19, డిసెంబర్ 2009, శనివారం

ఇదేమిటి?...ఇగ్నోర్‌ చేయవద్దు.. జవాబు ఇవ్వండి

డిసెంబర్‌ 9, 2009
ప్రత్యేక తెలంగాణ కోసం ఉద్యమం తీవ్రమైంది...
హింసాత్మకంగా మారే సూచనలు కనిపించాయి...
కేంద్రం ఒక్కసారిగా కళు్ల తెరిచింది...
డిసెంబర్‌ 9, 2009 రాత్రి 11.30 గంటలు
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ప్రకటిస్తూ
కేంద్ర హోం మంత్రి చిదంబరం ప్రకటన
డిసెంబర్‌ 10, 2009
సీమాంధ్రల్లో సమైక్య ఉద్యమాలు..
డిసెంబర్‌ 11, 2009
జీవో నెంబర్‌ 1845 విడుదల..

ఇదేమిటని ఆశ్చర్యపోకండి... రాష్ట్ర ప్రభుత్వ గ్రామీణాభివృద్ధి శాఖ ఈ నెల పదకొండో తేదీనాడు జారీ చేసిన ఒకానొక ఉత్తర్వు..........
ఓ పక్క తెలంగాణ, సమైక్యాంధ్ర ఉద్యమాలు ఉవ్వెత్తున సాగుతుంటే... వాటి వార్తల జోలికి పోకుండా... ఇప్పుడీ జీవోల గోలేమిటని ప్రశ్నించకండి... అదే విచిత్రం... ఈ ఉద్యమాలకూ ఈ జీవోలకు లింకు ఉంది.. ఉద్యమాలు తలెత్తడానికి మూలమే ఈ ఉత్తర్వుల్లో దాగి ఉంది...

ఓ పక్క ప్రాంతాల మధ్య విభేదాలు పెచ్చరిల్లి.. రాజకీయ వ్యవస్థ నిట్టనిలువునా చీలిపోయింది. ఈ సమస్యను పరిష్కరించటం ఎలాగో తెలియక సతమతమవుతున్న నేపథ్యంలో సర్కారు నుంచే వివాదాస్పద జీవో విడుదల కావటం విచిత్రం. అందులో నిధుల కేటాయింపు విషయంలో మూడు ప్రాంతాల మధ్య సమన్వయం, సమానత్వం, పారదర్శకత పాటించలేదు.. ఎందుకిలా జరిగింది?
డిసెంబర్‌ పదకొండున రాష్ట్ర పంచాయితీ రాజ్‌ శాఖ జీవో నెంబర్‌ 1845 విడుదల చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి పనుల గురించి నాబార్‌‌డ సంస్థ రాష్ట్ర ప్రభుత్వానికి 130 కోట్ల 26 లక్షల రూపాయలు మంజూరు చేసింది. ఈ నిధులను రాష్ట్ర ప్రభుత్వం వివిధ జిల్లాల్లో 109 రోడ్లు, తొమ్మిది వంతెన నిర్మాణానికి కేటాయింపులు జరిపింది. ఇక్కడే అసలు తిరకాసు మొదలైంది. సర్కారు జరిపిన కేటాయింపుల్లో తెలంగాణ ప్రాంతంలోని నాలుగు జిల్లాలకు పది కోట్లు... మిగతా ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాలకు 120 కోట్లు కేటాయించింది. తెలంగాణలోని ఆరు జిల్లాలు ప్రభుత్వానికి మ్యాపులో ఆ సమయంలో కనిపించనే లేదు..
జీవోలోని వివరాలు పరికిస్తే ఏమీ చెప్పకుండానే మనకు అర్థం అవుతుంది.
రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో గ్రామీణాభివృద్ధి పనుల కోసం నాబార్‌‌డ మంజూరు చేసిన నిధులు 130 కోట్ల 46 లక్షల 14వేల రూపాయలు మంజూరు చేసింది.
జిల్లాల వారిగా చూస్తే,
కోస్తాంధ్రలో ....
తూర్పు గోదావరి జిల్లా = 12.92 కోట్లు
పశ్చిమగోదావరి జిల్లా = 12.14 కోట్లు
గుంటూరు = 8.80 కోట్లు
కృష్ణా = 6.57 కోట్లు
నెల్లూరు =5.23 కోట్లు
ప్రకాశం = 16.19 కోట్లు
మొత్తం = 61.85 కోట్లు
ఉత్తరాంధ్రలో ...
శ్రీకాకుళం = 16.66 కోట్లు
విశాఖపట్నం = 2.88కోట్లు
విజయనగరం =22.27కోట్లు
మొత్తం = 41.87
రాయలసీమలో...
అనంతపురం = 1.85 కోట్లు
చిత్తూరు = 7.40 కోట్లు
కర్నూలు = 5.32 కోట్లు
కడప = 1.00కోట్లు
మొత్తం = 15.57కోట్లు
తెలంగాణలో...
మెదక్‌ =5.40 కోట్లు
మహబూబ్‌నగర్‌ = 1.05కోట్లు
నల్గొండ = 1.22కోట్లు
ఆదిలాబాద్‌ = 1.64కోట్లు
మొత్తం = 9.31 కోట్లు

తెలంగాణ లోని మిగతా ఆరు జిల్లాలు.. కరీంనగర్‌, వరంగల్‌, నిజామాబాద్‌, ఖమ్మం, రంగారెడ్డి, హైదరాబాద్‌ జిల్లాలకు ఒక్క రూక కూడా విదిల్చలేదు.. హైదరాబాద్‌ రాజధాని కాబట్టి దాన్ని మినహాయించారనుకుందాం.. మరి మిగతా అయిదు జిల్లాల మాటేమిటి? కేటాయించిన నాలుగు జిల్లాలకైనా ఏ దామాషా ప్రకారం, ఏ ప్రాధాన్యం ప్రకారం కేటాయింపులు జరిపారు?

నాబార్‌‌డ మూడు రకాల పనుల కోసం నిధులు ఇచ్చింది. ఈ నిధులను అన్ని జిల్లాల్లో పనుల ప్రాధాన్యం ఆధారంగా కేటాయించాల్సిన సర్కారు దానికి తిలోదకాలు ఇచ్చింది...ఒక జిల్లాకు అధికంగా కేటాయింపులు జరిపిందంటే అక్కడ పనుల అవసరం అధికంగా ఉన్నట్లు భావించాలి.. సాధారణంగా ఏ ప్రభుత్వమైనా చేసే పని అదే... ప్రధానంగా గ్రామీణాభివృద్ధి విషయంలో ప్రజల అవసరాలు చాలా ఎక్కువగా ఉంటాయి. పైగా మన దేశంలో, ముఖ్యంగా మన రాష్ట్రంలో పల్లెల్లో అభివృద్ధి అంతంత మాత్రమేనని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. మరి అలాంటప్పుడు నాబార్‌‌డ నిధులను పంపిస్తే.. వాటిని ఏ విధంగా కేటాయించాలి? ఆయా జిల్లాల అవసరాల్ని బట్టి దామాషా ప్రకారం అన్నింటికీ సమన్యాయం చేయాల్సిన బాధ్యత లేదంటారా? తెలంగాణపై చిన్నచూపు చూస్తే చూసిరి.. కనీసం రెండు నెలల క్రితం వరదలతో అల్లల్లాడిపోయిన జిల్లాలు కర్నూలు, మహబూబ్‌నగర్‌లనైనా ప్రాధాన్య క్రమంలో ముందుంచాల్సిన బాధ్యత సర్కారుకు లేదా? ఈ జిల్లాలను వరదలు ముంచెత్తి గ్రామాలకు గ్రామాలే కొట్టుకుపోయాయి. కానీ, ఆ జిల్లాలో రహదారులు బాగు చేయటం అత్యంత ప్రాధాన్యమైంది. కానీ, కర్నూలుకు కేటాయించింది అయిదు కోట్లు... మహబూబ్‌నగర్‌కు ముష్టి కోటి రూపాయలు.. అదే గోదావరి జిల్లాలు ఒక్కో జిల్లాకు పన్నెండు కోట్ల రూపాయల చొప్పున కేటాయించారు.. ఇక మంత్రి గారి జిల్లా విజయనగరానికి ఏకంగా 22 కోట్లు కేటాయించుకున్నారు.. సరే ఏ మంత్రయినా తన నియోజక వర్గానికి తన జిల్లాకు అధిక ప్రాధాన్యం ఇవ్వటం ఇటీవలి కాలంలో సహజం... సాక్షాత్తూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి కూడా చేసింది ఇదే.. మరి మిగతా జిల్లాల విషయంలో ఈ వివక్ష దేనికి ప్రాధాన్య క్రమంలో మినహాయింపులు ఇచ్చారంటే అర్థం ఉంది. కానీ, ఆ మినహాయింపు, ఆ కేటాయింపుల లేమి తెలంగాణ జిల్లాలకు మాత్రమేనా? అవేం పాపం చేసుకున్నాయి...సమైక్యవాదులకు హైదరాబాద్‌ మినహా మిగతా జిల్లాలు కళ్లకు కనిపించనట్లే... సర్కారుకు కూడా కనిపించలేదా? రాష్ట్రంలో మొత్తం 23 జిల్లాలు ఉంటే సీమాంధ్ర ప్రాంతంలో ఉన్న మొత్తం పదమూడు జిల్లాలకు ఎన్నో కొన్ని నిధుల కేటాయింపులు జరిగాయి. ఏ జిల్లానూ ఇక్కడ మినహాయించలేదు. ప్రతి జిల్లాకు కొద్దోగొప్పో నిధులను కేటాయించారు..మరి తెలంగాణలోని ఆరు జిల్లాలు ఏం పాపం చేశాయి? ఈ ఆరు తెలంగాణ జిల్లాలకు నిధులు కేటాయించకూడదని అనుకున్నారా? లేక ఈ ఆరు తెలంగాణ జిల్లాల్లో రహదారులు వంతెనలు కళకళలాడుతున్నాయా? అన్ని జిల్లాలూ సరైన రవాణా మార్గాలు కలిగి అత్యున్నతమైన అభివృద్ధి పథంలో నడుస్తున్నాయని సర్కారు నిర్ధారణకు వచ్చిందా? అభివృద్ధి ఫలాలు అందరికీ సమాన స్థాయిలో అందాలన్నదే సమైక్యాంధ్రప్రదేశ్‌ లక్ష్యమంటే అర్థం ఇదేనా?
మరో విశేషం ఈ జీవోలో ఉంది. కడప, విశాఖపట్నం, అనంతపురం జిల్లాలు మినహా మిగతా అన్ని జిల్లాలకు 5కోట్ల రూపాయలకు పైగానే నిధులు కేటాయించారు.. తెలంగాణ ప్రాంతానికి వచ్చేసరికి ఆ నాలుగు జిల్లాలకు విదిలించింది కూడా అక్షరాలా తొమ్మిది కోట్ల 31 లక్షల 72వేల రూపాయలతో సరిపుచ్చారు.. నిధుల కేటాయింపులో తెలంగాణ ప్రాంతంలోని నాలుగు జిల్లాలకు కేటాయించిన మొత్తం ఒక్క గుంటూరుకు కేటాయించిన మొత్తంతో దాదాపు సమానం..
అంటే ఆంధ్ర ప్రాంతంలో ఒక్క జిల్లా పాటి చేయవా తెలంగాణలోని అన్ని జిల్లాలు? వీళు్ల పేర్కొంటున్న సమైక్యతకు అర్థం ఏమిటన్నది ఈ ఒక్క జీవో చెప్తోంది. నీటి వాటాల్లో మాకు అన్యాయం జరిగింది.. ఉద్యోగాల్లో మాకు అన్యాయం జరిగింది.. అభివృద్ధి నిధుల పంపకంలో మాకు అన్యాయం జరిగిందంటూ తెలంగాణ ఉద్యమకారులు నెత్తీనోరూ బాదుకుంటుంటే.. అవన్నీ పచ్చి అబద్ధాలంటూ కొట్టిపారేశారు.. నాలుకలు చీరేస్తామన్నారు.. అన్యాయమే జరగలేదు పొమ్మన్నారు.. మరి ఈ జీవో ఏమిటి? దీని అర్థం ఏమిటి? వివక్షా? సమైక్యమా? సమదృష్టా? పారదర్శకతా? ఏమంటారు? నిఘంటువులు వెతికి చెప్పండి. తెలంగాణ వాదులు ఈ జీవోను ఎలా అర్థం చేసుకోవాలో అంతా కలిసి ఉందామని చెప్తున్న మహానుభావులారా, అజ్ఞాతంలో ఉన్న మహా మేధావులారా, సవివరంగా వివరించండి.. మా కళు్ల తెరిపించండి.. పెద్ద రాష్ట్రంగా ఉంటే, సమైక్యంగా ఉంటే, అన్ని ప్రాంతాలు ఏకంగా ఉంటేనే అభివృద్ధి సాధ్యమని అంటున్నారు కదా.... నేను ఆవేశంగా అడగటం లేదు.. వినమ్రంగానే అడుగుతున్నా..నాకు భేషజాలు లేవు.. అడ్డంగా నిందించటం కాదు... జవాబు ఇవ్వకుండా తప్పించుకోవటం కాదు.. నిర్భయంగా జవాబు చెప్పండి... ఎలాగూ పేర్లు చెప్పరు.. అజ్ఞాతంలోనే ఉండి చెప్తారు.. పేరు చెప్పే సాహసాన్ని మీరు చేయలేరు.. అది మీ వల్ల కాదు.. అది ఎందుకో నాకు తెలియదు కానీ, 55 సంవత్సరాల తెలంగాణ ఉద్యమానికి మూలం ఇదిగో మీ ముందున్న ఇలాంటి జీవోలే.. తెలంగాణ ప్రాంతంపై వివక్షకు నిలువెత్తు సంతకం ఈ జీవో... ఇది తప్పు కాదు.. అబద్ధం అంతకంటే కాదు.. తెలంగాణ వాదులు.. బ్లాగుల రచయితలు సృష్టించింది కాదు.. ప్రభుత్వంలో ఉన్నత ఉద్యోగిగా, అంటే ప్రిన్సిపల్‌ కార్యదర్శిగా ఉన్న శ్రీ ఎంవిపిసి శాస్త్రి గారి స్వహస్తాలతో సంతకం చేసిన ప్రభుత్వ ఉత్తర్వుల సారాంశం ఇది.. శ్రీ బొత్ససత్యనారాయణ అమాత్యవర్యులు నిర్వహిస్తున్న మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఉత్తర్వులు ఇవి.. శ్రీ శాస్త్రి గారు గోదావరి జిల్లా వాసి అనో, శ్రీ బొత్స సత్యనారాయణ గారు విజయనగరం జిల్లా వాసి అనో నేను నిందించటం లేదు.. ఉన్నతాధికారులు, సీనియర్‌ నాయకులు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల వారి పట్ల ఐక్యభావంతో ఉన్నవారు విడుదల చేసిన ఈ ఉత్తర్వులను ఐక్యతను కోరుకుంటున్న ఆంధ్రప్రాంత ప్రజలు కానీ, విభజనను కోరుకుంటున్న తెలంగాణ వాసులు కానీ ఏమని అర్థం చేసుకోవాలి? ఇంకా సమైక్యత కోరుకుంటున్న వారు ఈ జీవో చూసిన తరువాత తమ ఉద్యమాన్ని ఏ విధంగా సమర్థించుకుంటారు? లగడపాటి వారు.. టివీ ప్రకటనల్లో తెలంగాణాకు ముందే గోడ కట్టిన వారి వందిమాగధ బృందం ఇప్పుడేమంటుంది? మీ ఐక్యభావనలో (అది నిజంగా ఉంటే) నిజాయితీ ఉంటే విస్పష్టమైన జవాబు ఇవ్వండి.. సహేతుకంగా మీ నిర్ణయాన్ని చెప్పండి... ఉద్యమాన్ని కొనసాగించేందుకు మీకున్న నైతిక హక్కు ఏమిటన్నది వివరించండి...

33 కామెంట్‌లు:

శరత్ కాలమ్ చెప్పారు...

ఆ. అయితే ఏంటంట? విడిపోవాలా? అన్యాయాన్ని ఎదిరిద్దాం - సమైక్యాంధ్రను కాదు!

అజ్ఞాత చెప్పారు...

ఈ సిగ్గు శరం లేనోల్లను ఎంతదిట్టినా లాభం లేదన్నా. నాలుగు రోజులాగు ఒక్కొక్కన్ని హైదరాబాద్ లో ఉరికిచ్చే కొట్టే టైం దగ్గరవడ్డది.

Dr.Pen చెప్పారు...

మీ ప్రశ్నలు సహేతుకం. మీ ఆవేదన అర్థరహితం. నేను కూడా ఇవే ప్రశ్నలే సంధించాలను కొన్నాను. కానీ మీ బ్లాగు చూశాక నా బ్లాగులో ఇదే ప్రశ్నని మన బ్లాగు పెద్దల ముందు ఉంచాను. ఈ అన్యాయానికి ఏం సమాధానం చెబుతారో?మీరు ఉంటున్నది అనంతపురంలోనేనా?

karthik చెప్పారు...

మీరు చెప్పేది నిజమే ఐతే, చాలా ఆందోళన చెందాల్సిన అంశం.. కలిసి ఉండాలంటే నిష్పక్షపాతం,పారదర్శకత చాలా అవసరం.. ఈ విషయంలో తెలంగాణ ప్రజలకు నేను సహానుభూతి తెలుపుతున్నాను. ఇలాంటివాటి వల్లె రాష్ట్రం ఇప్పుడు రావణ కష్ఠం లా రగులుతోంది. మరి తెలంగాణ మంత్రులు వారి శాఖలలో కేటాయింపులలో ఇలానే చెయ్యచ్చు కదా?? తెలంగాణ మంత్రులు మంచివారు అని మాత్రం చెప్పకండి. తెలుగువారందరూ కలిసి ఉండలనుకునే వారిలో నేను ముందు వరుసలో ఉంటాను. ఒక వేళ విడిపోవటమే అవసరమైతే దానికి పరస్పర విద్వేషాలు పునాది కాకూడదు. Let the state be divided for administrative purposes and better governance not by hating your own brothers.. ఇప్పుడు ప్రజల మధ్య ఏర్పడ్డ ఈ మానసిక దూరం తగ్గడానికి ఎన్ని ఏళ్ళు పడుతుందో?? :( :(

ఏ జిల్లా మంత్రులు ఆ జిల్లాలకు ఇచ్చుకోవడం ఎందుకు సమంజసం? వారేమన్నా జిల్లా మంత్రులా?

సమతలం చెప్పారు...

12 గంటలు దాటిన కామెంట్ రాలేదు.
వస్తది, ఇంతకుముందు విడతలో తెలంగాణ ఎక్కువ ఇచ్చామని అంటూ ఏదో బుకాయిస్తరు. అసలు జి.ఒ.లు, ఈ పరిపాలణ విధానాలే అస్తసతవ్యస్తంగా ఉంటాయి. మేము 18 ఏంద్లనుండి ప్రభుత్వ ఉద్యోగం ఎల్గపెడుతున్నాము. చాల అస్తవ్యస్తంగా ఉంటుంది ప్రతి కార్యక్రమం. ఇంతకుముందు అర్ధం కాకపోయేది. ఇప్పుడిప్పుడు అర్ధమౌతున్నది. ఎందుకు అస్తవ్యస్తంగా ఉంటాయంటె ఈ విధంగా ఇష్టారాజ్యంగా ఏలుకోవడానికి.
ఏ లెక్క దొరకనివ్వకుండ, దబాయిస్తరు.

నాగప్రసాద్ చెప్పారు...

సచిన్ టెండూల్కర్ సెంచరీ కొట్టగానే, సంబరాలు చేసుకుంటాం. పేపర్లో ఏ రెంజ్‌లో ఫోటో వేసి పొగుడుతారో అందిరికీ తెలిసిందే. అట్లాగే ఒకటి, రెండు మ్యాచుల్లో డకౌట్ అవ్వగానే ప్రతి ఒక్కరూ ఎంత దారుణంగా తిడతారో కూడా తెలిసిందే. కానీ, అతను గొప్ప బ్యాట్స్‌మన్ అన్నది, అవునో,కాదో ఎలా నిర్ణయిస్తారు?. ఒకటి, రెండు మ్యాచులు చూశా లేదా వరుసగా యాభై, వంద మ్యాచులు చూసి వాటి సగటు తీశాకనా?.

అలాగే, మీరు కూడా కేవలం ఒక జీవోతో వివక్షను ఎలా నిర్ణయిస్తారు?. గత పది, పదిహేను సంవత్సరాలుగా అది కూడా అన్ని రంగాలలో కలిపి తెలంగాణాకూ, సీమాంధ్రకు విడుదలైన నిధులను పరిగణలోకి తీసుకొని నిర్ణయించాల్సిన అంశమిది. అలా చేసినా కూడా ఏదో ఒక ప్రాంతానికి తక్కిన ప్రాంతాలతో పోల్చినప్పుడు కాసిన్ని తక్కువ నిధులే వచ్చి ఉంటాయి. వంద రూపాయలను మూడు ప్రాంతాలకు పంచాలంటే, 34+33+33 లాగా చెయ్యాల్సిందే కదా. ఇప్పుడు 33 రూపాయలు వచ్చిన వాళ్ళు, మాకు ఒక రూపాయి తక్కువ వచ్చిందంటే, మనమేం చెబుతాం?


ఇవన్నీ ఎందుకులే గానీ, మీరు చెప్పిన లాజిక్‌ని, ఇంకాస్త పెద్ద స్థాయిలో చూద్దాం.

తమిళనాడు, బీహార్‌లతో పోలిస్తే, రైల్వే బడ్జెట్‌లో మన రాష్ట్రానికి ఎప్పుడూ అన్యాయమే జరుగుతోంది. ఇది ఎవ్వరూ కాదనలేని నిజం కూడా. కాబట్టి, వెంటనే ఆంధ్రపదేశ్‌ని ప్రత్యేక దేశంగా ప్రకటించాలి.

ఇంకా, ఆంధ్రప్రదేశ్‌కు రావల్సిన పరిశ్రమలెన్నింటినో, దయానిది మారన్‌ లాంటి వాళ్ళ వల్ల పక్క రాష్ట్రానికి తరలిపోతున్నాయి కదా? అలా అని చెప్పి మన రాష్ట్రాన్ని ప్రత్యేక దేశం చెద్దామా?


రహదారుల పరంగా చూసుకున్నా, గత పది సంవత్సరాలుగా తమిళనాడుతో పోలిస్తే, మనకు అన్యాయం జరుగుతూనే ఉంది. మరి ఈ కారణం చూపి విడిపోదామా మనం దేశం నుంచి.

అంతెందుకూ, ప్రస్తుతం నేను చదువుకుంటున్న కాలేజీ అంటే ఐ.ఐ.టి, తమిళనాడుకు వచ్చి 50 సంవత్సరాలు అయ్యింది. మనకు మొన్న మొన్నటి (2007)వరకూ రాలేదు కదా. మరి ఇన్ని సంవత్సరాలుగా వివక్ష చూపారు కాబట్టి, విడిపోదామా మనం దేశం నుంచి?.

శ్రీధర్ రాజు - చికాగో చెప్పారు...

సంతోష్ గారు,
చాలా మంచి సమాచారాన్ని ఋజువులతో సహా పొందుపరిచారు.

ఇక ఓ పదో పన్నెండో అజ్ఞాతలు మరియు సమైఖ్యవాదులు వచ్చి ఇప్పుడు ఓ నాలుగు ఈసడింపులు, ఒకరో ఇద్దరో కుళ్ళుతో నిండిన వెధవ పరాచకాలు, రాసేస్తారు. అన్యాయాలకి వ్యతిరేకంగా ఐఖ్యతగా పొరాడలని నీతిసూక్తులు వళ్ళేస్తారు. ఇలాంటివి ఇంకా కొన్ని ఉచిత సలహాలు పారేస్తారు. అంతేకాని ఏ ఒక్కడు ఈ నిజాన్ని ఒప్పుకోడు సరికదా నువ్వే ఈ తప్పులన్ని సృష్టించి ఓ కథ రాసేసావని మీపై విషం కక్కుతారు. సాక్షాలేమైనా ఉన్నాయా ఉంటే చూపించమంటారు - చూపిస్తే అవి నిజమైనవో కాదో ౠజువుకోసం న్యాయస్థానం నుండి దృవపత్రం తెచ్చి చూపమంటారు. ఇంకా ప్రవాస తెలంగాణ వాళ్ళు మీకు డబ్బులిచ్చి ఇలాంటివి రాయిస్తున్నారంటారు. ఇలాగే గత 54 ఏళ్ళనుండి ద్రోహంచేస్తూ మహాపాపం కూడగట్టుకుంటున్నారు. మరి ఆ పాపం పండితే ఏం జరుగుతుందో ఊహించుకోడానికి ఈ వలస కుట్రదారులకు ఒక నిమిషం పాటైనా సద్బుద్దినివ్వాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నాను.

ఇక మీరు మాత్రం నిర్భయంగా ఈ నిజాలు వెలికితీసే పరంపర నిరాఠంకంగా కొనసాగించాలని నా విజ్ఞ్యప్తి.

ఇట్లు,
శ్రీధర్ రాజు - చికాగో

నిజం చెప్పారు...

ఈ పాలన మారదు,తెలంగాణా వచేవరకు......ఇంత గొడవ జరుతున్నప్పుడు కూడ వాళ్ళ బుద్ది పోనిచుకోలేదు....we need తెలంగాణా అంతే ......

ashok చెప్పారు...

పెట్టుబడి దారుల చేతుల్లో కీలు బొమ్మలు ఈ ఆంధ్ర నాయకులు ఉద్యమాలు చేస్తున్నారు. ఎంతో కాలం ఈ కుటిల ఉద్యమం సాగదు. ఎన్ని రోజులు కిరాయి చేల్లిస్తారో అన్ని రోజులు ఉద్యమం బాగానే సాగుతుంది. ఇప్పుడే లుకలుకలు అరంబం అయ్యాయి రేపోమాపో ఖచ్చితంగా తెలంగాణా వస్తుంది.
శరతు నాగ ప్రసాదు లకు చెప్పేది ఏమిటంటే ఎవ్వరిని తెలంగాణా విడిచి వెళ్ళమని అనడం లేదు మీరు భయపడి సమైక్యాంధ్ర అనాల్సిన అవసరం లేదు చిరంజీవి లాగ . నిజాలు మాట్లాడండి

అజ్ఞాత చెప్పారు...

>>>ఈ సిగ్గు శరం లేనోల్లను ఎంతదిట్టినా లాభం లేదన్నా. నాలుగు రోజులాగు ఒక్కొక్కన్ని హైదరాబాద్ లో ఉరికిచ్చే కొట్టే టైం దగ్గరవడ్డది.


మొత్తానికి మనసులో ఏముందో బయటపెట్టారు.

అజ్ఞాత చెప్పారు...

వెంటనే తెలంగాణా, ఆంధ్ర జట్లమధ్య 20-20 పోటీ నిర్వహించాలి. దీని ద్వారా మాత్రమే ఫలితం సాఫీగా, ఆమోదయోగ్యంగా ఉంటుంది. తెలబాన్లకు కేసీఆర్ ఆంధ్రవాల్లకు లగడపాటి నాయకత్వం వహించాలి.

Suresh చెప్పారు...

@నాగప్రసాద్ గారు,
మీ వ్యాఖలు 100 కి 100% నిజం.

@శ్రీధర్ రాజు గారు,
నిజాలు చెబితే అలానే ఉంటాయి సార్.తెలంగాణా నుంచి ముఖ్యమంత్రులుగా చేసినవారు, ప్రధాన మంత్రిగా చేసిన వారూ ఉన్నారు. అంతెందుకు ప్రస్తుతం ఉన్న మంత్రివర్గం లో పెద్ద పెద్ద పదవులన్నీ తెలంగాణా వాళ్ళకే కదా? హోం, నీటి పారుదల, ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయ్. కాదంటార.ఇలాంటి జీ.వో లలో వారి ప్రమేయం ఉండదంటారా??? కే.సి.ఆర్ కేంద్ర మంత్రి గా ఉన్నారు కదా?? మరి అతను ఆంద్రప్రదేశ్ కు ఏమి చేసారు??? కనీసం తెలంగాణా కు ఏమి చేసారు???? తెలంగాణా వెనుకబాటుతనానికి అక్కడున్న సో కాల్డ్ లీడర్సే కారణం సార్.. ఆంద్ర, రాయలసీమ వాళ్ళు కాదు. తెలంగాణా కావాలంటే కాలాలని కాకుండా ఒక్కసారి ఆలోచించండీ సార్...
"నేను ఏదైనా తప్పుగా వ్రాసి ఉంటే క్షమించగలరు.కానీ నేను చెప్పినది నిజం"

Suresh చెప్పారు...

శ్రీధర్ రాజు గారు,
నిజాలు చెబితే అలానే ఉంటాయి సార్.తెలంగాణా నుంచి ముఖ్యమంత్రులుగా చేసినవారు, ప్రధాన మంత్రిగా చేసిన వారూ ఉన్నారు. అంతెందుకు ప్రస్తుతం ఉన్న మంత్రివర్గం లో పెద్ద పెద్ద పదవులన్నీ తెలంగాణా వాళ్ళకే కదా? హోం, నీటి పారుదల, ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయ్. కాదంటార.ఇలాంటి జీ.వో లలో వారి ప్రమేయం ఉండదంటారా??? కే.సి.ఆర్ కేంద్ర మంత్రి గా ఉన్నారు కదా?? మరి అతను ఆంద్రప్రదేశ్ కు ఏమిచేసారు??? కనీసం తెలంగాణా కు ఏమి చేసారు???? తెలంగాణా వెనుకబాటుతనానికి అక్కడున్న సో కాల్డ్ లీడర్సే కారణం సార్.. ఆంద్ర, రాయలసీమ వాళ్ళు కాదు. తెలంగాణా కావాలంటే కాలాలని కాకుండా ఒక్కసారి ఆలోచించండీ సార్...
"నేను ఏదైనా తప్పుగా వ్రాసి ఉంటే క్షమించగలరు.కానీ నేను చెప్పినది నిజం"

అజ్ఞాత చెప్పారు...

ఈ వ్యాఖ్య శరత్ కాలం గారికి మాత్రమే. శరత్ కాలం గారికి ఒక ప్రశ్న.
మీకు మీ తమ్ముళ్ళ కి మీ నాన్న గారు సమానంగా తీసుకోండి రా అని లక్ష రూపాయలు ఇచ్చి అవి పంచటానికి బాద్యతలు మీకు ఇచ్చారనుకోండి. అందులో నుంచి పెద్ద తమ్ముడి కి రెండు వేలు, చిన్న తమ్ముడికి వేయి రూపాయలు ఇచ్చి మిగతావన్నీ మీరు నొక్కేస్తే మీ తమ్ముళ్ళు ఏం చేస్తారు. చెప్పులు, చీపుర్లు ఏవి కనబడితే వాటితో మిమ్మల్ని కొట్టి మీకు ఆ బాధ్యతలు అప్పగించి నందుకు మీ నాన్నని కూడా వ్యతిరేకిస్తారు. తమ వాటా తమకు కావాలంటారు.ఇప్పుడు తెలంగాణా ప్రజలు చేస్తున్న పని కూడా అదే. "బ్రదర్ తరం మారుతుంది. ఆంధ్ర ప్రదేశ్ లో తెలంగాణా కూడా త్వరలో తెలంగాణా రాష్ట్రం గా మారబోతోంది."

శరత్ కాలమ్ చెప్పారు...

@అజ్ఞాత
20 - 20 మీరూ మీరూ ఆడుకోండి. అంపైరింగ్ మాత్రం నాకివ్వండి ;)

అజ్ఞాత చెప్పారు...

If Government is issuing GOs of this kind, what Telangana leaders are doing? Can't they ask/fight for their fair share? Who is stopping them? Are they doing their duty? Are they really working for the development of their region or are they working for their own development?

శ్రీనివాస్ చెప్పారు...

ఒక్క జి.వో పట్టుకుని అదే వివక్ష అని మీరెలా డిసైడ్ చేసారో నాకు అర్ధం కావడం లేదు. అయినా అన్ని విధాలుగా మంత్రులు తరలించుకు పోతుంటే తెలంగాణా మంత్రులు పాలు తాగుతున్నారా? ఈ విభజన పరమైన ఆవేశం అభివృద్ధి పరమైన అంశాల మీద చూపిస్తే తెలంగాణా. ఎప్పుడో అభివృద్ధి చెందేది . మరొక విషయం అరవై తొమ్మిది లో ఉద్యమాన్ని మొత్తం గా కొనేసిన కాంగ్రెస్ ని మళ్ళా ఆ తరువాత ఎన్నికలలో మంచి మెజారిటీ తోనే గెలిపించారు ప్రజలు. అలాగే మహాకూటమికి వోటేస్తే మన రాష్ట్రం లోనే విదేశీయులం అయిపోతాం అని రాజశేఖర్ రెడ్డి అన్న తర్వాత కూడా తెలంగాణా ప్రజల్లో పెద్దగా వ్యతిరేకత రాలేదు. పైగా మొన్న గ్రేటర్ ఎన్నికలలో కాంగ్రెస్ విజయం సాధించింది కూడా.

ఇంకొక విషయం ఈ కేటాయింపులు అన్నీ ప్రజలకు పెట్టడానికేనా.... అలా పెడితే మేము ఎప్పుడో బాగుపడేవాళ్ళం. వీరు అవసరాలు చూపించుకోగలిగారు. ఎక్కువ నిధులు తెచ్చుకుని మెక్కారు. తెలంగాణా మంత్రులు వేరే మేక్కుడు లో బిసీ గా ఉండి. ఇందులో అంతగా వేలు పెట్టలేక పొయ్యారు. ఏమండీ ప్రకాశం = 16.19 కోట్లు, ఇదేమన్నా నమ్మబుల్ గా ఉందా ఇది జాబితా వరకే పరిమితం, మా జిల్లాలో కూడా ఫ్లోరైడ్ గ్రామాలు ఉన్నాయి. వెనకబాటు తనం ఉంది. తెలంగాణా నాయకులకు మింగడానికి పెద్దగా అవకాశం రాలేదు అని మీరు బాధ పడుతున్నట్లుగా ఉంది. చూడబోతే. పైగా ఆయనెవరో సొంత జిల్లాకి ఎక్కువ కేటాయించుకుంటే దానిని ప్రస్తుత విభజన పరిస్తితికి ఆపాదించడం . నాకెందుకో నచ్చలేదు.

Nrahamthulla చెప్పారు...

రైల్వేలో మన రాష్ట్రానికి ఎప్పుడూ అన్యాయమే జరుగుతోంది కాబట్టి,ఆంధ్రపదేశ్‌ని ప్రత్యేక దేశంగా ప్రకటించాలి లాంటి వితండవాదనలు ఏదో రకంగా మొండిగా సమైక్యవాదాన్ని సమర్దించటం కోసమే గానీ వాదనలో పస లేదు.జై ఆంధ్ర అంటాను జైతెలంగాణా అంటాను.విడిపోతే తప్పేంటి అనే వెంకయ్యనాయుడులాగా సమైక్యవాదులు ఎందుకు కలిసుండాలో కారణాలతో సహా స్పష్టంగా చెప్పాలి.మన పక్కనే ఉన్న యానాం ను రాష్ట్రంలో కలపాలని అడగకుండా సమైక్యవాదులు ఎందుకు విడిచిపెడుతున్నారో అర్ధం కావటం లేదు.ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడ దగ్గర 30చ.కి.మీ.విస్తీర్ణం ఉన్న కేంద్రపాలిత ప్రాంతం యానాం . దాదాపు 30వేల జనాభా.యానాం పర్యాటక ప్రాంతం. యానాం వార్తలు తూర్పుగోదావరి పేపర్లలోనే వస్తాయి.యానాంకు రాజధాని పాండిచ్చేరి సుదూరంగా తమిళనాడులో870కి.మీ దూరంలో ఉంది .యానాం 1954 దాకాభారత్ లో ఫ్రెంచ్ కాలనీగా ఉంది.నేడు పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతంలో భాగం.1954లో లో విమోచనం చెంది స్వతంత్రభారతావనిలో విలీనంచెందినా 1956 లో భాషా ప్రాతిపదికన తెలుగు రాష్ట్రంలో కలవలేదు.1948లో హైదరాబాద్ ను పోలీసు చర్యజరిపి ఇండియాలో కలిపారు.1949 లో అప్పటికి ఒక ఫ్రెంచి కాలనీ గా ఉన్న చంద్రనాగూర్, సమీపంలోని బెంగాల్ రాష్ట్రంలో విలీనం అయింది. కాకినాడ మునిసిపల్ కౌన్సిల్ కూడా యానాన్ని కలపాలని తీర్మానం చేసింది. 870కి.మీ దూరంలోని తమిళ పుదుచ్చేరి నుండి పాలన కష్టంగా ఉంది.పుదుచ్చేరికి యానాం ప్రజల ప్రయాణం ఆంధ్రలోని కాకినాడ నుండి జరుగుతుంది.దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని యానాంలో ఏర్పాటు చేయాలని యానాం కాంగ్రెస్ తీర్మానించింది.ఇండోర్ స్టేడియం,కళ్యాణమండపం,ధవళేశ్వరం-యానాం మంచినీటి ప్రాజెక్టులకు రాజశేఖరరెడ్డి పేరు పెడతామని పుదుచేరి రెవిన్యూ మంత్రి మల్లాడి కృష్ణారావు చెప్పారు. తెలుగుజాతి సమైఖ్యత,భాషాప్రయుక్తరాష్ట్ర ప్రధాన ఉద్దేశ్యం యానాం ఆంధ్రప్రదేశ్ లో కలిస్తే నెరవేరుతుంది.తెలుగుతల్లి బిడ్డలందరూ ఒకేరాష్ట్రంగా ఉంటారు.సమైక్యాంధ్ర కోసం ఇప్పుడు ఉద్యమాలు జరుగుతున్నాయి గనుక భౌగోళికంగా సామీప్యత, 100% తెలుగు ప్రజలున్న యానాం ను ఇప్పటికైనా తమిళ పుదుచ్చేరి నుండి విడదీసి సమైక్యాంధ్రలో కలపాలి.కలిస్తే బాగుంటుందని ఆశ.యానాంను తెలుగు ప్రాంత పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెయ్యాలి.

Shashank చెప్పారు...

తెలంగాణా "నాయాకులని" తరిమి తరిమి కొట్టండి. ప్రతి MLA కి MP కి development fund ఇస్తారు. ఆంధ్ర దేశం లో ప్రతి constituency చూద్దాం. యే ప్రతినిధి ఏం చేసాడో చూద్దాం.. govt జీ వో ని తప్పుబట్టడం కరెక్టే కాని అరవైయేళ్ళల్లో తెలంగాణా కి తెలంగాణా నాయాకులు ఏం చేసారో చూద్దాం ముందు. తెలంగాణా కే కాదు.. సీమ లో కూడా నాయాకులు ఇలానే తగలెడ్డారు. మీ ఆగ్రహం ప్రజల మీద కాదు నాయాకుల మీద చూపించాలి. ____ కొడుకులు స్వార్థానికి తప్ప దేనికి పనికి రారు. హైదరాబాదు ఆంధ్ర రాష్ట్రానిది.. అక్కడ నివసించే హక్కు, పని చేసే అధికారం, స్థాలం కొనుక్కొని బ్రతికే అధికారం అందరికీ ఉంది.. ప్రజల సొమ్ముని ధ్వంసం చేయడం ఎంటి? "తరిమి తరిమి కొడతాం" అని అనడం ఏంటి? అలనే మిగితా దేశం మొత్తం తెలంగాణా వాళ్ళని తిప్పి పంపితే వాళ్ళ్ ఆస్తులు ధ్వంసం చేసి?

అజ్ఞాత చెప్పారు...

నర్హమతుల్ల గరు

నాగప్రాసద్ తొ నెను ఏకిబవిస్తున్నను ఎందుకంటె మన అంధ్ర ప్రదేశ్ కి రైల్వె లొ నిధులు రాకపొవడనికి మన 42 మంది ఎంపిల అసమర్ధతె కారణం ఎలాగో మీరు చెసే వాదనకు కూడా మీ ప్రాంత నాయకుల అసమర్ధతె కారణం మీరు ఒప్పుకున్నా లెకున్నా

అజ్ఞాత చెప్పారు...

నర్హమతుల్ల గరు

నాగప్రాసద్ తొ నెను ఏకిబవిస్తున్నను ఎందుకంటె మన అంధ్ర ప్రదేశ్ కి రైల్వె లొ నిధులు రాకపొవడనికి మన 42 మంది ఎంపిల అసమర్ధతె కారణం ఎలాగో మీరు చెసే వాదనకు కూడా మీ ప్రాంత నాయకుల అసమర్ధతె కారణం మీరు ఒప్పుకున్నా లెకున్నా

అజ్ఞాత చెప్పారు...

http://www.eenadu.net/breakhtml.asp?qry=break23

kovela santosh kumar చెప్పారు...

media lo gaggolu puttina taruvata, trs secretariate lo gola chesaka cm spandinchina taruvaata minister garu ee prakatana chesaru... kosa merupu emitante go pai vaarta rastunnaranna vaartanu media mitrule minister gariki uppandinchi diddubatu charyalu chepattamani suchincharu.. daaniki nene pratyaksha sakshini... sarkaru ilanti charyalu chepattatadam sahajam.

అజ్ఞాత చెప్పారు...

అజ్ఞాత చెప్పారు...
మూర్ఖత్వం మితి మీరితే ఇలాగే ఉంటుంది.
కాశ్మీరీ తీవ్రవాదులు( ప్రజలు కాదు) కోరుకొంటున్నది ప్రత్యేక దేశం. వాళ్ళకి ప్రత్యేక రాష్ట్రం ఇదివరకే ఉన్నది.
తెలంగాణ ప్రజలు కోరుకొంటున్నది భారత సార్వభౌమత్వానికి లోబడి ఉండే ఒక ప్రత్యేక రాష్ట్రం మాత్రమే.
వీరిని తీవ్రవాదులతో పోల్చడం దారుణం. ఆ లెక్కన మద్రాసు నుండి వేరుపడేందుకు ఉద్యమం చేసిన సీమాంధ్ర ప్రజలు కూడా తీవ్రవాదులే ! పొట్టి శ్రీరాములు అతి పెద్ద తీవ్రవాది అని ఒప్పుకొంటారా ? ఏ కారణాల చేత ఆనాడు ఆంధ్ర రాష్ట్రం మద్రాసు నుండి వేరు కావాలని కోరుకొందో, ఆ కారణాలే తెలంగాణ ఉద్యమానికి ప్రాణం పోసాయి... అన్న విషయం కనీస ఇంగిత జ్ఞానం ఉన్న వాడెవడికైనా అర్థం అవుతుంది. వందలాది సంవత్సరాలు తమిళులతో, 53 సంవత్సరాలు తెలంగాణ ప్రజలతో కలిసి ఉన్నా, సీమాంధ్ర ప్రజలు భావ సమైక్యతను సాధించలేక పోయారు. దానికి కారణం... ఇదిగో మీరిప్పుడు చూపుతున్నారే ! ఈ అహంకారమే !
తెలిసో, తెలియకో మీరు కశ్మీరుతో తెలంగాణను పోల్చడం సబబైనదే ! భారత దేశం స్వాతంత్ర్యం పొందినప్పుడు, రెండు దేశాలు ( కాశ్మీర్, నైజాం ) విలీనం కాలేదు. ఆ తరువాత ప్రత్యేక స్వాతంత్ర పోరాటాల ద్వారా ఈ రెండు దేశాలు భారత దేశంలో విలీనమయ్యాయి. అప్పుడు కశ్మీర్ ప్రజలతో చేసుకొన్న ఒప్పందాలను ఆర్టికల్ 371 ద్వారా ఇప్పటికీ భారత దేశం పరిరక్షిస్తుంది. కాని తెలంగాణకు ముల్కీ రూల్సును కాపాడుతామని ఇచ్చిన హామీని భారత ప్రభుత్వం, సీమాంధ్ర ప్రజలు అన్యాయంగా చేసిన ( జై ఆంధ్ర )ఉద్యమ కుయుక్తి వలన, రాజ్యాంగ సవరణ ద్వారా మంట గలిపింది.
కశ్మీరుకు రాష్ట్ర ప్రభుత్వంలో స్వీయ పాలన ఉంది. తెలంగాణలో వారి చరిత్ర, సంస్కృతి తెలియని వలస దోపిడి పాలన ఉంది. లేటెస్టుగా నిన్న బయటపడిన విషయం ... నాబార్డు నిధులు 130 కోట్లలో సీమాంధ్రకు 120 కోట్లు, 10 జిల్లాల తెలంగాణకు కేవలం 9.33 కోట్లు కేటాయించారట. ఇంకెన్నాళ్ళీ దోపిడి ?
చరిత్రలో మాకు స్వాతంత్ర్యం కావాలని జరిగిన పోరాటాలెన్నో ఉన్నాయి. కాని ఎదుటి వాడికి స్వాతంత్ర్యం ఇవ్వవద్దని ఉద్యమం చేయడం కేవలం సీమాంధ్ర ప్రజలకే చెల్లింది. ఆనాటి " జై ఆంధ్ర " , ఈనాటి " సమైక్యాంధ్ర " ఉద్యమాలు స్వార్థంతో కూడిన అన్యాయపు ఉద్యమాలు.
మేమంతా ఇంత అధ్యయనం చేసి, ఇంత కంఠశోషతో వివరించినా, ఏ అధ్యయనం చేయకుండా, కేవలం స్వార్థం నిండిన బుర్రలతో ఆలోచించే మీకు ఎక్కదు. పైగా ఇలా పిచ్చిపిచ్చిగా మాట్లాడుతారు. కేంద్ర ప్రభుత్వం కరుణించినా ఇంకా మీలాంటి వాళ్ళు అడ్డు పడుతుంటే ... ఇంకా మేమేం చేయగలం ? Frstrated people ఆత్మహత్య చేసుకొంటున్నారు. నాలాంటివాళ్ళు కడుపు మండి, గుండె మండి శత్రువులను " నాశనమైపోండి " అని శపిస్తున్నారు.

శ్రీధర్ రాజు - చికాగో చెప్పారు...

సంతోష్ గారు,

నేను చెప్పినట్టు... ఓ పదో పన్నెండో ఏం ఖర్మ, ఏకంగా పదహారు అజ్ఞాతలు మరియు సమైఖ్యవాదులు వచ్చారు, ఈసడింపులు, కుళ్ళుతో నిండిన వెధవ పరాచకాలు, రాసేసారు. అన్యాయాలకి వ్యతిరేకంగా ఐఖ్యతగా పొరాడలని నీతిసూక్తులు వళ్ళించారు ఇంకా కొన్ని ఉచిత సలహాలు కూడ పారేసారు. పైగా జ్ఞానామృతం తాగేసిన ఒకరైతే నిఖ్ఖచ్చిగ వెటకారపు వెక్కిరింతలు నిజాలని బుకాయించేశాడు. ఇప్పటి అప్రజాస్వామ్య వలసపాలకుల మధ్య దబాయింపుతో ముఖ్యమంత్రయినా ప్రధానమత్రయినా కుళ్ళు కంపు రాజకీయాలతో పోరాడేసరికే శక్తి హరించుకుపోతోందని మరి ఆ (అ)జ్ఞాన సముద్రంలో కనపడుతుందో లేదో గాని తెలంగాణ నాయకులే మూర్ఖులనేసాడు - అంటే మీ నాయకులు సరిగా పోరాడటం కాని వారిలాగే దొచుకోవడం కాని నేర్చుకునే వరకు మేమిలాగే ద్రోహం చేస్తూనేఉంటామని అర్థం. వీళ్ళంతా కలిసి స్వయంపాలన మరియు పరాయిపాలన అంటే ఏంటో మనకు కొత్త అర్థాలు నూరిపోసారు. సరికదా మరొకడు ఈ ఒక్క జీవో సరిపోదనేశాడు - ఇంకా కుతిగా వేరే సాక్షాలేమైనా ఉన్నాయా ఉంటే చూపించమన్నాడు. మరో మహా సమైఖ్యవాది - దేశమంతటి రైల్వే అసమానతతో పోల్చేశాడు ఈ జివోని - ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి ఓర్చుకొవాలని వాడి నీతి సూక్తి. మరి ఆ పోల్చడంలో మన అనేసి తెలంగాణను కూడా ఆంధ్రా ప్రాంతంతో కలిపేసుకున్నాడు. లేకపోతే కేంద్ర నిధులు రావు. అలా తెలంగాణ వెనుకబాటుతనంతో కలిపేసి చూపించగా వచ్చిన ఆ కొద్ది రైల్వే నిధులన్ని దోచుకెళ్ళే వీలుపడదు. ఉదాహరణకు పెద్దపల్లి - కరీంనగర్ లైను నిధులను ణ్టృ మళ్ళించి నట్టుగా.

అంతేకాని ఏ ఒక్కడు నిజాన్ని ఒప్పుకోలేదు.

ఓ స్పష్టమైన విషయం బోధపడిందేంటంటే - ఇక్కడ వ్యాఖ్యానించేవారికి ఒక్క హైదరాబాదు మీదే కుత్తుకతో నిండిన ఆశ - మిగతా తెలంగాణా ఎమైపోయిన పరవాలేదు. ప్రత్యేక వాదులు హైదరాబాదు వీళ్ళకిచ్చేయడానికి ఒప్పుకుంటే - క్షణంలో ప్రేమలొలకబోవడం ప్రారంభమౌవుతుంది.

ఇంకో నీచాతి నీచమైన జ్ఞానుడు తప్పులన్ని చేసేస్తాం అయితే ఏంటంట అనేసాడు. మీపై విషం కక్కుతూనే ఉంటాం... అది మా జన్మ హక్కు అనడనికి తేడా ఏమిలేదు. నెహ్రూ కుటుంబ నియంతృత్వ పోకడతో కాంగ్రెస్ పార్టీలో పివి నరసిం హారావు గారికి జరిగిన అవమానాలెన్నో వీళ్ళ బుర్రలెకెక్కవు. ఇప్పటివరకు ఒక్కడంటే ఒక్క తెలంగాణ నాయకుడు కూడా పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి పదవి చేపట్టలేదు.. కాదు చెపట్టకుండా చేసారు ఈ వలసొచ్చిన కుళ్ళుబోతు రాజకీయ నాయక గూండాలు. ఇన్నేళ్ళ బలవంతపు కాపురంలో మొత్తంగా పట్టుమని 7 ఏళ్ళు కూడా ఇక్కడి వాళ్ళు ముఖ్యమంత్రులుగా ఉంటే ఓర్చుకోలేక పోయారు. ఇలాగే గత 54 ఏళ్ళనుండి ద్రోహంచేస్తూ మహాపాపం కూడగట్టుకుంటున్నారు. మరి ఆ పాపం పండితే ఏం జరుగుతుందో ఊహించుకోడానికి ఈ వలస కుట్రదారులకు ఒక నిమిషం పాటైనా సద్బుద్దినివ్వాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నాను.

మళ్ళీ చెబుతున్నాను మీరు మాత్రం చాలా మంచి సమాచారాన్ని ఋజువులతో సహా పొందుపరిచారు. ఇకమీదట కూడా నిర్భయంగా ఈ నిజాలు వెలికితీసే పరంపర నిరాఠంకంగా కొనసాగించాలని నా విజ్ఞ్యప్తి.

ఇట్లు,
శ్రీధర్ రాజు - చికాగో

అజ్ఞాత చెప్పారు...

Have you seen G.O no 1843 which you selectively ignored...

satya చెప్పారు...

ఈ G.O లో ఉన్న విషయాలు నిజమే. కాని ప్రభుత్వ నిధుల కేటాయింపు చాలా అంశాలపై ఆధారపదుతుంది. గతం లో వివిధ శాఖల కింద ఇచ్చిన నిధులని బేరీజు వేసుకొని ప్రస్తుత కేటాయింపులు జరుపుతారు.. లేకుంటే భవిష్యతు లో ఇవ్వబోయే వాటి అనుగుణంగా కూడా వుండచ్చు.. మీ వాదన నిజమైతే అసలు మన ప్రభుత్వం లో ఆంధ్ర ప్రాంత నాయకులకన్నా రాయలసీమ వారి పలుకుబడే ఎక్కువ. మరి వారికెలా తక్కువ కేటాయింపు జరిగిందో వివరించాలి. పై వాక్యం తప్పైతే ఆంధ్ర ప్రాంతం నుండి కాంగ్రెస్ ప్రభుత్వం లో ఉన్న రాష్ట్ర స్థాయి నేతలెవరో చెప్పాలి. సరే.. ఇక్కడే నాదొక సహేతుకమైన ప్రశ్న.

JNTU తొలుత తెలంగాణా లో ఏర్పాటు చేశారు.
central university కూడా తెలంగాణా ప్రాంతం లోనిదే
REC/NIT కూడా తెలంగాణా ప్రాంతం లోనిదే
ISB లాంటి అంతర్జాతీయ బిజినెస్ స్కూల్ కూడా తెలంగాణా ప్రాంతం లోనిదే
IIIT లాంటి విద్యా సంస్థల్ని కూడా తెలంగాణా ప్రాంతం లోనే తొలుత ఏర్పాటు చేసారు
మరి IIT ఇచ్చేప్పుడు మాకు చాలు ఇది ఆంధ్ర ప్రాంతం లో ఏర్పడితే మంచిది అని అనుకున్నారా? మనస్పూర్తి గా సమాధానం చెప్పండి.ఏదో కేవలం 100 కోట్ల వ్యవహారం లో గుండెలు బాదుకుంటే, ఇలాంటి విద్యా సంస్థలు పెట్టటానికి వేలకోట్లు అవసరమవుతాయి. మరి ఇది ఏ రకమైన వివక్షో వివరించాలి.

పరిశ్రమలు, IT ఇన్వెస్టిమెంట్లు కేవలం హైదరాబాద్ లోనే ఎందుకు ఏర్పాటు చేసారు? మీ KCR చిలకపలుకులతో చెప్పే సమాధానం ఇది ట్రాపికల్ వెదర్ ట.. ఇక్కడ భూకంపాలు రావుట.. అంతేకాని ఇది ఆంధ్ర పాలకుల ఘనత కాదుట. ఇలంటి పిట్ట కధలు విని నిజమే అనుకుంటారు చదువుకున్న వాళ్ళు కూడా... KCR మాటలే నిజమైతే chennai మనకన్నా ఎలా ముందు వున్నదో చెప్పాలి? జపాన్ లాంటి దేశాల్లో అయితే అసలు ఒక పరిశ్రమ కూడా ఉండకూడదు. కంపెనీలు పెట్టేవారికి కావల్సింది resources మరియు ప్రభుత్వాల తోడ్పాటు. ఇక్కడ human resources ఎక్కువగ ఉండటం, ఇంకా 'అంధ్రా వలస పాలకుల హయాం లో ఇచ్చిన తోడ్పాటే.. అందుకే kolkata మనకన్నా మానవ వనరుల్లో ముందంజ లో ఉన్నా పెట్టుబడి దారులు ఇక్కడే మొగ్గు చూపారు.

అసలు తెలంగాణా లో వెనుకుబాటుతనం గురించి తెలంగాణా ప్రజలు ఒక్కసారైనా తెలంగాణా నాయకుల మీద ఉద్యమం నడిపారా? మనల్ని ఆంధ్ర పాలకులు దోచుకుంటున్నారని వాళ్ళు కాకమ్మ కబుర్లు చెప్పటం అది నిజమే అనుకొని నమ్మేయటం..

శ్రీధర్ రాజు గారికి అయితే సమైక్య వాదులు వ్యాఖ్య కూడా రాయకూడదు అన్నట్లుంది. ఇంతటి ద్వేషభావం ఎందుకండి మీకు? హైదరాబాద్ మీద ఆశ అని వ్రాశారు.. మరి హైదరాబాద్ కాకుండా మిగతా తెలంగాణా ఇస్తే అంగీకరిస్తారా? యే? హైదరాబాద్ లేకపోతే మిగిలిన తెలంగాణ ని అభివృద్ధి చేసుకొవాలన్న చిత్తశుద్ధి మీకు లేదా? పైగా తెలంగాణ సమస్యలు పరిష్కరించటానికి హైదరాబాద్ ఉండనవసరం కూడా లేదు. ఇక్కడ ఒక్క నది కూడా లేదు కాబట్టి అతి ముఖ్యమైన గగ్గోలు పెట్టే జలవనరుల సమస్య పరిష్కరించుకోవచ్చు. ఉద్యోగాల విషయం లో ఇబ్బంది ఎటూ లేదు.. ఇప్పుడు అసలు ప్రభుత్వ ఉద్యోగాలే లేవు కాబట్టి. అసలు KCR లాంటి వాళ్ళు గొంతు చించుకునే 610 GO ఎప్పుడో అమలయింది. http://go610.ap.gov.in/ ఈ లంకె లో ప్రతి విభాగానికి సంబంధించిన local, non-local వివరాలు పూర్తిగా ఉన్నై. పరిశీలించి ఇంక అయినా ఈ విషయం లో నిందలు మానుకోవాలని మనవి.

satya చెప్పారు...

>> continution

ఇంక ఒక ప్రాంతం నించి ముఖ్యమంత్రి ఉంటేనే అది ఆత్మగౌరవం అని లేకపోతే వలస పాలన అనే అర్ధం లేని భావనలను విడనాడండి. రాయలసీమ నించి ఎన్నికైన చంద్రబాబు ఆ ప్రాంతానికి ఏం చేసారో చెప్పగలరా? ఒక్క సాగునీటి ప్రాజక్ట్ చేపట్టాడా? ఇంకా తెలంగాణా లోనే దుమ్ముగూడెం,నెట్టెంపాడు ప్రాజక్ట్లకు పనులు ప్రారంభించాడు. మరి ఎవరి వివక్ష ఎవరి మీద? ఒక్కడంటే ఒక్క తెలంగాణ నాయకుడు పూర్తి స్థాయి ముఖ్యమంత్రి పదవి చేపట్టలేదన్నరే? ఈ లింక్ చూడండి ఒకసారి,.http://en.wikipedia.org/wiki/List_of_Chief_Ministers_of_Andhra_Pradesh ఇందులో జలగం వెంగళ్రావ్ గారి పరిపాలనా కాలం చూసి మాట్లాడండి. అంతేకాదు. ఆయన పాలన తర్వాత ఏ కాంగ్రెస్ ముఖ్యమంత్రి 5 సం! పరిపాలించాడో చెప్పండి. మీరు కాంగ్రెస్ పార్టీ మీద కక్కవలసిన విషాన్ని తోటి తెలుగు వారి మీద చూపిస్తున్నారే? ఇంక తెలుగుదేశం పార్టీ కూడా వివక్ష అంటారా ఏంటి కొంపదీసి? అంటే తెలుగుదేశం గెలిస్తే రామారావు, ఆ తర్వాత చంద్రబాబు కాకుండా ముఖ్యమంత్రి పదవి తెలంగాణ వారికి ఇస్తారనుకొని ఆ పార్టీ కి ఓటు వెసిన అమాయకులున్నారేమొ అని నా అనుమానం. మీకు ఇంకో విషయం చెప్తాను. ముఖ్యమంత్రి పదవి తర్వాత అత్యంత కీలకమైన హోం-శాఖ ఎక్కువ సార్లు తెలంగాణా వారికే దక్కింది. అప్పటి ఇంద్రా రెడ్డి నించి, నిన్న మొన్నటి మాధవ రెడ్డి, దేవెందర్ గౌడ్, జానా రెడ్డి, చేవెళ్ళ 'చెల్లెమ్మ ' వరకు. కీలకమైన భారీ నీటి పారుదల శాఖలు కూడా తెలంగాణా వారైన కడియం శ్రీహరి, పొన్నాల వంటి వారే చేపట్టారు.
ముఖ్యమంత్రి అయితేనే ఆత్మ గౌరవం అయితే ఒక ముస్లిం కూడా ఆ పదవి చెపట్టలేదు.. వాళ్ళకి ప్రత్యేక రాష్ట్రం ఇద్దామా? శ్రీకాకుళం, ప్రకాశం, ఉభయ గోదావరి, విజయనగరం, ఇంకా ఎన్నో జిల్లాలని ప్రత్యేక రాష్ట్రలు చేయాలి మరి. రేపు వారి ఆత్మగౌరవాన్ని కూడా కాపాడాలి కద.

ఈ రోజు సాక్షి లో జయప్రకాష్ నారాయణ్ గారి ఇంటర్వ్యూ చదవండి.. వాస్తవాలు మీకే తెలుస్తాయి.

అజ్ఞాత చెప్పారు...

Hello Mr. Satya,
Yes - majority of these start-ups you listed in Hyderabad surroundings did benefit only non-telangana settlers. Do you know 99.5% staff and students of IIIT are non-telangana people? There is a case pending in high-court regarding recruitment discrimination at ISB. JNTU and Central University has students from all over the country and local quota is mostly filled by non-telangana telugu people thru recommendations and bribes.... not through talent. We are lucky enough to have REC in Warangal or else you would have dominated it completely by now. By the way, its not exempted - 37% of students in REC are non-telangana.

JVR (Jalagam Vengal Rao) is not from Telangana - he is an immigrant from Andhra. He went against PVNR revolutionary land reform initiatives and abolished Regional Development Committees.

All in all - not a single Chief Minister from Telangana completed their tenure. Overall it is a conspiracy and silent genocide.


GO610 - and Mulki Agreement never implemented. The site has falsified the info just for the sake of completing.

Whatever Sridhar Raju mentioned above is absolutely righteous thought on your mental situation and your oppressive attitude.

>>> "610 GO ఎప్పుడో అమలయింది" - prove it.

Bangalore is far better compared to Hyderabad. Telangana people don't care if the IT industry disappears over-night.... which is quite possible.

You have grown up to a level of saying Hyderabad is ours - means... it is a clear evident of your wrong intent of tyrannical encroaching attitude. Enough is enough... now get out.

satya చెప్పారు...

What a pity? Your separatist moments are more worse than Kashmiri jihadis. How can you say that 99.5% students are non-telangana , then I can ask you simply…. prove it? You are in a dire state that your eyes got completely blinded with separatism.
>>> local quota is mostly filled by non-telangana telugu people thru recommendations and bribes.... not through talent.
These are worst possible cheap allegations. There would be no more getting down. For local/non-local quota central university recruits based on ranking mechanism. Can you with all means of bribe or recommendation accomdate an MCA seat in central versity? It’s a challenge. Don’t act foolishly.
If they have the capacity to do so, why can’t they establish the university in their area itself?
Though I shouldn’t say, if your students are not so talented..why to cry over others?
If you say JVR is not from telangana.. where is from KCR? He went against mulki rules because it is as per supreme court order. How can you prevent an Indian to purchase land anywhere he wants?
>> GO610 - and Mulki Agreement never implemented. The site has falsified the info just for the sake of completing.
If you bring the report of a state GO we need to believe. But at the same time if I show the report of the same state government, it is falsified. Is there any morality in your statements?
You asked me to prove, though I have given the government evidence. If you have any other information saying the information in the site is falsified, provide it here.. or better go to the court. By the way, I am asking the same question
1) majority of these start-ups you listed in Hyderabad surroundings did benefit only non-telangana settlers.
Prove it
2) local quota is mostly filled by non-telangana telugu people thru recommendations and bribes.... not through talent.
This, as I said the cheapest allegation. Prove this..
By saying getout, everybody came to know who is showing the tyrannical attitude here. Dude, Though I didn’t say it in my earlier post, because of your attitude, I will repeat 19458982394892348234 no. of times, Hyderabad is ours.
Who are you to call us settlers? Its ours.. ours.. ours.. whoever living in Hyderabad. Now leave us and better get out.
I don’t know whether my comment will be posted or not.

అజ్ఞాత చెప్పారు...

WHAT IF I SAY YOU'RE BLIND SIDED WITH YOUR PERSONAL VESTED INTEREST JUST IN HYDERABAD AND DON'T CARE THE SURROUNDING CALAMITY.

NO DOUBT - YOU'RE A SETTLER W/ BAD INTENT. GO BACK.

YES, YOU CAN GET A SEAT IN MCA AT CU - SPEND MONEY AND CATCH YOUR OWN CORRUPTED PEOPLE IN ANDHRA - THEY CAN MAKE IT HAPPEN. WHY DO WE NEED THESE COLLEGES IN OUR REGION WHICH COULDN'T BENEFIT LOCAL PEOPLE?

WE AREN'T AGAINST ALL SETTLERS. LOCAL PEOPLE SUPPORT THE TRUE STAKEHOLDERS.... BUT NOT PEOPLE LIKE YOU. FOR YOUR KIND INFORMATION MY FORE-FATHERS AREN'T FROM TELANGANA EITHER... BUT I'M IN FULL SUPPORT OF SEPARATE STATE W/ HYDEARABAD. ITS NONE OF YOUR BUSINESS AND GET LOST FROM THIS REGION AND TAKE AWAY YOUR IT INDUSTRY.

GO-610 IS NOT PROPERLY IMPLEMENTED - THE GOVT DOCUMENT DOESN'T SHOW ALL THE DETAILS. THE AREAS SHOWN AREN'T EVEN HALF-WAY - THERE IS NO LAW TO REVERT THE BREACHES BACK TO 20~30 YEARS AND THEY STOPPED FURTHER IMPLEMENTATION.

GO-610 IS JUST ONE AMONG MANY FALSE AGREEMENTS. INTERESTED... TO KNOW THEN READ FACTS... http://www.telangana.org/document/Andhra_Valasa_Palanalo_Telangana.pdf

HOW MUCH DO YOU KNOW ABOUT 'KALOJI'? (NOTHING....RIGHT?)

WHY DO I KNOW SO MUCH ABOUT 'GURAJADA' (SURPRISING.... ISN'T IT?)

IT'S A TOTAL CONSPIRACY AND SILENT GENOCIDE.

WE WONT LET IT HAPPEN - GET OUT OF THIS PLACE - FURTHER DEVELOP YOUR OWN ALREADY DEVELOPED AREAS.

satya చెప్పారు...

Don’t try to fool us with your seperatists literature. I know Kaloji in the same way as Gurajada. I know Dasarathi as much as I know about viswanatha.
Its not me who is having the vested interests in Hyderabad. What can I do with Hyderabad? I am neither a politician nor a real estate person. But ask the same question to your politicians. ‘why do we need Hyderabad to develop rest of telangana?’ will they agree for that? Never.
>> WHY DO WE NEED THESE COLLEGES IN OUR REGION WHICH COULDN'T BENEFIT LOCAL PEOPLE?
You are going mad. Ask your students whether they need these institutions or not.
>>> ITS NONE OF YOUR BUSINESS AND GET LOST FROM THIS REGION AND TAKE AWAY YOUR IT INDUSTRY.
You are taking like as if you are the whole and sole representative of telangana.. Its my right to live wherever I want. Equally, Its my right to express my opinion.
It is the bad intent or vested interests in Hyderabad for few political leaders and blind followers like you. Wake up.. ask them what they have done for you. Don’t give vague statements like GO 610 is not properly implemented etc..
You ppl are saying Andhra region is developed as if you travelled the length and breadth of the place. If there is such lushed green fields why do we need to come to Hyderabad? Why should we sell 5 to 10 acres to purchase a small house here? Don’t become prey to all the hate speeches and non-sense literature.
Show your anger towards the politicians of your region. Ask KCR why it takes 20 yrs for him to come to know telangana is backward? Ask them why they didn’t go for indefinite fast for bhima project to be completed when the ministry of major irrigation is owning by a telangana person.
Don’t pose silly questions like why do I know so much about ‘gurajada’?
If so, why should we know more about RK Narayan?
Why should we know about Robert Frost?
Aren’t the Andhra students reading about kakatiya dynasty?
A sincere suggestion.. Come out of your frustration

DR.GOLLAPELLI RAMKISHAN RAKI DHARMAPURI చెప్పారు...

telangaana udyama geetaalu/paatalakai..
www.raki9-4u.blogspot.choosi spandinchandi..prachaaram cheyandi..telangaana saadhiddaam...jai telangaana