16, డిసెంబర్ 2009, బుధవారం

చిరంజీవి రాజీనామా

మెగాస్టార్‌ చిరంజీవి ఎట్టకేలకు తానెటువైపు వెళ్లాలో నిర్ణయించుకున్నారు.. శాసన సభ్యత్వానికి రాజీనామా చేసి సమైక్యాంధ్రకు మద్దతు పలకాలని నిర్ణయించుకున్నారు.. రేపు ఉదయం స్పీకర్‌కు కానీ, తిరుపతికి వెళ్లి అక్కడ ప్రజానీకం ముందు కానీ, రాజీనామా చేసే అవకాశం ఉన్నట్లు ప్రజారాజ్యం వర్గాలు చెప్పాయి. తిరుపతిలో చిరంజీవి ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.. ప్రజారాజ్యం పార్టీ భవిష్యత్తు, రాజకీయ వైఖరి ఎలా ఉండాలన్న విషయంపై ఉదయం నుంచి తర్జన భర్జన పడుతున్న చిరంజీవి మొత్తం మీద ఒక నిర్ణయానికి వచ్చారు.. తెలంగాణ లొల్లి మొదలయ్యాక రాజీనామాల పర్వం ప్రారంభం అయిన తరువాత ఒక పార్టీ అధ్యక్షుడు తన శాసన సభ్యుల బాటలో నడవటం ఇదే మొదలు.. తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు కూడా రాజీనామా చేయాలంటూ చిత్తూరులో ఆందోళనలు రేగుతున్నాయి. ఆయన దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి వైఖరిని స్పష్టం చేయలేదు. మొత్తం మీద ఈ ప్రాంతీయ వాదాలు రాష్ట్ర రాజకీయాల్లో నూతన సమీకరణాలకు నాంది పలుకుతున్నాయి.




5 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

He is under pressure!

అజ్ఞాత చెప్పారు...

చంద్ర బాబుమీద బెటర్ అన్నమాట.. గోడ మీద పిల్లిలా కాకుండా ఎదొ ఒక డెసిషన్ తీసుకున్నాడు..

అజ్ఞాత చెప్పారు...

ఇప్పటికైనా చిరంజీవి ముసుగులో గుద్దులాట లా కాకుండా తన అభిప్రాయాన్ని బయటపెట్టినందుకు ఆనందంగా ఉంది.

అజ్ఞాత చెప్పారు...

i hope people remember the fact that he said that he is supporting saamaajika(kula gajji) telangaana

vishnu_nkd చెప్పారు...

25yr sadinchina peru manchitanam ane musugu athi vinayam anni ippatito chellu anyhow jarigindi manamanchike ee garedoni chetullo manam akkuva mosapoledu kritam varito polchukunte so best of luck for chiru for his ardhra CM post.. kaneesam ippatikyana sutiga samadanam cheppe dhammu dyaryam penchukunte bhaduntundi avva buvva korukunte chetilo chippe migulutundi