23, డిసెంబర్ 2009, బుధవారం

మళ్లీ తెరపై పెద్దమనుషుల ఒప్పందం...

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకంగా సీమాంధ్ర ఎంపిలు తమకు అందుబాటులో ఉన్న అన్ని అసా్తల్రనూ బలంగా ప్రయోగిస్తున్నారు.. వీరప్పమొయిలీతో రెండుసార్లు సమావేశమైన వీళు్ల రాజీ ఫార్ములాను ఆయన ముందుంచారు.. అందులో కొన్ని ప్రతిపాదనలు.. తెలంగాణకు ఉపముఖ్యమంత్రి పదవిని ఇవ్వటం.. ప్రాంతీయ అభివృద్ధి మండళ్లను ఏర్పాటు చేసి దాని ద్వారా అభివృద్ధిని పర్యవేక్షించటం...
ఇంతకంటే దారుణం.. దుర్మార్గం.. ఎక్కడా ఉండదు.. 1956లో తెలంగాణ ఆంధ్ర రాష్ర్టంలో విలీనం అయినప్పుడు ఏ పెద్దమనుషుల ఒప్పందం అయితే కుదిరిందో.. ఆ పెద్ద మనుషుల ఒప్పందంలోని అంశాలే ఇవన్నీ... ఢిల్లీలో సంతకాలు చేసిన పెద్దలు నీలం సంజీవరెడ్డి అక్కడి నుంచి విమానం హైదరాబాద్‌లో దిగీ దిగటంతోనే ఉపముఖ్యమంత్రి పదవి ఆరోవేలు లాంటిది అదెందుకు అంటూ పెద్దమనుషుల ఒప్పందాన్ని కాలరాసారు.. సంతకాల పచ్చి ఆరకుండానే ఒప్పందాల ఉల్లంఘనకు పాల్పడిన ఘానాపాటీలు వీళు్ల... ఇప్పుడు భూగర్భంలోంచి మళ్లీ తవ్వి ఈ ఒప్పందంలోని ప్రతిపాదనలను తెరమీదకు తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు... ఒక్కసారి ఆ ఒప్పందంలోని అంశాలేమిటో చదవండి... మేల్కొండి..

పెద్దమనుషుల ఒప్పందం
1956 లో తెలుగు మాట్లాడే ప్రాంతాలన్నీ ఏకమై ఒకే రాష్ట్రంగా ఏర్పడటానికి - కోస్తా, రాయలసీమ, తెలంగాణా - అన్ని ప్రాంతాల నాయకులూ ఇష్టపడ్డారు. అయితే తెలంగాణా నాయకులకు తమ ప్రాంత అభివృద్ధిపై కొన్ని సందేహాలు ఉన్నాయి. అధిక రెవిన్యూ ఆదాయం గల తమ ప్రాంతం, అదే నిష్పత్తిలో అభివృద్ధికి నోచుకోదేమోనన్న భయం వారికి కలిగింది. ఇటువంటి ఇతర సందేహాల నివృత్తికై అన్ని ప్రాంతాల కాంగ్రెసు నాయకులు కలిసి 1956 జూలై 19 న ఒక ఒప్పందానికి వచ్చారు. దీనినే పెద్దమనుషుల ఒప్పందం అన్నారు. ఈ ఒప్పందంలోని ముఖ్యాంశాలు ఇవి:

కనీసం ఐదేళ్ళపాటు, ప్రాంతాల వారీ రెవిన్యూ వసూళ్ళకు అనుగుణంగా ఆయా ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలపై ఖర్చు పెట్టాలి. తెలంగాణా ప్రాంతం నుండి వచ్చే మిగులు ఆదాయాన్ని ఆ ప్రాంతపు అభివృద్ధికే కేటాయించాలి
తెలంగాణాలో విద్యాసంస్థలను అభివృద్ధి చెయ్యాలి. స్థానిక విద్యార్ధులకు ప్రత్యేక రిజర్వేషనులు ఇవ్వాలి.
సివిలు సర్వీసులకు, ఇతర ప్రభుత్వ ఉద్యోగాలకు నియామకాలు జనాభా నిష్పత్తి ప్రకారం జరగాలి.
ఐదేళ్ళ పాటు పాలనా వ్యవస్థలోను, న్యాయ విభాగం లోను ఉర్దూ వినియోగం కొనసాగాలి.
రాష్ట్ర మంత్రివర్గంలో నిష్పత్తి ప్రకారం సభ్యులు ఉండాలి. ముఖ్యమంత్రి కోస్తా, రాయలసీమ నుండి ఉంటే ఉపముఖ్యమంత్రి తెలంగాణా నుండి, ముఖ్యమంత్రి తెలంగాణా వ్యక్తి అయితే ఉపముఖ్యమంత్రి ఇతర ప్రాంతాల నుండి ఉండాలి.
ఈ ప్రాంత అభివృద్ధి బాధ్యత తెలంగాణా అభివృద్ధి మండలికి ఉండాలి. మండలి సభ్యులు తెలంగాణా ప్రాంతం నుండి ఎన్నికైన శాసన సభ్యులు ఉండాలి.
తెలంగాణాలో మద్యపాన నిషేధాన్ని తెలంగాణా శాసనసభ్యులు కోరిన విధంగా అమలు చెయ్యాలి.
తెలంగాణా ప్రాంతంలోని ఉద్యోగాల్లో చేరేందుకు ఆ ప్రాంతంలో కనీసం 12 ఏళ్ళపాటు నివసించి ఉండాలని నిబంధన రూపొందించాలి.
కాబినెట్ మంత్రులలో 40 శాతం తెలంగాణా ప్రాంతానికి చెందిన వారే ఉండాలి.
-----------------
ఇప్పటి నాయకులు నీలం సంజీవరెడ్డిని, బెజవాడ గోపాలరెడ్డిని మించిపోయారు...లేకపోతే ఏ ఒప్పందం నుంచైతే అన్యాయం జరుగుతూ వస్తోందని తెలంగాణ వాళు్ల ఆరోపిస్తున్నారో అదే ఒప్పందాన్ని మళ్లీ రంగం మీదకు తెచ్చి మసిపూసి మారేడు కాయ చేయాలని చూడటాన్ని ఏమని నిర్వచించగలం? వీళ్ల సమైక్యతకు, తెలుగువారంతా ఒకటేనన్న నినాదాలకు ఉన్న ముసుగు వెనుక నిజం ఇది.

9 కామెంట్‌లు:

మంచు చెప్పారు...

మంచిది... ఉపముఖ్యమంత్రి ఎమి ఖర్మ.. ముఖ్యమంత్రితొ పాటు పూర్తి మంత్రివర్గం తెలంగాణా నుంచి వున్నా అబ్యంతరం లేదు.. తెలుగువాళ్ళంతా కలిసి వుంటే చాలు..

సమతలం చెప్పారు...

జెపి లాంటివాళ్లను ఆంధ్రావాళ్లు ఏజెంట్ గా పెట్టుకొని ఈ పథకం వేస్తున్నట్లున్నది. ఒప్పందాలు చేసుకొని మోసపోయేకంటె, బేషరతుగా కలిసుండటమే నయం.

కొండముది సాయికిరణ్ కుమార్ చెప్పారు...

ఈ మాటలు కె.సి.ఆర్. వింటాడని, ఆచరిస్తాడనే మీరు నమ్ముతున్నారా. గత అయిదారేళ్ళుగా తెలంగాణా ప్రజలను మోసం చేస్తున్న కె.సి.ఆర్. ఇప్పుడు కూడా అదే చేస్తున్నట్లు నాకు అనుమానంగానే ఉంది. ఇప్పుడీ పెద్దమనుషుల ఒప్పందానికి తలూపి, కాంగ్రెస్ లో తె.రా.స.ను విలీనంచేసి, ఉపముఖ్యమంత్రి పదవి కోసం కక్కుర్తిపడతాడనే నా అనుమానం.

అసంఖ్య చెప్పారు...

@manchi pallaki: మంచిది... ఉపముఖ్యమంత్రి ఎమి ఖర్మ.. ముఖ్యమంత్రితొ పాటు పూర్తి మంత్రివర్గం తెలంగాణా నుంచి వున్నా అబ్యంతరం లేదు.. తెలుగువాళ్ళంతా కలిసి వుంటే చాలు..

super. that is what a samaikyavadi believes.

అజ్ఞాత చెప్పారు...

అధిక రెవిన్యూ ఆదాయం గల తమ ప్రాంతం, అదే నిష్పత్తిలో అభివృద్ధికి నోచుకోదేమోనన్న భయం వారికి కలిగింది.
I'm not sure i understand? where was the revenue coming from in 1950's. I remember until early 90s entire country was poor.

నిజం చెప్పారు...

@manchu pallaki:ఇప్పుడు అవసరం కోసం ఇలానే మాట్లాడుతారు ......అవసరం తీరగానే ఆంధ్ర కే CM And అందరు ఆంధ్ర ఆఫీసుర్స్ వుంటారు...చరిత్ర చూస్తే అః నిజం తెలుస్తుంది ...అవసరం కోసం ఏమైనా చేస్తారు .........

మంచు చెప్పారు...

నిజం :- ))
మీరలా అర్ధం చేసుకుంటే నేనింకేమి చెప్పగలను,, మీ ఇస్టం..

DR.GOLLAPELLI RAMKISHAN RAKI DHARMAPURI చెప్పారు...

తెలంగాణా రాష్ట్ర ఉధృత ఉద్యమ పోరాట స్పూర్తి పాటలు/గీతాలకై,(17).........
ఈ బ్లాగ్స్ చూడండి
వీటిని పాడుకొండి..విస్తృతంగా..ప్రచారం చేయండి..
www.raki9-4u.blogspot.com. . జై తెలంగాణ జైజై తెలంగాణ

అజ్ఞాత చెప్పారు...

telangana viratvamkaligina, tyagapurusula,virapurusula,poratayhedulu,kaligina pratyeka rastram maadi.tamilanadu nundi thanny taguleste batukachetagaka balavantanga serutulato telanganalo cheri,dongalla anny dochukapotunnaru.dopididongalu andravallu.meto polika makekkada.british vallaku nizamnu odinchadaniki chetakakapote memu tarimi tarimi vellagottyam.maku merokalekka.telanganaku addupadite kabbardhar bidda.