తెలంగాణ ప్రజలపై గుడ్డి విద్వేషం పెచ్చుమీరిపోయింది. ఏది నిజం అని ప్రశ్నలు వేసినందుకే అడ్డంగా నిందలు వేస్తున్నారు.. .. గత పది రోజులుగా సమైక్యత గురించి వీధుల్లో ఉద్యమాలు చేస్తున్న వారు కానీ, ఇంటర్నెట్లలో వాదోపవాదాలు చేస్తున్న వారిలో కానీ.. ఏ ఒక్కరైనా తెలంగాణా వారితో ఇంటిగ్రిటీ కోసం ఎందుకు ప్రయత్నించటం లేదు? మాకు అన్యాయం జరుగుతుందని నెత్తీనోరూ పెట్టుకుని మొత్తుకుంటున్న వాళు్ల తెలంగాణ వాళు్ల.. మరి వారిని సముదాయించి.. మీకు మేం అండగా ఉంటాం.. అని సముదాయించి, అనునయించి వారితో మమేకం అయిన వాళు్ల ఎవరైనా ఉన్నారా? ఆప్యాయత వ్యక్తం చేసిన వాళు్ల ఉన్నారా?
ఇప్పటి సంగతి దేవుడెరుగు... అసలు ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన నాటి నుంచి ఏరోజైనా రెండు ప్రాంతాల మధ్య సమగ్రత కోసం ప్రయత్నించిన వాళు్ల ఉన్నారా? ఆంధ్ర విశ్వవిద్యాలయ విద్యార్థులతో, ఉస్మానియా గురించి కానీ, ఉస్మానియా విద్యార్థులకు ఆంధ్ర విశ్వవిద్యాలయం గురించి కానీ ఎంతవరకు తెలుసు? విజయనగరం విద్యార్థికి నిజామాబాద్ సంస్కృతి తెలుసా? నిజామాబాద్ విద్యార్థికి గోదావరి జిల్లా ప్రజల జనజీవితం గురించి కనీస అవగాహన ఉందా? ఆయా ప్రాంతాల ప్రజల మధ్య సత్సంబంధాలు నెలకొల్పేందుకు ఎవరైనా ఎందుకు ప్రయత్నించలేదు? ఆటపట్టింపు పేరుతో వెటకారం చేస్తుంటే ఎవరూ ఏమీ అనకుండా ఎలా ఉండగలిగారు? ఇలా అంటే అబ్బే మీరు జనరలైజ్ చేసి చెప్తున్నారంటారు..తప్ప వాస్తవాలేమిటని పరికించరు.. వివిధ తెలంగాణ జిల్లాల ప్రజలు సమైక్యంగా ఉండాలని కోరుకుంటున్నారని ఆంధ్రప్రాంతంలో నాయకులు, ఉద్యమకారులు, బ్లాగర్లు పదే పదే చెప్తున్నారు సంతోషం.. కానీ, ఏ ఒక్క తెలంగాణ జిల్లాలో సమైక్య ఉద్యమాన్ని ఎందుకు నిర్వహించటం లేదు? ఫలానా సందర్భంలో అన్యాయం జరిగింది అని వాళు్ల చెప్తున్నారు.. ఫలానా విధంగా మోసపోయామని వారంటున్నారు.. ఫలానా విధంగా వివక్ష చూపించారని వారు ఆరోపిస్తున్నారు.. వాళ్ల మాటల్లో, ఆరోపణల్లో, వాదనల్లో నిజానిజాలను విశ్లేషించి వాస్తవాలేమిటో? వాళ్లెందుకు విడిపోవాలనుకుంటున్నారో? అలా విడిపోకుండా ఏం చేస్తే బాగుంటుందో ? అది చేయాల్సిన బాధ్యత సమైక్యత కోరుకుంటున్న వారిపైన లేదా? అంతా కలిసి ఉండాలని అనుకోవటం రెండువైపులా జరగాలి కదా? ఒక వైపు మేము కలిసి ఉండమని కరాఖండిగా చెప్తుంటే.. వాళ్లకు ఏమీ తెలియదు, నాయకులు తప్పుదారి పట్టిస్తున్నారని సమైక్యవాదులు భావిస్తే, మరి వాళ్లను కన్విన్‌స చేయాల్సిన బాధ్యత సమైక్యత కోరుకుంటున్నవారిపైన లేదా? ఇప్పటివరకు కనీసం ఈ పది రోజుల్లో ఎంతమంది సమైక్యవాదులు తెలంగాణ ప్రాంతంలో తమ వాదాన్ని వినిపించి అక్కడి ప్రజలతో మమేకం అయ్యారు? ఇంటర్నెట్‌ల ద్వారా తమ వాదన వినిపిస్తున్న సమైక్యవాదులు తెలంగాణకు జరిగిందంటున్న అన్యాయం పట్ల ఎంత హేతుబద్ధంగా స్పందించారు? ఒక జీవోలో అన్యాయం జరిగిందని ఉదాహరణ చూపించగానే ` ఆ.. అయితే ఏంటట...' అని అంటాడొకాయన.. ఆయన సమైక్యవాది.. అంతా కలిసికట్టుగా ఉందామనే గొప్పవ్యక్తి వ్యక్తిత్వం ఇది. ఇంకో ఆయన విడిపోతే మరో పాకిస్తాన్ అయిపోతుంది.. పోతే పొండి అంటాడు.. సమైక్యత పట్ల ఈ మహానుభావుడికి ఉన్న గొప్ప అభిమానం ఇది. మరో అజ్ఞాత వ్యక్తి మీరు పురుగులపడి చస్తారంటాడు.. ఓహ్ తెలంగాణ ప్రజలంతా తమ సోదరులని భావించి వారితో కలిసిమెలిసి కలకాలం ఉండాలని మనఃస్ఫూర్తిగా కోరుకుంటున్న పెద్దమనుషులు వీళు్ల..
తమకు జరిగిన అన్యాయం గురించి తమకు తెలిసిన కొన్ని నిజాలను చర్చకు తీసుకువచ్చినందుకే ఈ నిందలు.. తిట్లు.. శాపనార్థాలు..తమకు అన్యాయం జరిగిందన్న బలమైన అభిప్రాయం కలిగిఉన్నారు కాబట్టే తెలంగాణా వాళు్ల విడిపోతామంటున్నారు.. వాళ్ల అభిప్రాయం తప్పయితే అది తప్పని చెప్పాలి.. అదే సమయంలో ఒప్పేమిటో వివరించాలి..
ఎందుకంటే హృదయపూర్వకంగా అన్నదము్మల్లా అందరం కలిసిమెలిసి ఉందామని భావించే వారి బాధ్యత అది.
పోనీ కొందరే తెలంగాణాను కోరుకుంటున్నారు.. ఎక్కువమంది సమైక్యంలోనే ఉందామని భావించినట్లయితే, దాన్నయినా నిరూపించాలి.. ఇందుకు ఏ ఎన్నికలనో, వాటి ఫలితాలనో చూపించటం కాదు.. తెలంగాణ కోరుకుంటున్నారా? లేదా అన్నది తేలటానికి అదొక్కటే అజెండాగా ప్రత్యేక రెఫరెండం పెడ్తే తేలేది కాదా....తొమ్మిదేళ్ల నుంచి పాపం బక్కనేత కిందామీదా పడి అంతా మర్చిపోయిన తెలంగాణను చర్చలోకి తీసుకువచ్చాడు కదా? మరి ఇన్నేళ్లలో ఎప్పుడో ఒకసారి రెఫరెండం పెట్టి ఉంటే ప్రజల్లో ఏం అభిప్రాయం ఉందో స్పష్టంగా తెలిసేది కాదా.. సార్వత్రిక ఎన్నికల్లోనో, సాధారణ ఎన్నికల్లోనో, స్థానిక ఎన్నికల్లోనో వచ్చే ఫలితాలు సాధరణీకరణగానే ఉంటాయి. అందుకు తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉంటే ప్రత్యేక రెఫరెండం ఏర్పాటు చేసే ఇబ్బంది సర్కారుకూ ఉండనవసరం లేదు.. అన్నదము్మల్లా కలిసిమెలిసి ఉండాలని హృదయపూర్వకంగా కోరుకునే అన్నయ్యలకు ప్రభుత్వాన్ని ఒప్పించటం పెద్ద కష్టమేం కాదు.. మీరు అమాయకులు.. మిమ్మల్ని మీ నాయకులు తప్పుదారి పట్టిస్తున్నారని తాము చేస్తున్న ఆరోపణలను నిజమేనని చెప్పటానికి ఇంతకంటే ఏముండేది? గుడ్డిగా జనరల్ ఎన్నికల ఫలితాలే నిదర్శనమని మొండిగా వాదిస్తే అది మూర్ఖత్వం అవుతుంది.. ఇదేమీ నింద కాదు.. తిట్టు కాదు.. మొండితనానికి ఒక పర్యాయపదం మాత్రమే.. ఎంతో సమన్వయంతో, సంయమనంతో వ్యవహరించి ఇలాంటి కార్యక్రమాన్ని ఎప్పుడో చేసి ఉంటే ఈ సమస్య ఉత్పన్నమయ్యేది కాదు కదా..
ఎందుకంటే హృదయపూర్వకంగా అన్నదము్మల్లా అందరం కలిసిమెలిసి ఉందామని భావించే వారి బాధ్యత అది.
కనీసం పదకొండు రోజుల పాటు కెసిఆర్ నిరాహార దీక్ష జరిగింది...సమైక్యవాదుల అభిప్రాయం ప్రకారమే అయినా, సెలైన్ బాటిళు్ల ఎక్కించుకుని పదకొండు రోజులు లాగించారు.. కనీసం ఆ దీక్షే ఉస్మానియా విద్యార్థులకైనా, కెయు విద్యార్థులకైనా ఒక రకమైన ప్రేరణను ఇచ్చింది కదా.. వారి ఉద్యమం అయినా అన్ని రోజులు నడిచింది కదా.. ఈ పదకొండు రోజుల్లో ఒక్కసారైనా సమైక్యవాదులు ఎవరైనా అయ్యో మిమ్మల్ని కెసిఆర్ మోసం చేస్తున్నారు.. మనం అంతా కలిసిమెలిసి ఉందాం... అని ఉస్మానియాకో, కెయుకో వెళ్లి విద్యార్థులతో ఒక్కరైనా మాట్లాడారా?
ఎందుకంటే హృదయపూర్వకంగా అందరం అన్నదము్మల్లా కలిసి ఉందామని భావిస్తున్న వారి బాధ్యత అది..
అయ్యో వారు మనల్ని వీడిపోతామంటున్నారు.. వాళ్లను నిలువరించటం ఎలా అని ఆలోచించటం వారి కర్తవ్యం.. పోనీ విద్యార్థులు ప్రొవోక్ అయ్యారు అనుకుంటే.. తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా అక్కడి పది జిల్లాల్లో ప్రజలను చైతన్య వంతులను చేసే, అవగాహన కల్పించే ప్రయత్నాలు, చర్యలు ఎవరైనా ఎందుకు చేపట్టలేదు?
ఎందుకంటే హృదయపూర్వకంగా అందరం అన్నదము్మల్లా కలిసి ఉందామని భావిస్తున్న వారి బాధ్యత అది..
అప్పుడంటే సోనియమ్మ ఉన్నట్టుండి తెలంగాణ ప్రకటిస్తుందని ఊహించలేదు కాబట్టి లైట్‌గా తీసుకున్నారని సరిపెట్టుకోవచ్చు. కానీ, సడన్‌గా ఆమె చిదంబరం చేత ప్రకటింపచేసిందనుకుందాం.. ఆ తరువాతైనా అందరం ఒకటిగా ఉందామనుకుంటున్నాం... మేం విడిపోదలుచుకోలేదు.. కెసిఆర్ మిమ్మల్ని పక్కదారి పట్టించారు.. తెలంగాణ ప్రజలంతా మాతోనే కలిసి ఉన్నారు.. ఇదిగో రుజువు.. పది జిల్లాల్లో జనాలు ఇలా స్పందిస్తున్నారు.. వాళ్ల అభిప్రాయం ఇదని సోనియమ్మకు ఎందుకు చెప్పలేదు?
ఎందుకంటే హృదయపూర్వకంగా అన్నదము్మల్లా అందరం కలిసిమెలిసి ఉందామని భావించే వారి బాధ్యత అది..
సమైక్యం అని కోరుకుంటున్న ప్రాంతాల్లో సమైక్యం, సమైక్యం అని ఉద్యమించటంలో అర్థం ఏముంది.. అక్కడి ప్రజలు ఎలాగో సమైక్యాన్నే కోరుకుంటున్నారు.. దీన్ని రుజువు చేయాల్సిన అవసరం లేదు.. ఎక్కడైతే విడిపోతామంటున్నారో.. అక్కడ సమైక్య ఉద్యమం చేయాలి..
ఎందుకంటే హృదయపూర్వకంగా అన్నదము్మల్లా అందరం కలిసిమెలిసి ఉందామని భావించే వారి బాధ్యత అది.
తెలుగువారంతా ఒకటే అని, పాలు పొంగు మన తెలుగు గడ్డను పగులగొట్టవద్దంటున్న వాళ్లంతా ఇవాళ్టికీ సమైక్యాంధ్ర అనే అంటున్నారు కానీ, సమైక్యాంధ్రప్రదేశ్ అని మాత్రం అనటం లేదు.. ఆంధ్రరాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అయిన విషయాన్ని మరిచిపోయారా? లేక 1953నాటి ఆంధ్ర రాషా్టన్న్రే సమైక్యంగా ఉంచాలన్నది వారి ఉద్దేశ్యమా? ఉద్యమాలు కూడా అక్కడే జరుగుతున్నాయి కదా? దీన్ని వివరించటం చాలా అవసరం.
ఎందుకంటే హృదయపూర్వకంగా అన్నదము్మల్లా అందరం కలిసిమెలిసి ఉందామని భావించే వారి బాధ్యత అది.
సమైక్యాంధ్ర ఉద్యమాలు ప్రారంభమైన తరువాతే.. రాష్ట్ర రాజకీయం నిట్టనిలువునా చీలిపోయింది. రాజకీయ పార్టీలన్నీ రెండు ముక్కలయ్యాయి. ప్రాంతాల వారిగా రాజకీయం ముక్కలు చెక్కలైంది. రాజకీయ సమీకరణాలు అనూహ్యంగా మారిపోయాయి. పార్టీల అధినేతలకు కూడా పరిష్కరించటానికి వీల్లేని పతాక స్థాయికి చేరుకున్నాయి. ఈ వాతావరణంలో భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ఒక్క క్షణమైనా సభాకార్యకలాపాలు నిర్వహించగలుగుతుందా? ఒకే పార్టీ నేతలు కలిసిమెలిసి ఉండగలరా? ఈ విధంగా రాష్ట్రం ఎంతవరకు సమైక్యంగా ఉండగలుగుతుంది.. సమైక్యత తిరిగి సాధించేందుకు మార్గం ఏమిటి? ఎందుకు అంతా కలిసి ఉండాలి? జవాబు చెప్పటం అవసరం..
ఎందుకంటే హృదయపూర్వకంగా అన్నదము్మల్లా అందరం కలిసిమెలిసి ఉందామని భావించే వారి బాధ్యత అది.
6 కామెంట్‌లు:
మీ పొస్ట్లలొ ఈ విద్వేషం ఈ మద్య మరీ మితిమీరి వుంటుంది... ఎదుటివారిని విమర్శించేముందు మీరు రాసెదెమిటొ, దాంట్లొ ఎదుటివారిని విమర్శించే అంశం మీ పొస్టులో ఎంత శాతం వుందొ చూసుకొరనుకుంటా..
చాలా బాగా చెప్పారండి.
excellent post
To Manchu pallaki garu
If you think this post is pro vacating the people, see the Sharath posts, those provocate the people who dont want Telangana also, later they will say they want Telangana. please give same suggestion to that person also.
excellent balanced post.
పొట్టి శ్రీ రాములు ది ఏ వాదం?
మాకు సంబందించినంత వరకు తెలంగాణా కేవలం ఏర్పాటు వాదమే. అది వేర్పాటు వాదం కాదు. మేం ఏ ప్రాంతేతరుడిని మా ప్రాంతం విడిచి వెళ్ళమనలేదు. మా పాలన మా చేతుల్లోకి రావాలి. మా వనరులు మాకు ఉపయోగపడాలి. మా ఉధ్యోగాలు మాకే ఉండాలి.
సమైఖ్యం పైకి అందంగా కనపడుతుంది. దానిలో కష్టాలు అనుభవిస్తే తెలుస్తుంది. అన్నదమ్ముల్లా విడిపోవడం అంటే మా బస్సుల్ని మీరు తగులబెట్టి సరిహద్దులో గోడలు కట్టి దొంగ నిరాహారదీక్షలు చేయడమా?
మాది వేర్పాటు వాదం అయితే మరి మద్రాసునుండి విడిపోదామన్న పొట్టి శ్రీ రాములు ది ఏ వాదం? అప్పుడు భారతీయత, పెద్దరాష్ట్రం ఉపయోగాలు గుర్తు రాలేదా?
manchu pallaki gaaru. adi vidvesham kaadu. Nijaanni balanced ga chepparu.
కామెంట్‌ను పోస్ట్ చేయండి