వెనకట ఎప్పుడో పార్వతీ దేవి నలుగుపిండితో ఓ పిల్లవాణ్ణి పుట్టిస్తే.. వాడి తలను శివుడు నరికేశాడట.. తరువాత అంతా గోల చేస్తే ఏనుగు తల తీసుకువచ్చి అతుకుపెట్టాడట.. ఆ తల మొండేనికి అతుక్కుని ఉండేందుకు ఆయన ఆనాడు అన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు. కింద పొట్టకు, పైన తలకు బ్యాలెన్‌స చేశాడు కాబట్టి సరిపోయింది. కానీ, ఇప్పుడు భూలోకంలో తలకూ మొండేనికీ పేచీ వచ్చిపడింది. దీన్ని ఎలా అతికి ఉంచాలో, విడగొడితే మొండేనికి మరో తలను ఎక్కడి నుంచి తెచ్చి పెట్టాలో తెలియక ఢిల్లీలో ఇవాళ్టి ఆధునిక పార్వతి నానా తంటాలు పడుతోంది..
అప్పుడెప్పుడో అరవై ఏళ్ల క్రితం పొట్టి శ్రీరాములు గారు తమిళుల నుంచి ఆంధ్రులను వేరు చేయాలంటూ చనిపోయేంతవరకు ఆమరణ నిరాహార దీక్ష చేశారు.. మద్రాసు లేకుండా ఆంధ్ర ప్రాంతాన్ని ఇస్తామంటే మద్రాసు లేని ఆంధ్ర తలకాయ లేని మొండెంగా ఉంటుందని పాపం తెగ బాధపడిపోయారు. అలాగే, ఆ అసంతృప్తితోనే ఆయన కన్నుమూశారు.. అమరుడయ్యారు.. చివరకు అప్పటి ఢిల్లీ శివుడు జవహర్ లాల్ నెహ్రూ తల లాంటి మద్రాసును నరికేసి మొండేన్ని వేరు చేశారు.. తలకాయ లేని మొండెంగానే ఆంధ్ర రాష్ట్రం మూడేళు్ల విలవిల్లాడుతూనే గడిపింది. 1956లో ఏదో తల లేకపోతే బాగుండదేమనుకున్నారేమో.. అదే శివుడు అంటే నెహ్రూ ఇవాళ ది గ్రేట్ లగడపాటి రాజగోపాల్ నిర్ధారించినట్లు హైదరాబాద్ అనే తలకాయను తీసుకువచ్చి సదరు ఆంధ్ర మొండేనికి అతికించారు.. అయితే అది అప్పుడే సరిగ్గా అతుక్కోలేదు.. ఎప్పుడైనా ఊడిపోయేదేనని అతికించేప్పుడే నెహ్రూ చెప్పకనే చెప్పారు.. ఏదో గొడవ పడుతున్నారు కదా అని అతికించామన్నారు.. మొత్తానికి మొండెంపై అటూఇటూ ఊగుతూ తల ఇంతకాలం ఆయాసపడుతూనే ఉంది. తలలోని మెదడును వాడుకుని మొండెం బాగానే బాగుపడింది. కొత్త బట్టలు వేసుకుంది. ఫ్యాషన్‌గా తయారైంది. చేతులకు బంగారు మురుగులు, కాళ్లకు గండపెండేరాలు తొడుక్కుంది. తలకు, మొండేనికి జాయింట్ ఉండే చోట అంటే మెడలో బంగారు నగలూ వేసుకుంది.. అక్కడ కూడా మెడ కేవలం ఆధారమే.. ఇక్కడ తల జుట్టు నెరిసింది. ముఖంపై మచ్చలు వచ్చాయి. మొండేనికి ఇవేమీ పట్టింది లేదు. దానికి కావలసింది ఆహారం.... తలలోని నోరు ఇందుకు వాహిక అయింది. నోట్లోంచి ఆహారం చేరేది మొండెంలో భాగమైన పొట్టలోకే కదా... ఇక్కడి తిండి అక్కడికి వెళ్లినట్లు.. ఇక్కడి ఆదాయం అక్కడికి వెళ్లినట్లు.. ఇప్పుడు ఈ మొండెంపై తల ఇమడలేకపోయింది. ఊడిపోయే దశకు చేరుకుంది. ఎప్పుడెప్పుడు ఊడిపోవాలా అని అల్లాడిపోతోంది. డిల్లీలో ఉన్న శక్తి అమ్మన్ కూడా భరించలేక ఇక ఊడిపొమ్మంటూ పర్మిషన్ ఇచ్చేసింది.. కానీ, కింద ఉన్న మొండేనికి మాత్రం తలను విడిచిపెట్టడం ఇష్టం లేకుండా పోయింది. అతుకులు సరిగ్గా లేకపోయినా, లీకేజీలు ఉన్నా, ఇదే తలను పట్టుకు వేలాడటమే మొండేనికి కావలసింది. ఎందుకంటే ఈ తలలో తలపులే దాని బతుక్కు ఆధారభూతమైంది. మరో తలను తెచ్చిపెట్టుకుంటే ఆ తలకు తానే ఆధారం కావాల్సి ఉంటుంది. ఆల్రడీ తనకు ఆధారంగా ఉన్న తలను విడిచిపెట్టుకుని మరో తలతో తంటాలెందుకని పేచీ పడుతోంది... ఇప్పుడు ఈ పేచీని ఎవరు తీర్చాలి... ఏం చేసినా అతుకుపడని తలను, మొండేన్ని ఎంతకాలం కలిపి ఉంచగలరు?
6 కామెంట్‌లు:
కాకినాడ దగ్గర 30చ.కి.మీ.విస్తీర్ణంగల యానాం 1954 దాకాభారత్ లో ఫ్రెంచ్ కాలనీగా ఉంది.నేడు పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతంలో భాగం.1954లో లో విమోచనం చెంది స్వతంత్రభారతావనిలో విలీనంచెందినా 1956 లో భాషా ప్రాతిపదికన తెలుగు రాష్ట్రంలో కలవలేదు.1948లో హైదరాబాద్ ను పోలీసు చర్యజరిపి ఇండియాలో కలిపారు.1949 లో అప్పటికి ఒక ఫ్రెంచి కాలనీ గా ఉన్న చంద్రనాగూర్, సమీపంలోని బెంగాల్ రాష్ట్రంలో విలీనం అయింది. కాకినాడ మునిసిపల్ కౌన్సిల్ కూడా యానాన్ని కలపాలని తీర్మానం చేసింది. 870కి.మీ దూరంలోని తమిళ పుదుచ్చేరి నుండి పాలన కష్టంగా ఉంది.పుదుచ్చేరికి యానాం ప్రజల ప్రయాణం ఆంధ్రలోని కాకినాడ నుండి జరుగుతుంది.దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని యానాంలో ఏర్పాటు చేయాలని యానాం కాంగ్రెస్ తీర్మానించింది.ఇండోర్ స్టేడియం,కళ్యాణమండపం,ధవళేశ్వరం-యానాం మంచినీటి ప్రాజెక్టులకు రాజశేఖరరెడ్డి పేరు పెడతామని పుదుచేరి రెవిన్యూ మంత్రి మల్లాడి కృష్ణారావు చెప్పారు. తెలుగుజాతి సమైఖ్యత,భాషాప్రయుక్తరాష్ట్ర ప్రధాన ఉద్దేశ్యం యానాం ఆంధ్రప్రదేశ్ లో కలిస్తే నెరవేరుతుంది.తెలుగుతల్లి బిడ్డలందరూ ఒకేరాష్ట్రంగా ఉంటారు.సమైక్యాంధ్ర కోసం ఇప్పుడు ఉద్యమాలు జరుగుతున్నాయి గనుక భౌగోళికంగా సామీప్యత, 100% తెలుగు ప్రజలున్న యానాం ను ఇప్పటికైనా తమిళ పుదుచ్చేరి నుండి విడదీసి సమైక్యాంధ్రలో కలపాలి.కలిస్తే బాగుంటుందని ఆశ.
katarnak cheppinav anna.
jai telangana.
nee laanti purugulanu champi akkda paateste daridram vadulutndi. naasanam cheyattani ke nee laanti aa kcr gaadi laanti purugulu puttedi. entamandi usuru posukoni meeru purugu padi chataaru maamulu gaa kaadu mee batukulu tagaleyya
thank you for your reply..
ippatikaina mammalni purugulla chustunnaranna mee buddhini bayata petiinanduku santosham. ika mammalni kottaga tagalesedem ledu.. mottaniki ekkado kalinattundi kada.. nijaalu alaage untayi... anyway thank u
chala bhaga replay ichharu asalu eenakodukulaku balupekkuva andite juttu lekunte kallu pattukune villaku a devude anni vidala buddi cheputunnadu ae papam akkuvarojulundadhu anduke devudu mana pakshana unnadu "okkokka addanki tisestunnadu"just like (ysr) telangana kosam kadantara
అజ్ఞాత rey addedava akkasu kakkukokapote telanganaku meeru chesina nyayam anto cheppandi tellodu cheppukunnatu mavallane meeku gyanam vachhini anaku endukante vorugallunu rajadaniga chesukoni mottam rasrtanni palinchina 1000 samvastarala cheritra telangididhi eka nuvvanna projects vatiki 1000 samvastarala kritame beejam padindi neekante munde (andhra) cheruvula roopamlo kadantava ...? rojulu marayy indiki meediki matladite samadanam ittane untundi
కామెంట్‌ను పోస్ట్ చేయండి