24, డిసెంబర్ 2009, గురువారం

సమైక్యానిదే గెలుపు అభినందనలు ...

శుభం.. రాజ్యం వీరభోజ్యం అన్నమాట మరోసారి వాస్తవరూపం దాల్చింది.. వీరులు గెలుపు సాధించారు.. పరాజితులకు ఓటమి అన్నది తెలియకుండా జాగ్రత్తగా గెలిచారు.. సంబరాలు చేసుకుంటూనే అబ్బే ఎవరూ గెలవలేదు.. ఎవరూ ఓడిపోలేదు.. అంటూ నీతిచంద్రిక వల్లించారు.. ప్రపంచంలో ఇది సహజపరిణామం.. ఎవరు బలవంతులైతే.. వారి చేతిలోనే విజయం ఉంటుంది. బాధితుడు ఎంత ఉద్యమించినా.. ఎంత ఆవేదన చెందినా, ఎంత ఆక్రోశాన్ని వెళ్లగక్కినా బలవంతుడి ముందు అవేవీ ఆగవు.. నిలబడవు.. ఆ ఆవేదనల స్వరాలు బయటకు వినిపించనైనా వినిపించవు.. స్వరాన్ని గొంతు దాటక ముందే అణచివేస్తారు.. పీక పిసికేస్తారు... పాటను పల్లవించమన్నారు.. పల్లవిస్తున్న క్రమంలోనే పీకనొక్కేశారు..

ఒక వర్గ ప్రజల అభిప్రాయాలతో సంబంధం లేకుండా, వారికి హక్కులు లేకుండా, వాళ్లకు ప్రజలనే గుర్తింపు సైతం లేకుండా.. వాళ్లను మనుషులుగానే చూడకుండా... ఢిల్లీ స్పందించింది... 53 ఏళ్ల ఉద్యమానికి, 40 ప్రాణాలకు విలువ లేకుండా పోయింది.. ఒక్క ప్రాణానికి 40 ఊపిరుల వెల కట్టింది. తెలంగాణ ఇవ్వమని చెప్పకుండానే ఇవ్వటం లేదని తేల్చేసింది. ఐక్యత లేని నాయకత్వం... బలమైన లాబీయింగ్‌ ముందు ఒక్క నిమిషమైనా నిలబడలేకపోయింది. ఆ ప్రాంతాన్ని మేం అభివృద్ధి చేశామన్నారు.. మేం పెట్టుబడులు పెట్టి అభివృద్ధి చేశాం కాబట్టి వారికి ఎలాంటి హక్కులు ఉండటానికి వీల్లేదన్నారు.. ఆ ప్రాంతం వాళ్ల అబ్బ సొత్తా అని నిలదీశారు.. తిట్టారు.. నిందించారు.. రాష్ట్రం ఇస్తే, వస్తే మావోయిస్టుల చేతుల్లోకి ప్రభుత్వం వెళ్లిపోతుందన్నారు..అసలు రాషా్టన్న్రి ఎవరూ కోరుకోవటం లేదని బల్లగుద్ది వాదించారు... ఢిల్లీలో చెప్పాల్సిందంతా చెప్పారు. బెదిరించాల్సిందంతా బెదిరించారు..లాబీయింగ్‌ చేయాల్సిందంతా చేశారు.. మొత్తం మీద సాధించారు.. దాని వల్ల నష్టపోతున్నదెవరు?
ఇవాళ సమైక్యంగా తెలంగాణాతో బలవంతంగా అంటకాగడం వల్ల ఇంటిగ్రిటీ సాధ్యపడుతుందని ఎలా భావిస్తున్నారు? సమైక్యంగా ఉంటామని చెప్తున్న ఏ ఒక్కరిలో ఆ భావన లేదు.. తెలుగువాళ్లం అంతా ఒక్కటే అని చెప్పే ఏ ఒక్కరిలో అలాంటి అభిప్రాయం మచ్చుకైనా లేదు.. ఇది సాధ్యం కాదని వారికీ తెలుసు.. ఎందుకంటే సమైక్యత అంటూ ఇంతకాలం ఉద్యమించిన వాళు్ల తెలంగాణలోని అన్ని జిల్లాల్లోనూ సమైక్యం కావాలని కోరుకుంటున్నారని తెగ ఊదర గొట్టారు....మరి ఇవాళ ఉద్యమిస్తున్నదెవరు? వారి దృష్టిలో కెసిఆర్‌ అనే వేర్పాటు వాది ప్రేరేపించడానికి ముందే... ఆయన రాజీనామా ప్రకటనకు ముందే వీధుల్లోకి వచ్చిన ప్రజలను ప్రేరేపించింది ఎవరు? ఇవాళ ఐక్యతారాగాన్ని మోతెక్కించిన మోహన బాబులు, గోపాలరాజులు వారి దగ్గరకు వెళ్లగలరా? మాట్లాడగలరా? వీళ్లందరూ రౌడీలేనా? కిరాయి గూండాలా? ఎలాగూ బలవంతులు కాబట్టి వారిని అణచివేయటం పెద్ద పనే కాదు.. కాబట్టి ఈ ఉద్యమాలపై స్పందించి టైం వేస్‌‌ట చేసుకోవలసిన అవసరమూ లేదు.. ఇగ్నోర్‌ చేస్తే చాలు... అరిచి అరిచీ, చచ్చి చచ్చీ వాళ్లే సొమ్మసిల్లి పడిపోతారు...
వారికి కావలసింది ఐక్యత కాదు.. వారిని ఆధిపత్యం ముందుకు తోస్తోంది. వనరులు వారిని ప్రేరేపిస్తున్నాయి. ఆంగ్లేయుల పరిపాలన నుంచి పుణికిపుచ్చుకున్న దోపిడీ తత్వం వారిని బూటకపు సమైక్యతకు ఉసిగొల్పుతోంది...దీన్ని ఎదుర్కోవటం బతుకుపోరాటం చేస్తున్న తెలంగాణా వారికి సాధ్యమా? ఇవాళ రోడ్లపైకి వచ్చి ఉద్యమిస్తున్నారు.. ఉద్యమించటానికి ముందే.. చిదంబరం ప్రకటన రావటానికి ముందే భారీ ఎత్తున బలగాలను మోహరించిన సర్కారు ఉద్యమాన్ని ఈ సారి తీవ్రంగా అణచివేయకుండా ఉంటుందని ఎలా అనుకుంటారు? అవసరమైతే కాల్పులకు కూడా వెనుకాడకపోవచ్చు. ఇక రాష్టప్రతి పాలన అస్త్రం ఎలాగూ చేతిలో ఉంది... వీటన్నింటినీ ఎదుర్కొని ఉద్యమం ముందుకు పోతుందా? తెలంగాణ పార్టీలన్నీ ఏకమవుతాయా? ఆంధ్ర అడ్డంకులను అధిగమించి తమ రాషా్టన్న్రి తాము తిరిగి సాధించుకోగలుగుతారా? చూద్దాం... any way andhra sodarulaku abhinandalu

10 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

మొత్తానికి కిందపడ్డా పైచేయి మీదేనంటారు.

Ali చెప్పారు...

మోసపొవడం అనేది తెలంగాణా ప్రజల నొదిటి మీద రాసుందో ఏమో

kovela santosh kumar చెప్పారు...

maaku paicheyi anedi undadu... kinda padeyabadatm maaku 1969 nunchi vastunnade... meede paicheyi... worry kakandi... mee pettanam maa pai ippatlo velladu lendi... hayiga mammalni elukondi

అజ్ఞాత చెప్పారు...

You are sick thats it !

నిజం చెప్పారు...

తెలంగాణా ప్రజలకు మోస పోవడం అనేది కొత్త కాదు కదా....ఆంధ్ర లోబ్బ్యింగ్ ముందు తెలంగాణా ప్రజలు ఓడిపోవడం నిజంగా బాదాకరం

కొండముది సాయికిరణ్ కుమార్ చెప్పారు...

I don't blame Andhra Leaders nor would I say it's Samaikya Andhra's victory.

There is no unity among these Telangana Leaders. Every one feels that the other one would take the credit. Even today, some of the Telangana Ministers are merrily cheering Chidambaram's statement. Shame on these leaders.

I wish, people take the issue in to their hands than just leaving it to these leaders.

I wish, people force their elected representative resign, if they haven't already done it.

నువ్వుశెట్టి చెప్పారు...

నోటికాడ కూడు లాగేసేరని వాపోతున్నాడు కెసీఅర్, ఎంత తినాలనుకున్నాడో మరి.
అయినా ఏమి మోసపోవటమో ఏమో. ఇద్దరు ప్రధానమంత్రులు అక్కడినుండే ఎన్నికయ్యారు, ఎప్పుడూ రాష్ట్ర కాబినెట్ లో అక్కడి మంత్రులు ఉంటానే ఉంటారు. తెలంగాణా అభివృద్ధి కోసం పాటుపడిన వారే లేరు. ఏప్పుడూ ప్రత్యేక రాష్ట్రం ప్రత్యేక రాష్ట్రం. ఇదేదో ప్రత్యేక దేశం కోసం పోరాడుతున్నట్లు ఫీలవుతున్నారు. రాష్ట్రం ఏర్పడినా కూడా అదే నాయకత్వం, ఆ మంత్రులే, ఏమీ మార్పుండదు. ఏదో జరిగిపోతుందనుకుంటే అది అమాయకత్వమే. ఈ శ్రమంతా ప్రాంత అభివృద్ధి కోసం పడితే ఎంతో న్యాయంగా ఉంటుంది. అందరూ కల్సి ఉంటేనే మన రాష్ట్రానికీ తెలుగు ప్రజలకూ బలం.

అజ్ఞాత చెప్పారు...

separate state ivvakunte separate country kosam poraatam modalavuthundi appudu enduku state ivvaleda ani andhrulantha badha padutharu

అజ్ఞాత చెప్పారు...

telangana pourusham marosaari niroopinchukovalasina samayam vachindi

అజ్ఞాత చెప్పారు...

vidipoyinaa kalisi unna prasthutam unna rajakeeya naayakula valla etuvanti abhivriddi jaragadu. valla vriddi maatram jarugutundi.

nashta potunnadi samanya prajale eppudu. andaru andolanalu aapi alochiste manchidi.