6, డిసెంబర్ 2009, ఆదివారం

ఎందుకు ఇంత ఉద్యమం? ఒక్కసారి ఆలోచించండి...

తెలంగాణ ఉద్యమం ఎందుకింత తీవ్రంగా మారింది. అణచి వేస్తున్న కొద్దీ అంతకంతకు పైపైకి ఎందుకు ఎగిసి పడుతోంది? ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలు ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించారా? ఒక్కసారిగా సానుకూల దృష్టితో ఆలోచించండి... తెలంగాణ ప్రాంత వాదులు, ఆంధ్రప్రాంత వాదులు అన్న భేషజాలను వదిలి పెట్టి ఆలోచించండి? భాషా ప్రయుక్త రాషా్టల్ర పేరుతో ఏర్పాటైన మిగతా రాషా్టల్ల్రో లేని ఈ అనైక్యత రాష్ట్రం ఏర్పాటైన తొలి నాటి నుంచే ఎందుకు కొనసాగుతోంది...? ఆరని రావణ కాష్టంలా ఎందుకు రగిలిపోతున్నది? 1969లో తొలిసారి తెలంగాణ ఉద్యమం వచ్చి ఉండవచ్చు... ఆ తరువాత రాజకీయాల కారణంగా అణిగిపోయి ఉండవచ్చు.. కానీ, తెలంగాణ ప్రత్యేక భావోద్వేగం ఇవాళ్టికీ తెలంగాణ ప్రాంతంలో ఉంది. ఆంధ్రప్రదేశ్‌ అంతా ఒక్కటే అన్న అభిప్రాయం అటు ఆంధ్రప్రాంత ప్రజల్లో కానీ, ఇటు తెలంగాణ ప్రజల్లో కానీ లేకపోవటం నిష్ఠుర సత్యం. ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడినప్పుటి నుంచే రెండు ప్రాంతాల మధ్య కనపడకుండా కొన్ని... కనపడి మరి కొన్ని విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. అన్ని ప్రాంతాల నాయకులు ఈ విభేదాలను తమతమ ప్రయోజనాలకోసం పణంగా పెట్టారు... అంతకు ముందు ఉన్న అంతరాలను తొలగించే ప్రయత్నం ఎంతమాత్రం చేయలేదు...

భాషా ప్రయుక్త రాషా్టల్రు ఏర్పాటైనప్పుడు తమిళం మాట్లాడే ప్రజల కోసం ఏర్పాటైన రాషా్టన్రికి తమిళనాడుగా పేరు పెట్టారు... కన్నడ భాష మాట్లాడే వారికోసం కర్ణాటక ఏర్పాటైంది. గుజరాతీ మాట్లాడే వారి కోసం గుజరాత్‌, మహారాష్ర్ట మరాఠీ వారికోసం, రాజస్థానీ కోసం రాజస్థాన్‌, ఒరిస్సా ఒరియా వారికి, అస్సామీ వారికి అస్సాం, బెంగాలీలకు బెంగాల్‌, పంజాబీలకు పంజాబ్‌ ఇలా ఆయా భాషల పేర్లపైనే ఎక్కువ రాషా్టల్రు ఏర్పడ్డాయి. మరి తెలుగు మాట్లాడే వారి కోసం తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పాటైన రాషా్టన్రికి ఆంధ్రప్రదేశ్‌ అని పేరు పెట్టారు... కేరళ వంటి రాషా్టల్రు భాష పేరు పైన లేదు కాబట్టి ఆంధ్రప్రదేశ్‌ అని పేరుంచటంలో తప్పేమిటని వాదించేవారి వాదనను తప్పుపట్టలేం.. వారి వాదన నూటికి నూరుపాళు్ల కరెక్టే... రాష్ట్రం మొత్తాన్ని ఒకే విధంగా ప్రాతినిథ్యం వహించే పేరు పెడితే ఎవరికీ ఎలాంటి అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు...కానీ, ఇక్కడ ఆంధ్రప్రదేశ్‌ అన్న పేరు ఒక ప్రాంతానికి మాత్రమే ప్రతినిధిత్వం వహిస్తున్నది తప్ప మొత్తం తెలుగువారికి ప్రతినిధిత్వం వహించటం లేదు. ఎందుకిలా జరిగింది? రాష్ట్రంలో తెలుగు వారినందరినీ ఒక ఛత్రం కిందకు తీసుకురావాలన్న బృహత్సంకల్పంతో అన్ని ప్రాంతాల నాయకులు రాషా్టన్న్రి ఏర్పాటు చేసినప్పుడు ఈ చిన్న విషయాన్ని ఎలా మర్చిపోయారు? మర్చిపోయారా? లేక కావాలని అలా చేసారా? కారణం ఏమిటి? దీనికి తోడు తెలంగాణ రాష్టస్రమితి ఆందోళన పథం ప్రారంభమైన గత ఎనిమిదేళ్ల నుంచి రాష్ట్రం పేరును ప్రస్తావించాల్సిన ప్రతి సందర్భంలో ఆంధ్రప్రదేశ్‌ అన్న మాటను పూర్తిగా వదిలేశారు... ఆంధ్రరాష్ట్రం అనటం ప్రారంభించారు..ఒక విధంగా అదే పేరును ఖాయం చేసే దిశగా ఈ ప్రస్తావనలు రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తుల నుంచే వచ్చాయి. ఒక పేరుతో ఇంత వివాదం దేనికని అనుకోవచ్చు. కానీ ఆ ఒక్క పేరే అందరినీ ఒకటి చేస్తుంది.. మమేకం చేస్తుంది. ఆ ఒక్క పేరులో మన అనే భావన వ్యక్తమైనప్పుడు మనమంతా ఒక్కటే అనే భావోద్వేగం అప్పుడే ఉత్పన్నమవుతుంది.. ఇది ప్రాథమిక దశనుంచే చేయాల్సిన పని. కానీ పాలకులు ఆ పని చేయలేకపోయారు.. ఎప్పటికెయ్యది ప్రస్తుతమన్నట్లుగా వ్యవహరిస్తూ వెళ్లిపోయారు.. ప్రాంతీయ తత్తా్వనికి అక్కడే బీజం పడిందని నా అభిప్రాయం.
వాస్తవానికి మన రాష్ర్టంలో ప్రత్యేక వాదం ఉత్పన్నమవటానికి కారణాలు అనేకం ఉన్నాయి. వాటిని సానుకూల దృక్పథంతో పరికిస్తే కొంత అర్థమయ్యే అవకాశం ఉంది.
సాంస్కృతికంగా తెలంగాణ ఆంధ్ర ప్రాంతాలు ఒకటిగా ఉన్న సందర్భాలు చాలా చాలా తక్కువ. తెలంగాణ ప్రాంతం నుంచి పరిపాలించిన కాకతీయుల కాలంలో తప్ప తెలుగువారంతా ఏకమై ఉన్న సందర్భాలు దాదాపు లేవనే చెప్పాలి... శ్రీకృష్ణ దేవరాయల కాలంలోనూ కొంత బహుమనీల పరిపాలనలో ఉండిపోయాయి. పల్లవులు, చాళుక్యులు ఇలా ఎవరు పాలించినా తెలుగువారందరినీ కాకతీయులు తప్ప ఏకం చేసి పాలించిన వారు లేరు.... ఆ తరువాత ఆసఫ్‌జాహీల హయాంలో కొంతకాలం తెలుగు ప్రాంతాలు ఒకటిగా ఉన్నప్పటికీ, బ్రిటిష్‌ వారికి ధారాదత్తం చేయటంతో అది కూడా ఒకటిగా ఉన్నట్లు కాదు.. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ రెంటి ఐడెంటిటీ అంటే అస్తిత్వం విస్పష్టంగా వేరు వేరు... వినటానికి ఇది కఠినంగా అనిపించినా ఇది వాస్తవం. దీన్ని ముందుగా గుర్తించాలి.
ఓరుగల్లు ప్రధాన కేంద్రంగా కాకతీయులు పరిపాలించిన కాలంలో తెలుగు మాట్లాడే వారంతా ఒకే రాజ్యం పరిధిలోకి వచ్చారు.. ఓరుగల్లు సహా తెలంగాణ ప్రాంతంనుంచి కింద తంజావూరు వరకు సాంస్కృతిక వైభవం ప్రవహిస్తూ వెళ్లింది..మనుమసిద్ధి ఆస్థానంలో భారతం ఆంధ్రీకరిస్తున్న తిక్కన తన రాజు కోసం గణపతి దేవుని వద్దకు ఓరుగల్లు వచ్చేనాటికే ఇక్కడ పాల్కురికి సోమనాధుడి జాను తెనుగు కావ్యం వెల్లి విరిసింది. ఉర్సుగుట్ట శాసనం రాసిన నృసింహ రుషి, వేయిస్తంభాల గుడి శాసనం రాసిన కవీ అంతా మహాకవులే...కూచిపూడి నాట్యం(17, 18 శతాబ్దం) పుట్టడానికి ఆరు వందల సంవత్సరాలకు పూర్వమే కాకతీయుల సేనాని జాయప నృత్తరత్నావళి పేరుతో నాట్యశాసా్తన్న్రి రచించాడు..ఆ నాట్యవైభవం ఈనాటికి రామప్ప దేవాలయం శిల్పాల్లో కనుల విందుగా చూడవచ్చు.. కూచిపూడి భరత నాట్యంలో ఒక భాగమేనని, కొంత డ్రమటిక్‌ ఎలిమెంట్‌ జోడించి దాన్నే కూచిపూడి అని పేరుపెట్టడం కరెక్టు కాదని గతంలో దాక్షిణాత్యుల మధ్య వివాదాలు కూడా రేగాయి. బమ్మెర పోతన గురించి తెలుగువారికి వివరించాల్సిన అవసరం లేదు..
జనజీవనం విషయంలోనూ రెండు ప్రాంతాల మధ్య హస్తిమశకాంతరం ఉంది... ఆంధ్రప్రాంతంలో మీరు అనబడే గౌరవ వాచకాలు ఎక్కువగా ఉంటాయి. సొంత ఇంట్లో కూడా ఈ గౌరవ మర్యాదలు అధికంగా ఉంటాయి. అది వారి పద్ధతి... పరస్పరం మర్యాదలు ఇచ్చిపుచ్చుకోవటం వారిలో సహజంగా వస్తున్న గొప్ప ఆనవాయితీ.. ఈ తరంలో కూడా తప్పకుండా అనుసరిస్తున్న పద్ధతి. వర్ణాశ్రమ ధర్మాలను ఎక్కువగా పాటించటం ఈ ప్రాంతంలో కనిపిస్తుంది. పైడితల్లి వంటి సామూహిక జాతరల్లో అంతాకలిసి పాలు పంచుకోవటం ఇక్కడ కనిపిస్తుంది. తెలంగాణ ప్రాంతంలో నువ్వు అన్నదే ఎక్కువగా వినిపిస్తుంది. మనుషుల మధ్య ఇంటిమసీని ఒకరకంగా పెంచటం కోసం ఈ రకమైన సంబోధనలు ఉండవచ్చు. అంతే కాదు.. కుటుంబాల్లోనే కాక, సమాజంలోని అన్ని వర్గాల ప్రజల మధ్య ఏవో రకమైన బంధుత్వ సంబోధనలు వినిపిస్తుంటాయి..పల్లెల్లో కులాలతో సంబంధం లేకుండా అందరూ అందరికీ ఏదో రకంగా బంధువులవుతారు...బతుకమ్మ వంటి సామూహిక పండుగల్లో కులాలు, మతాలతో సంబంధం లేకుండా అంతా కలిసి పాల్గొనటం, వాయినాలు ఇచ్చిపుచ్చుకోవటం ఇక్కడ బలంగా కనిపించే సంస్కృతి. రెండు ప్రాంతాల మధ్య ఈ వైవిధ్యాన్ని గుర్తించటం ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం.
ఇది దక్కను పీఠభూమి. ఎతె్తైన ప్రదేశంలో ఉన్నది. ఇక్కడ నదులు పుడతాయి. దిగువన ప్రవహిస్తాయి. ఈ నదులకు అడ్డుకట్ట వేయటం వల్ల అక్కడ వ్యవసాయం సుసంపన్నమైంది. వాస్తవానికి తెలంగాణ ప్రాంతంలో సహజసిద్ధంగా ఏర్పాటు చేసుకున్న చెరువులు, గొలుసుకట్టు చెరువుల వల్ల ఇక్కడ ఆహార ఉత్పత్తికి లోటు లేకుండా పోయింది. గోదావరి, కృష్ణలకు అడ్డుకట్టల డ్యాంలు కట్టేంత వరకు ఆ ప్రాంతం ఎండిపోయే ఉంది.
రసికుడు పోవడు పల్నాడు.. ఎసగంగా రంభయే యేకులు వడకన్‌... వసుధేశుడైన దున్నును.. కుసుమాత్రుండైన జొన్న కూడే కుడుచున్‌... అని శ్రీనాథుడి ప్రసిద్ధమైన చాటువే అక్కడి పరిస్థితికి దర్పణం... కృష్ణాగోదావరులపై డ్యాంలు కట్టడంతో ఆ ప్రాంతాలు సంపన్నమైనాయి. చెరువులను ఎండగొట్టడంతో ఇవి ఎడారులయ్యాయి.
ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ప్రజలు రావటం తప్పు కాదు.. అది రాజ్యాంగం భారత పౌరులందరికీ సమానంగా అందించిన హక్కు.. కానీ, అలా మనం మరో ప్రాంతానికి వెళ్లినప్పుడు అక్కడి వారితో కలిసిమెలిసి, వారితో మమేకం అయితే ఇబ్బందులు ఉండవు.. ఆధిపత్యం వహించాలని భావిస్తేనే సమస్య ఉత్పన్నమవుతుంది.. దురదృష్టవశాత్తూ ఈ యాభై ఏళ్లలో జరిగింది ఇదే.
కెసిఆర్‌ టిఆర్‌ఎస్‌ ప్రారంభించిన మరుక్షణం విశాఖపట్నంలో విపరీతంగా భూముల కొనుగోళు్ల జరిగాయి. ఇవన్నీ ఎవరు కొన్నారో తెలుసా? తెలుసుకోండి.. ఆలోచించండి... పాజిటివ్‌గా ఆలోచించండి.. ఉద్యమాలు ఊరికే రావు.. వాటి మూలాలు అన్వేషించటం అంత తేలికైన సంగతి కాదు...మూలాలు తెలిస్తే సమస్యను పరిష్కరించటం కష్టమేం కాదు.... అంతా కలిసి ఆలోచించండి... అయోమయంలో ఉన్న ప్రభుత్వానికి పరిష్కారాన్ని సూచించండి...

8 కామెంట్‌లు:

jeevani చెప్పారు...

అన్నయ్యా బావుంది మీ వాళ్ళు తెలంగాణ కావాలంటారు, అంధ్రా ఆధిపత్యం ఉందంటారు. మరి మా రాయలసీమ వాళ్ళేనా మధ్యలో వెర్రిబాగులవాళ్ళు :))
నాకు ఒక సందేహం... చిన్న రాష్ట్రాలు శాంతిభద్రతలను అదుపులో పెట్టుకోగలుగుతాయా? ఆర్థిక పరిస్థితికి ఢోకా లేదా? వనరుల సద్వినియోగం జరుగుతుందా? ఉద్యోగులు నాయకులకు తప్ప బీదా బిక్కికి ఎలాంటి ప్రయోజనం ఉంటుంది. ఒకవేళ తెలంగాణాలో హైదరాబాద్ మైనస్ అయితే ఏం చేస్తారు? ఉపాధి మార్గాలు ఎలా పెరుగుతాయి? తెలంగాణా ప్రజలు అంటే ఉద్యోగులు నాయకులే కాదు కదా? ప్రజలు అంటే పూర్తి స్థాయి పల్లె ప్రజల మనోగతం ఎలా ఉంది?
నేను వెటకారంగా అడగలేదు, తెలంగాణ లాగే వెనుకబడిన ప్రాంతం వాడిగా నాకు మీపై సహానుభూతి ఉంది. దయచేసి మీ మరియు తోటి బ్లాగర్ల నుంచి అభిప్రాయం కోరుతున్నాను. మీడియా వాళ్ళ వంకర రాతలు నేను నమ్మను.

shankar చెప్పారు...

మీ విశ్లేషణ చాలా బాగుంది. అయితే ఆంధ్ర ప్రదేశ్ అన్నది తెలుగు బాషకు ఉన్న సంస్కృతిక అర్ధం ఆంధ్రము అన్న పేరు నుండి వచ్చినదే కాని ఒక ప్రాంతం పేరుతొ వచ్చినది కాదని మనవి. ఇంకొక్క ముఖ్యమైన విషయం తెలుగు ప్రాంతం లో ఉన్న త్రిలింగాలలో తెలంగాణా కూడా ఒకటని మీరు మరచిపోరాదు. ఇక ప్రస్తుతం జరుగుతున్నా ఉద్యమం గురించి....భాషాభిమానం(అందరూ మాట్లాడేది తెలుగే కదా) , ప్రాంతీయాభిమానం ఉండచ్చు తప్పులేదు. కానీ దురభిమానం కూడదు. ఆంధ్ర అన్న పేరు వినబడితేనే రెచ్చిపోతున్న వైనం తెలంగాణలో సైతం చాలా మంది ప్రజలకు చికాకు తెప్పిస్తోంది అనడం లో సందేహం లేదు. దేశం లో ఎవరైనా ఎక్కడైనా ఉండచ్చు అన్న ప్రాధమిక హక్కు కు భంగం కలిగించే అధికారం ఏ ఒక్కడికీ లేదు. ఈ మధ్య వినిపిస్తున్న మరొక పదం "సెటిలర్స్'. ఇంకోదేశం నుంచి వలస వచ్చి ఇక్కడ తలదాచుకుంటున్న కాందిశీకులని ఆ మాట అంటే అర్ధం ఉందేమో కాని స్వంత రాష్ట్రం లో స్వంత భాష మాట్లాడే వారి మధ్య ఉన్నవారికి ఆ పదం ఎంత వరకు సమంజసం?

అజ్ఞాత చెప్పారు...

If people are not empowered to see why there is lack of development in Telanagana, then it is very easy for abusive forces like TRS etc to exploit the situationn for political ends. It can be raionally understood why the region is not developed.
Any political or social movements can be understood to a large extent just by looking at the people who lead it.
Gunuineness of the movement can be understood by the selflessness with which it will be embraced by the leaders who lead it. Now take a look at the leaders who are at the forefront of the telengana movement, KCR, TRS, MRPS, Naxalites, Moists. All these are radical and very ungovernable people/groups. They will throw in their towel wherever there is some trouble. Moists/Naxalites have no sense of ordered society, all they can understand is jungleraj.

Unfortunately, after NTR there is no leader in our state who can boldly say the truth...which is.... there is no rational basis for the division of the state. Everybody wanted to play with the peoples helplessness including the Congress party.

అజ్ఞాత చెప్పారు...

http://www.tadepally.com/2009/12/blog-post_05.html

తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం చెప్పారు...

http://www.tadepally.com

kovela santosh kumar చెప్పారు...

సోదరా నేనూ నీతో ఏకీభవిస్తున్నా....తెలంగాణ ఏర్పడుతుందా లేదా అన్న అంశం జోలికి నేను వెళ్లటం లేదు.. వెనుకబాటు తనం గురించీ నేను చర్చించటం లేదు.. నేను ఇక్కడ చెప్పదలచుకున్నది ఒక్కటే.. తెలంగాణ, ఆంధ్రప్రాంతాల ప్రజల మధ్య ఐక్యత అన్నది సాధించటం ఏనాటికైనా సాధ్యమా అన్నదే ప్రశ్న... వెనుకబాటు విషయంలో రాయల సీమకు, తెలంగాణకు ఎంతమాత్రం తేడా లేదు.. రెండు ప్రాంతాలకూ మాదంటూ అక్కున చేర్చుకుని ప్రాణాలిచ్చే నాయకత్వం లేమి ఈ ప్రాంతాలను నిర్వీర్యం చేస్తున్నది. తెలంగాణ వస్తే ఏమవుతుందన్నది తరువాత ఆలోచన... తెలంగాణ ఇప్పుడప్పుడే వస్తుందన్న భ్రమా నాకు లేదు.. కానీ ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల మధ్య తొలినాటి నుంచి ఉన్న సాంస్కతిక, రాజకీయ, సామాజిక వైరుధ్యాలు... ఏనాటికైనా సమైక్యంగా ఉంచలేవన్నది నా వ్యక్తిగత అభిప్రాయం అంతే... ఇక చిన్న రాషా్టల్రతో వనరుల సద్వినియోగం అవుతుందా లేదా, ప్రజలు బాగుపడతారా? ఉపాధి అవకాశాలు ఎలా ఉంటాయి? అన్న ప్రశ్నలకు ఒకటే జవాబు... దాదాపు పదహారేళు్లగా మనం ఈ దేశ రాజకీయ వ్యవస్థను చూస్తూనే ఉన్నాం...భౌగోళిక సరిహద్దులపైన అభివృద్ధి ఆధారపడి ఉండదు... మన దేశానికి సంబంధించినంత వరకు రాజకీయ వ్యవస్థ, పాలకవర్గం పనితీరుపైనే వనరుల వినియోగం కానీ, ఉపాధి మార్గాలు కానీ, అభివృద్ధి కానీ ఆధారపడి ఉంటుంది. ఈ విషయం నీకు తెలియందేమీ కాదు.. .రాష్ట్రం చిన్నదా, పెద్దదా అన్న మీమాంసకు తావే లేదు...పరిపాలన ఎలా ఉంటుందన్నదే ప్రధాన ప్రశ్న... రేపు తెలంగాణ ఏర్పడినా, పాలకులు వెధవలైతే అప్పుడూ నెత్తీనోరూ బాదుకోవలసిందే... ఒకడు భూస్వాముల తెలంగాణ అంటాడు.. మరొకడు దళితుల తెలంగాణ అంటాడు..

kovela santosh kumar చెప్పారు...

కేవలం రాజు సమర్థుడైతే రాజ్యం సుసంపన్నమవుతుంది. ఇదీ నా అభిప్రాయం.
ఇక శంకర్‌ గారి అభిప్రాయంతోనూ నేను ఏకీభవిస్తున్నా... వలస రావటం, సెటిలర్‌ అని పిలవటం చాలా దారుణం. భారత దేశంలో ఎవరైనా ఎక్కడికైనా వెళ్లే హక్కు ఉంది... నివసించే హక్కు ఉంది. వ్యాపారాదులు నిర్వహించుకునే హక్కూ ఉంది... ఇది రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు. ఆంధ్ర పేరు చెప్తేనే రెచ్చిపోవటం దురదృష్టమే... పాలక వర్గం దుర్మార్గపు పోకడలు.. బ్రిటిష్‌ కాలం నాటి విభజించి పాలించు అన్న సూత్రాన్ని ఇవాళ్టికీ పాలించే వైనం, ప్రజలందరి మధ్య ఐక్యత సాధించే ప్రయత్నం అంటూ చేయలేకపోవటం ఇలాంటి దూకుడుకు కారణం... పైగా ఆవేశంలో ఉన్నప్పుడు ఇలాంటి రెచ్చిపోవటాలు, ఆరోపణలు, నిందలు సహజంగానే వస్తుంటాయి. వీటిని నియంత్రించటం సాధ్యం కాదు.. అసలు ఉద్యమమే రాకుండా సమస్యకు పరిష్కారం చూపాల్సిన వారు చూపలేకపోయారు.. పోలీసులు తమాషా చూస్తూ ఉండిపోయారు.. ఇక సెటిలర్‌‌స అన్న పదం.. మీరన్నట్లు ఇది నిజంగా దుర్మార్గమైన మాట... కానీ దురదృష్టవశాత్తూ.. ఈ మాట ఆంధ్రా సెటిలర్‌‌స ఫోరం అన్న సంస్థను ఏర్పాటు చేయటంతో ప్రారంభమైంది. ఈ సంస్థ వాళు్ల ఆ పదాన్ని విస్తారంగా ప్రచారంలోకి తీసుకువచ్చారు.. లోక్‌సత్తా దాన్ని అందిపుచ్చుకుంది. రాజకీయంగా లబ్ది పొందింది... తెలంగాణ రాష్టస్రమితి మొదట్నుంచీ వాడుతున్న పదం వలసవాదులు అని.. దీన్ని కూడా నేను సమర్థించను.. ఎందుకంటే రాజ్యాంగం వారికి అందించిన హక్కు అది. కాకపోతే ఆధిపత్య ధోరణి... ఒక ప్రాంతాన్ని కించపరిచే మనస్తత్వం, ఒక ప్రాంత సాంస్కృతిక, చరిత్రలను ధ్వంసం చేసే ప్రయత్నాలే సరి కావని నా అభిప్రాయం.. ఈ పని నాడు మెకాలే చేశాడు... ఇప్పుడు మనమూ చేస్తే ఎలా?

Nrahamthulla చెప్పారు...

రైల్వేలో మన రాష్ట్రానికి ఎప్పుడూ అన్యాయమే జరుగుతోంది కాబట్టి,ఆంధ్రపదేశ్‌ని ప్రత్యేక దేశంగా ప్రకటించాలి లాంటి వితండవాదనలు ఏదో రకంగా మొండిగా సమైక్యవాదాన్ని సమర్దించటం కోసమే గానీ వాదనలో పస లేదు.జై ఆంధ్ర అంటాను జైతెలంగాణా అంటాను.విడిపోతే తప్పేంటి అనే వెంకయ్యనాయుడులాగా సమైక్యవాదులు ఎందుకు కలిసుండాలో కారణాలతో సహా స్పష్టంగా చెప్పాలి.మన పక్కనే ఉన్న యానాం ను రాష్ట్రంలో కలపాలని అడగకుండా సమైక్యవాదులు ఎందుకు విడిచిపెడుతున్నారో అర్ధం కావటం లేదు.ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడ దగ్గర 30చ.కి.మీ.విస్తీర్ణం ఉన్న కేంద్రపాలిత ప్రాంతం యానాం . దాదాపు 30వేల జనాభా.యానాం పర్యాటక ప్రాంతం. యానాం వార్తలు తూర్పుగోదావరి పేపర్లలోనే వస్తాయి.యానాంకు రాజధాని పాండిచ్చేరి సుదూరంగా తమిళనాడులో870కి.మీ దూరంలో ఉంది .యానాం 1954 దాకాభారత్ లో ఫ్రెంచ్ కాలనీగా ఉంది.నేడు పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతంలో భాగం.1954లో లో విమోచనం చెంది స్వతంత్రభారతావనిలో విలీనంచెందినా 1956 లో భాషా ప్రాతిపదికన తెలుగు రాష్ట్రంలో కలవలేదు.1948లో హైదరాబాద్ ను పోలీసు చర్యజరిపి ఇండియాలో కలిపారు.1949 లో అప్పటికి ఒక ఫ్రెంచి కాలనీ గా ఉన్న చంద్రనాగూర్, సమీపంలోని బెంగాల్ రాష్ట్రంలో విలీనం అయింది. కాకినాడ మునిసిపల్ కౌన్సిల్ కూడా యానాన్ని కలపాలని తీర్మానం చేసింది. 870కి.మీ దూరంలోని తమిళ పుదుచ్చేరి నుండి పాలన కష్టంగా ఉంది.పుదుచ్చేరికి యానాం ప్రజల ప్రయాణం ఆంధ్రలోని కాకినాడ నుండి జరుగుతుంది.దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని యానాంలో ఏర్పాటు చేయాలని యానాం కాంగ్రెస్ తీర్మానించింది.ఇండోర్ స్టేడియం,కళ్యాణమండపం,ధవళేశ్వరం-యానాం మంచినీటి ప్రాజెక్టులకు రాజశేఖరరెడ్డి పేరు పెడతామని పుదుచేరి రెవిన్యూ మంత్రి మల్లాడి కృష్ణారావు చెప్పారు. తెలుగుజాతి సమైఖ్యత,భాషాప్రయుక్తరాష్ట్ర ప్రధాన ఉద్దేశ్యం యానాం ఆంధ్రప్రదేశ్ లో కలిస్తే నెరవేరుతుంది.తెలుగుతల్లి బిడ్డలందరూ ఒకేరాష్ట్రంగా ఉంటారు.సమైక్యాంధ్ర కోసం ఇప్పుడు ఉద్యమాలు జరుగుతున్నాయి గనుక భౌగోళికంగా సామీప్యత, 100% తెలుగు ప్రజలున్న యానాం ను ఇప్పటికైనా తమిళ పుదుచ్చేరి నుండి విడదీసి సమైక్యాంధ్రలో కలపాలి.కలిస్తే బాగుంటుందని ఆశ.యానాంను తెలుగు ప్రాంత పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెయ్యాలి.