్తే వెనకబడిన జిల్లాల్లో ముందువరసలో ఉంటాయి.ముందు కళ్లకు తెలగాణ రాజకీయ నిరుద్యోగులు కట్టే గంతలు విప్పిచూడండి.

తెలుగు చెప్పారు...

http://uselessnenusytham.blogspot.com/

RAMTALLURI చెప్పారు...

prantham eadi aiyna rajadhani unna prantham pratyeka raastam koraram sarikathu. prajalu eppudu raajadhani vipae velataaru. eadu samvatsaraalu nivasisthae vaaru aa praantham vaaru avutharanna vishayam guruthunchukondi. ee chattalu aiyna chesukondi. nijam adi.
deeniki okate parishkaaram anni pranthalalo parisramika abhivruddi kendrikrutham aiyyetatlu chudadame parishkaram. ee udyamaalu ikkadidaaka ravatam kendrikaranae.

Unknown చెప్పారు...

Raasta income lo 23% raayalaseema nundi vastundj andulo 1988 nundi maaku ichindi 3% maaku anyayam jaragaleda....
%

Unknown చెప్పారు...

raashta income lo 23% raayalaseema nundi vastundi kaani 1988 nundi ippativaraku maaku vachindi 3%memu kuda chala nashtapoyamu sodhara