ప్రాంతీయ విభేదాల గొడవ మాటేమో కానీ, ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి మాత్రం రెంటికి చెడ్డలా మారిపోతున్నారు.. ఓ పక్క రాజకీయ భవిష్యత్తు.. మరో పక్క కుటుంబ సినిమా భవిష్యత్తుల మద్య ఏం చేయాలో.. ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియని అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నారు...
సామాజిక తెలంగాణ నినాదం ఏమైంది?
చిరంజీవి కట్టుబడి ఉంటారా?
సమైక్యం వైపు వెళ్లిపోతారా?
సినిమాల కోసం రాజకీయాలను మెగాస్టార్ పణంగా పెడుతున్నారా?
చిరంజీవి ఏం చేయబోతున్నారు..? ఇప్పుడు అందరిలో ఆసక్తి రేపుతున్న ప్రశ్న... గత పదిహేను రోజులుగా రాషా్టన్న్రి, రాజకీయాలను కుదిపేసిన ప్రాంతీయ ఉద్యమాలు అన్ని రాజకీయ పార్టీలను సంక్షోభంలోకి నెట్టాయి. మిగతా రాజకీయ పార్టీల మాటెలా ఉన్నప్పటికీ ప్రజారాజ్యం పార్టీపై మాత్రం ప్రతికూల ప్రభావం తీవ్రంగా పడిందనే చెప్పాలి.
2009 ఎన్నికల్లోనే సక్సెస్ కాలేక.....,
ఆ తరువాత గ్రేటర్ ఎన్నికల్లోనూ బోల్తాపడి.....,
పోయే వాళ్లే తప్ప, వచ్చేవాళు్ల కరవై....,
అస్తిత్వానికి పోరాడుతున్న పార్టీని తెలంగాణ, సమైక్య వాదాలు అడకత్తెర మధ్యలోకి నెట్టేసింది. ఇప్పుడేం చేయాలో.. ఎలాంటి వైఖరిని కొనసాగించాలో గందరగోళంలో పడ్డారు.. ఓ వైపు సమైక్యవాదులు, మరో వైపు తెలంగాణ వాదుల బెదిరింపులు చిరంజీవిని ఓ నిర్ణయం తీసుకోలేని అయోమయ పరిస్థితిలో పడేశాయి.
వాస్తవానికి చిరంజీవి పార్టీ పెట్టిన రోజు నుంచీ తెలంగాణ పట్ల సానుకూలంగానే వ్యవహరిస్తూ వచ్చారు. 2008లో పార్టీ ప్రారంభించిన ఆగస్టు 26న సామాజిక తెలంగాణ కోసం అనుకూలంగా ఉంటామన్నారు.. ఎన్నికల సమయం వచ్చేసరికి దేవేందర్‌గౌడ్ నాటి పార్టీని విలీనం చేసుకుని తెలంగాణకు జై కొట్టారు.. ఆ తరువాత మొన్న అఖిలపక్ష సమావేశం జరిగిన సందర్భంలోనూ తీర్మానం పెడితే మాకేం అభ్యంతరం అన్నారు.. ఇప్పుడు మెజార్టీ ప్రజలు వద్దంటున్నారు అన్న ఫీలర్ పార్టీ శ్రేణుల ద్వారా వదిలారు..
ఉదయం నుంచీ తెలంగాణ విషయంలో చిరంజీవి తన వైఖరి మార్చుకుంటున్నారన్న వార్తలు మీడియాలో షికార్లు చేస్తూ వచ్చాయి. సమైక్యాంధ్ర నినాదం చేస్తారని కొద్దిసేపు, తిరుపతిలో నిరాహార దీక్ష చేస్తారని మరికొద్ది సేపు వార్తలు వచ్చాయి. దీంతో తెలంగాణ పిఆర్‌పి శ్రేణుల్లో తీవ్ర ఆగ్రహం పెల్లుబికింది. తెలంగాణలోని చిరంజీవి కుటుంబ సభ్యుల సినిమాలపై విధ్వంసకాండ జరిగింది. దీంతో మళ్లీ చిరంజీవి వెనక్కి వెళ్లారు. బంతిని కాంగ్రెస్, టిడిపి కోర్టుల్లోకి నెట్టేసి పదిహేను రోజుల తరువాత కానీ తన నిర్ణయం ప్రకటించను పొమ్మన్నారు..
ఈ ప్రకటన వెలువడ్డ తరువాత అటు పిఆర్‌పి శ్రేణులు ఇటు చిరంజీవి కుటుంబం ఊపిరి పీల్చుకున్నాయి. మొత్తం మీద ఈ వ్యవహారం చిరంజీవికి రాజకీయ కష్టాలు తీరేట్లు కనిపించటం లేదు.. ఏ ముహూర్తంలో ఆయన ప్రజారాజ్యం ఆవిర్భవించిందో కానీ, నిత్య సమస్యలతో సతమతమవుతోంది... మరి ప్రజారాజ్యం భవిష్యత్తు ఏమవుతుంది? ఆ పార్టీ అస్తిత్వం ఏమిటన్నది ఇప్పటికైతే ప్రశ్నార్థకమే..
2 కామెంట్‌లు:
What he is going to do?
He already did, just now read it in news paper he resigned as MLA
Now he will watch a cinema when innocent 'Abhimanulu' theaterla daggara kottuka chastunte.
Do these people have sense ? What do they want ?
mari inta digajaaruthara ?
If he can not stand on his words atleast he should have kept quiet for now given the situation in AP.
కాకినాడ దగ్గర 30చ.కి.మీ.విస్తీర్ణంగల యానాం 1954 దాకాభారత్ లో ఫ్రెంచ్ కాలనీగా ఉంది.నేడు పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతంలో భాగం.1954లో లో విమోచనం చెంది స్వతంత్రభారతావనిలో విలీనంచెందినా 1956 లో భాషా ప్రాతిపదికన తెలుగు రాష్ట్రంలో కలవలేదు.1948లో హైదరాబాద్ ను పోలీసు చర్యజరిపి ఇండియాలో కలిపారు.1949 లో అప్పటికి ఒక ఫ్రెంచి కాలనీ గా ఉన్న చంద్రనాగూర్, సమీపంలోని బెంగాల్ రాష్ట్రంలో విలీనం అయింది. కాకినాడ మునిసిపల్ కౌన్సిల్ కూడా యానాన్ని కలపాలని తీర్మానం చేసింది. 870కి.మీ దూరంలోని తమిళ పుదుచ్చేరి నుండి పాలన కష్టంగా ఉంది.పుదుచ్చేరికి యానాం ప్రజల ప్రయాణం ఆంధ్రలోని కాకినాడ నుండి జరుగుతుంది.దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని యానాంలో ఏర్పాటు చేయాలని యానాం కాంగ్రెస్ తీర్మానించింది.ఇండోర్ స్టేడియం,కళ్యాణమండపం,ధవళేశ్వరం-యానాం మంచినీటి ప్రాజెక్టులకు రాజశేఖరరెడ్డి పేరు పెడతామని పుదుచేరి రెవిన్యూ మంత్రి మల్లాడి కృష్ణారావు చెప్పారు. తెలుగుజాతి సమైఖ్యత,భాషాప్రయుక్తరాష్ట్ర ప్రధాన ఉద్దేశ్యం యానాం ఆంధ్రప్రదేశ్ లో కలిస్తే నెరవేరుతుంది.తెలుగుతల్లి బిడ్డలందరూ ఒకేరాష్ట్రంగా ఉంటారు.సమైక్యాంధ్ర కోసం ఇప్పుడు ఉద్యమాలు జరుగుతున్నాయి గనుక భౌగోళికంగా సామీప్యత, 100% తెలుగు ప్రజలున్న యానాం ను ఇప్పటికైనా తమిళ పుదుచ్చేరి నుండి విడదీసి సమైక్యాంధ్రలో కలపాలి.కలిస్తే బాగుంటుందని ఆశ.
కామెంట్‌ను పోస్ట్ చేయండి