హైదరాబాద్... ఇప్పుడు ఎక్కడ చూసినా అదే మాట.. ఏ నోట విన్నా ఇదే పాట..తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటనను చిదంబరం ఏ ముహూర్తంలో చేశారో కానీ, ఆ మర్నాటి నుంచే సమైక్య ఉద్యమాలు పెల్లుబికాయి. కానీ, ఈ ఉద్యమాలన్నీ ఒకే ఒక్క నగరం చుట్టూ తిరుగుతున్నాయి. అది రాష్ట్ర రాజధాని హైదరాబాద్. ఈ సమైక్య ఆంధ్ర ఉద్యమాల వెనుక టార్గెట్ హైదరాబాదేనా? హైదరాబాద్‌ను తెలంగాణ వాదులు వదిలేసుకుంటామంటే ఈ సమైక్య ఉద్యమాలన్నీ ఆగిపోతాయా? హైదరాబాద్‌పై ఎందుకింత ప్రేమ? దీని కోసం ఎన్ని పట్టుదలలు?
హైదరాబాద్‌కోసమేనా సమైక్యాంధ్ర?
తెలంగాణలోని మిగతా 9జిల్లాలు ఐక్య ఉద్యమ లక్ష్యం కాదా?
హైదరాబాద్‌పైనే ఎందుకింత ప్రేమ?
ఎవరి ప్రయోజనాల కోసం ఈ పట్టుదల?
అసలు హైదరాబాద్ వెనుక ఉన్న ప్రయోజనాలేమిటి?
తెలంగాణ ప్రత్యేక వాద ఉద్యమం రేగినప్పుడల్లా, సమైక్య రాష్ట్రం ఉండాలని పట్టుబట్టే ఉద్యమకారులంతా మొట్టమొదటగా లేవనెత్తే ప్రశ్న హైదరాబాద్ సంగతేమిటి? అని.. కోట్ల కొద్దీ రూపాయలు ఖర్చు చేసి ఈ స్థాయిలో నిర్మించిన మహానగరాన్ని మేమెలా వదిలిపెడతామని.. నిజమే.. ఈ ప్రశ్నలన్నీ సహేతుకమే.. ఈ దేశంలో కాశ్మీర్ మినహా మిగతా అన్ని రాషా్టల్ల్రో ప్రజలు స్వేచ్ఛగా సంచరించేందుకు, నివసించేందుకు, ఆదాయాలు సంపాదించుకునేందుకు, సంపత్తిని పెంచుకునేందుకు, పెట్టుబడులు పెట్టేందుకు, ఖర్చు చేసేందుకు అన్ని రకాల అధికారాలు ఉన్నాయి. రాజ్యాంగం మనందరికీ కల్పించిన మౌలిక హక్కు అది. ఈ విషయంలో ఎవరికీ మినహాయింపు లేదు. ప్రత్యేక రాష్ట్ర ప్రస్తావన వస్తున్న ప్రతిసారీ చాలా బలంగా, అత్యంత దృఢంగా, విస్పష్టంగా జరుగుతున్న ప్రచారం వాళ్లను వీళు్ల వెళ్లగొడతారని.. వెళ్ల గొట్టడానికి వీళ్లెవరు? వీళ్లకు ఉన్న అధికారం ఏమిటి? రాజ్యాంగాన్ని ఉల్లంఘించే ప్రయత్నం చేసిన రాజ్‌థాక్రే అప్పుడప్పుడు అవాకులు చవాకులు పేలడం తప్ప చేయగలిగిందేమీ లేదు.. జాగో.. భాగో నినాదాలు ఇచ్చిన సదరు కెసిఆర్ అనే నేత కూడా ఈ విషయంలో లక్షాతొంభై వివరణలు ఇచ్చుకున్నారు.. అయినా సమైక్య ఉద్యమం బలంగా సాగేందుకు ఈ ప్రచారాలు తప్పటం లేదు.. ఉద్యమానికి ఏదో ఒక హేతువు కాబట్టి ఇలాంటి ప్రచారాలు అవసరమవుతాయి. దీనికి ఎవరినీ నిందించాల్సిన అవసరం లేదు.. ఎవరూ వెళ్లిపోరని వారికి తెలుసు.. ఎవరూ వెళ్లగొట్టలేరనీ వారికి తెలుసు.. ప్రజలకూ ఆ సంగతి తెలుసు.. అయినా ప్రచారం ఆగలేదు.. ఆగదు.. ఎందుకంటే ఉద్యమాన్ని బలహీన పరిచే ఎలాంటి చర్యనూ వాళు్ల చేపట్టరు.. ఉద్యమకారుల మౌలిక లక్షణం అది... ఈ ధోరణి ప్రత్యర్థులకు ఇబ్బంది కలిగించవచ్చు.. చికాకు పరచవచ్చు.. కానీ, ఉద్యమకారుల దృష్టికోణం నుంచి ఆలోచిస్తే అది సమంజసమైన చర్యే.
ఇక అసలు విషయానికి వద్దాం... రాష్ట్ర రాజధానిగా హైదరాబాద్ చాలా విస్తరించింది. ఇళు్ల, కాలనీలు, వ్యాపారాలు, పరిశ్రమలు అలియాస్ ఐటి ఇలా ఎంతో విస్తరిస్తూ పోయింది. రాష్ట్ర, దేశ, అంతర్జాతీయ పెట్టుబడులూ వచ్చాయి. ఇందులో సందేహం లేదు.. ఈ పురోగతిలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం ఉంది. బిళ్ల బంట్రోతు కట్టిన పన్నుల నుంచి బిల్ గేట్‌స పెట్టిన పెట్టుబడి దాకా ప్రతి రూపాయి హైదరాబాద్ నగర అభివృద్ధిలో తన వంతు పాత్ర పోషించింది.
ఇంతవరకు బాగానే ఉంది. కానీ, ఇక్కడే అసలు ప్రశ్న తలెత్తేది.. ఇవాళ సమైక్య ఉద్యమవాదులు వాదిస్తున్న దానిలోనే ప్రశ్న దాగి ఉంది. హైదరాబాద్‌ను ఎక్కడో కోస్తాంధ్రలో ఉంటున్న తాము వచ్చి డబ్బులు ఖర్చు చేసి అభివృద్ధి చేశాం... ఇప్పుడు హైదరాబాద్ మాది మీరు వెళ్లిపొండంటే మేమెందుకు ఊరుకుంటాం? అని.. నిజమే.. వెళ్లిపొమ్మంటే ఊరుకోవటం పిరికితనం అవుతుంది. దర్జాగా మనం కొనుక్కున్న స్థలంలో మనం నివసించేందుకు, వ్యాపారం చేసుకునేందుకు అన్ని రకాల ఆర్థిక, హార్థిక లావాదేవీలు నిర్వహించుకునేందుకు రాజ్యాంగం సార్వభౌమాధికారాన్ని ప్రతి భారతీయుడికి కల్పించింది. అందులో ఇసుమంతైనా సందేహం లేదు.. ఇక 1956 తరువాత ఆంధ్రప్రాంతం నుంచి వచ్చిన పెట్టుబడుల వల్లనే హైదరాబాద్ అభివృద్ధి చెందిందని... ఇదే అందరినీ తొలుస్తున్న ప్రశ్న.. ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తరువాతే హైదరాబాద్‌కు ఈ వైభవం కలిగిందా? అంతకు ముందు హైదరాబాద్ నిజంగా రాళూ్ల రప్పలతోనే ఉండిందా? తరతరాల బూజు నిజాం రాజు హయాంలో హైదరాబాద్ ఎందుకూ కొరగాకుండా పోయిందా? ఇవన్నీ సమాధానం లేని ప్రశ్నలా? ఒకవేళ హైదరాబాద్ నాటి ఆంధ్ర రాష్ట్రంలో విలీనం కాకపోయి ఉంటే..ఆంధ్రప్రాంతంలో హైదరాబాద్ కలిసి ఉండకపోతే, హైదరాబాద్ ఇలా ఉండేది కాదా? ఇక్కడ రాళూ్ల రప్పలూ మాత్రమే మిగిలేవా? ఏది నిజం?
==============
1953లో ఆంధ్రరాష్ట్రం ఏర్పడేసరికే హైదరాబాద్ స్టేట్ ఉంది. 1948లో సర్దార్ వల్లభాయ్ పటేల్ పుణ్యమా అని పోలీస్ యాక్షన్‌తో నిజాం కబంధ హస్తాల నుంచి హైదరాబాద్‌స్టేట్‌కు విముక్తి లభించింది. అప్పటికి ఆంధ్రరాష్ట్రం మద్రాస్ స్టేట్‌లో భాగంగానే ఉంది. తమిళుల నుంచి తెలుగువారు వేరుగా ఉండాలన్న డిమాండ్ చాలాకాలంగా ఉన్నప్పటికీ, అది సాధ్యం కాలేదు.. 1952లో ఇడ్లీసాంబార్ గోబ్యాక్ ఉద్యమం హైదరాబాద్‌లో వచ్చింది. ఏడుగురు తెలంగాణ విద్యార్థులు పోలీసు కాల్పుల్లో మరణించారు.. 1953లో పొట్టిశ్రీరాములు గారి అమరత్వంతో ఆంధ్రరాష్ట్రం ఏర్పడింది. అప్పుడు హైదరాబాద్ స్టేట్ ఆంధ్రలో విలీనం జరగలేదు. ఓ పక్క ఆంధ్ర రాష్ట్ర ప్రతిపాదనపై రాయలసీమ నేతలతోనే గొడవలు.. పైగా ఢిల్లీలో ప్రాబల్యం ఉన్న రాజగోపాలాచారి కారణంగా ముందుగా ఆంధ్రరాష్ట్రం వస్తే చాలు అనే అనుకున్నారు.. ఆంధ్రరాష్ట్రం సాధించారు. కానీ, రాజధానికి అవసరమైన అన్ని హంగులు ఉన్న నగరం మద్రాసును సాధించుకోలేకపోయారు.. ఆంధ్ర ప్రాంతంలో మరెక్కడా అన్ని సౌకర్యాలు ఉన్న నగరం మరొకటి లేదు.. కర్నూలును రాజధాని చేసినా రాజధాని స్థాయి భారాన్ని అది మోయలేకపోయింది. అందుకే వారికి హైదరాబాద్ వంటి నగరం అవసరమైంది. ఎలాగూ భాషా ప్రయుక్త రాషా్టల్ర కోసం ఉద్యమాలు జరుగుతున్నాయి. ప్రయత్నాలూ ప్రారంభమయ్యాయి. రాషా్టల్రను పునర్విభజించేందుకు ఓ కమిషన్‌నూ వేశారు.. ఇదే సమయంలో హైదరాబాద్‌స్టేట్‌ను ఆంధ్రలో విలీనం చేయాలని అక్కడి నేతలు చేసిన కృషి మొత్తం మీద ఫలించింది. 1956లో హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ ఆంధ్రరాష్ట్రంలో విలీనం అయింది.
అయితే హైదరాబాద్ కోసం ఆంధ్ర రాష్ట్ర నేతలు ఎందుకంతగా పట్టుబట్టారు.. తెలుగువారు అంతా ఒకటిగా ఉండాలన్నదే అభిమతమా? లేక రాజధాని అవసరమా?
ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావానికి ముందు హైదరాబాద్ ఎలా ఉందన్నది భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ థాట్‌స ఆన్ లింగ్విస్టిక్ స్టేట్‌స అన్న తన పుస్తకంలో స్పష్టంగా తెలిపారు...
``దేశ రాజధాని ఢిల్లీలో ఉన్న అన్ని సౌకర్యాలూ హైదరాబాద్‌లో ఉన్నాయి.. ఇంకా చెప్పాలంటే ఢిల్లీ కంటే ఎక్కువ సౌకర్యాలు హైదరాబాద్‌లో ఉన్నాయి. ప్రభుత్వ నిర్వహణకు అవసరమైన భవంతులు అతి చౌక ధరలకు లభిస్తాయి. అక్కడ భవంతులన్నీ చాలా అందంగా, ఢిల్లీలో కంటే ఎంతో అందంగా ఉన్నాయి. ఒక్క పార్లమెంటు భవనం కట్టుకుంటే సరిపోతుంది. సంవత్సరం పొడవునా నిరాటంకంగా పార్లమెంటు సమావేశాలు నిర్వహించుకున్నా ఏమాత్రం ఇబ్బంది ఉండదు.. అలాంటప్పుడు హైదరాబాద్‌ను దేశానికి రెండో రాజధాని చేయటంలో అభ్యంతరం దేనికో నాకు అర్థం కావటం లేదు.. రాషా్టల్ర పునర్విభజన జరుగుతున్న ఈ తరుణంలోనే మనం నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది..''
అంబేద్కర్ వంటి మేధావి ఈ మాట అన్నారంటే నాటి హైదరాబాద్ ఎంత ఉన్నతస్థాయిలో ఉందో ఆలోచించవచ్చు. అంతే కాదు.. అంబేద్కర్ రెండో రాజధాని అన్నారే కానీ, తెలంగాణ నుంచి దాన్ని విడగొట్టాలని ప్రస్తావన చేయలేదు.. హైదరాబాద్ అన్ని సౌకర్యాలతో, 1950ల నాటికే సుసంపన్నంగా ఉన్నది కాబట్టే శాశ్వతంగా రాజధాని సమస్య పోతుంది... దీనికి తోడు ఆనాడు హైదరాబాద్ స్టేట్ బడ్జెట్ దేశంలోనే ఏకైక మిగులు బడ్జెట్ రాష్ట్రంగా ఉంది. ఈ ఆదాయ వనరుల వినియోగం సవ్యంగా సాగుతుందనే ఉద్దేశంతోనే ఆంధ్రరాష్ట్ర నేతలు హైదరాబాద్ స్టేట్‌ను అర్జెంటుగా విలీనం చేసేందుకు పట్టుబట్టారు. ఆనాడు మన నాయకులు హైదరాబాద్ గురించి ఏమన్నారు?
``హైదరాబాద్ వచ్చి మనతో కలిస్తే అన్ని సమస్యలూ పరిష్కారం అవుతాయి. దీన్ని సాధించే మార్గాలను మనం వెంటనే అన్వేషించాల్సి ఉంటుంది''
1953జూన్
టంగుటూరి ప్రకాశం పంతులు
``మనకు రాజధానికి కావలసిన వనరులున్న నగరం ఒక్కటీ లేదు. గత రెండు సంవత్సరాలలో మనం చాలా సమస్యలను ఎదుర్కొన్నాం..ఫజల్ అలీ కమిషన్ సిఫార్సుల ప్రకారం మనం ఇంకా ఆగితే చాలా తీవ్రమైన సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది.''
1956 ఫిబ్రవరి
నీలం సంజీవరెడ్డి
``విలీనం వల్ల ఆంధ్ర ప్రాంతానికి శాశ్వతంగా రాజధాని సమస్య పోతుంది. హైదరాబాద్ సికిందరాబాద్ జంట నగరాలు విశాలాంధ్రకు రాజధానిగా ఉండాల్సిన అన్ని లక్షణాలను కలిగి ఉన్నాయి. ''
1955 మొదటి ఎస్సార్సీ
హైదరాబాద్‌ను రాజధానిగా చేసేందుకు కర్నూలును త్యాగం చేసారనటం ఎంతమాత్రం సరికాదు.. హైదరాబాద్ రాష్ట్రాన్ని ఆంధ్రరాష్ట్రం నేతలు తమ తప్పనిసరి అవసరార్థమే తమతో విలీనం చేసుకున్నారు.. తెలుగువారంతా ఒకటిగా కావాలన్న భావన బయటకు చూపించే ఒక కారణం కావచ్చు.
హైదరాబాద్ స్టేట్ విలీనం కావటం వల్ల అన్ని సౌకర్యాలతో రెడీమెడ్ రాజధాని ఆంధ్ర రాషా్టన్రికి లాభించింది. 1956కు ముందే అన్ని సౌకర్యాలతో 400 సంవత్సరాల పాటు హైదరాబాద్ స్టేట్ ప్రజల పన్నులతో అభివృద్ధి చెందిన నగరం హైదరాబాద్.. ఆ తరువాత రాష్ట్ర రాజధానిగా హైదరాబాద్ ఏర్పాటు కావటంతో సహజంగానే ఉపాధి అవకాశాలు పెరిగిపోయాయి. విలీనం అయిన తరువాత ఏర్పడిన రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి ఉద్యోగార్థులు, వ్యాపారస్థులు వచ్చి ఇక్కడ స్థిరపడటం సహజం.. ఇది ఏ రాష్ట్ర రాజధానిలోనైనా జరిగే సహజ పరిణామమే. ఇందులో వింతేమీ ఉండదు.. మహారాష్టల్రో ముంబయి అంతర్గత భాగం ఎలాగో.. తెలంగాణలో హైదరాబాద్ అంతర్భాగమే.. దీన్ని ఏదో విధంగా వేరు చేసి చూడటం శాస్త్రీయంగా, సాంకేతికంగా సాధ్యం కాదు..హైదరాబాద్ తెలంగాణకు నాభిప్రాంతంలో ఉంది. హైదరాబాద్‌లో ప్రవేశించాలంటే ఏ వైపు నుంచి చూసినా కనీసం వంద కిలోమీటర్లయినా తెలంగాణ జిల్లాల్లో ప్రయాణించి కానీ సాధ్యం కాదు.. అంతే కాదు.. హైదరాబాద్ జనాభా మిశ్రమ సంస్కృతి కలిగింది. ఇక్కడ కేవలం తెలంగాణ వాళ్లో, ఆంధ్రప్రాంతం వాళ్లో మాత్రమే ఉన్నారనుకుంటే అంతకంటే భ్రమ మరొకటి లేదు. ఇక్కడ మరాఠాలు ఉన్నారు.. ఇరానీలు ఉన్నారు.. కాయస్థులు, కన్నడిగులు ఉన్నారు... ఒకరు కాదు.. ఇద్దరు కాదు... అనేక జాతుల సంగమక్షేత్రం హైదరాబాద్.. మరి ఇన్ని వైరుధ్యాలు ఉన్నా హైదరాబాద్ గురించే ఎందుకు పట్టుదల..? సమైక్యవాదులు చేస్తున్న ప్రతిమాటను నిశితంగా గమనిస్తే.. హైదరాబాద్ మినహా మరే జిల్లా గురించి వారు ప్రస్తావించటం లేదు. అంటే వారి ఉద్యమం దేనికోసం? ఈ ఉద్యమాలు హైదరాబాద్‌నే ఎందుకు టార్గెట్ చేసుకున్నాయి.? అంటే హైదరాబాద్‌ను తెలంగాణ నేతలు పొరపాటున కాదంటే ఈ ఉద్యమాలన్నీ చప్పున చల్లారతాయా?
6 కామెంట్‌లు:
బాగుంది. కానీ నాకో చిన్న సందేహం. తెలంగాణలో హైదరాబాదుండేదా.. హైదరా బాదు స్టేటులో తెలంగాణ ఉండేదా.. లేక తెలంగాణతో పాటు ఇత ర ప్రాంతాలు కూడా హైదరాబాదు స్టేటులో భాగంగా ఉండేవా. ఉంటే అవేంటి. వాటికి కూడా హైదరాబాద్ గుండె కాయా కాదా.. లేక ఒక్క తెలంగాణకేనా.. మిగతా వాటికి కూడా కాయేనని అనుకుందాం. అలాంటప్పడు ఒక్క తెలంగాణ వాళ్లే తమకు కాయనడం వెనుక మతలబేంటి. మీరన్న లాజిక్కు నిజమైతే అప్పడు ఆధ్ర ప్రాంత పాలకుల ఎలా కన్నేశారో.. ఇప్పడు తెలంగాణ వాళ్లు కూడా అలానే కాలేయటానికి చూస్తున్నరా.. హైదరాబాద్ స్టేట్ ముస్లిం పాలకులది. కట్టించిన రాజ భవనాలన్నీ ఒక్క తెలంగాణ వాసుల రక్తం పిండి మాత్రమే కట్టారా.. లేక ఇతర ప్రాంతాల వాటా కూడా ఉందా.. ఉంటే ఒక్క తెలంగాణ వాల్లే గుండెకాయ అనడంలో అర్థమేంటి. వాళ్లకే సర్వస్వతంత్ర హక్కు లున్నాయని వాదించడంలో లాజిక్కేంటి. అసలు తెలంగాణకు హైదరాబాద్ స్టేట్ పై హక్కేంటి. ఉంటే గింటే తెలంగాణపైనే అధికారం హైదరాబాదుకుండాలి. చరిత్ర ప్రకారం చూస్తే ఎవరు హైదరాబాదులో కలవాలో నిర్ణయించాల్సింది హైదరాబాద్ స్టేటే కదా... మరి కొత్తగా తెలంగాణ స్టేటులో హైదరాబాదుని కలపడమేంటి.
1.తెలంగాణా ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే ముస్లిములకు భద్రత ఉండదని మజ్లిస్ పార్టీ చేసే వాదన నిజమేనా?
2.అలాగైతే తెలంగాణా లోని మిగతా జిల్లాల ముస్లిములు తెలంగాణా కావాలని ఉద్యమాలు ర్యాలీలు ఎందుకు చేస్తున్నారు?
3.సమైక్య రాష్ట్రంలో ముస్లిములకు వచ్చిన 4% రిజర్వేషన్లు జనాభా ప్రాతిపదికన తెలంగాణాలో పెరిగే అవకాశం ఉంటుందా?
హైదరాబాద్‌ను తెలంగాణ స్టేట్‌లో కలపడమేంటి? ఇదో విచిత్ర.. వింత వాదన.. అది ఆల్రడీ తెలంగాణలో ఒక భాగం.. చాలా గొప్ప విశ్లేషణే చేశారు. సంతోషం.. మీ సందేహాన్ని తీర్చటమే నా ఉద్దేశం.. హైదరాబాద్ స్టేట్‌లో తెలంగాణ భాగమా? తెలంగాణ హైదరాబాద్ స్టేట్‌లో భాగమా? అన్నది... ఏ విజయవాడను కోస్తాంధ్ర నుంచి విడదీసి చూడటమో, విశాఖపట్నంను ఉత్తరాంధ్ర నుంచి విడదీసి చూడటమో, తిరుపతిని రాయలసీమ నుంచి విడదీసి చూడటమో చేస్తే ఎలా ఉంటుందో హైదరాబాద్‌ను తెలంగాణ నుంచి విడదీసి చూడటం అలా ఉంటుంది. హైదరాబాద్‌తో తెలంగాణాకు ఎలాంటి సంబంధం లేదన్న స్థితికి మీరు ఎప్పుడో చేరుకున్నారు.. మీ సమైక్యం హైదరాబాద్‌తోనే తప్ప మరేదేనితో కాదన్నది స్పష్టం.. అందుకే మీ సందేహానికి నా సమాధానం.. ఆంధ్రశాతవాహనులు మొదట పరిపాలించింది ప్రతిష్ఠానపురం రాజధానిగా.. ప్రతిష్ఠానపురం ప్రస్తుతం ఔరంగాబాద్‌కు సమీపంలో మహారాష్ట్ర పరిధిలో ఉంది. ఆ తరువాత కాకతీయులు ఓరుగల్లు రాజధానిగా తెలుగువారిని ఒక్కటి చేసి పరిపాలించారు.. ఆ తరువాత విష్ణుకుండినులు నల్గొండ సమీపంలో రాజధానిని ఏర్పాటు చేసుకుని తెలుగువారిని పరిపాలించారు.. ఈ అన్ని పరిపాలనా కాలంలో గోలకొండ పట్టణం ప్రస్తుత హైదరాబాద్ ఇంత విస్తరణలో లేదు.. తెలంగాణంలో అంతర్భాగమే.. అప్పుడు ప్రతిష్ఠానపురం స్టేట్‌లో తెలంగాణ అంతర్భాగమా...? ఓరుగల్లు స్టేట్‌లో తెలంగాణ అంతర్భాగమా? నల్గొండలో తెలంగాణ స్టేట్ అంతర్భాగమా? అంటే అవి అవగాహనారాహిత్యంతో, ఆత్మసై్థర్యం కోల్పోతున్న దశలో మాట్లాడే మాటలు.. కాకతీయులు నిర్మించిన గోలకొండ కోటను కేంద్రం చేసుకుని కుతుబ్‌షాహీలు హైదరాబాద్ నగరాన్ని మూసీ తీరాన విస్తరింపచేశారు... తెలంగాణలో అదొక జిల్లా... ఒక విజయవాడ, ఒక విశాఖపట్నం, ఒక తిరుపతి ఎలాగో హైదరాబాద్ అలాగే... తెలంగాణ వాళు్ల హైదరాబాద్‌లో కాలేయటమేంటి? అది తెలంగాణలో నిస్సందేహంగా అంతర్భాగమే.. ఆంధ్రప్రదేశ్‌గా కలిసి ఉంటే అది రాష్టమ్రంతటికీ చెందినదే... తెలంగాణ విడిపోతే అది తెలంగాణకు చెందినది... ఇందులో లాజిక్కుల చర్చ అర్థరహితం..1956 తరువాత మాత్రమే ఆంధ్రప్రాంత వాసులు తెలంగాణలో ప్రవేశించారు. అంతకు ముందు వారికి హైదరాబాద్ ఎలా ఉంటుందో నామావశిష్టంగానైనా తెలియదు.. రాజధానిలో అవకాశాలు పెరుగుతున్న కొద్దీ ఇళు్ల కట్టుకున్నారు.. కాలనీలు నిర్మించుకున్నారు.. రియల్ వ్యాపారంతో అపార్‌టమెంట్లు కట్టుకున్నారు... సినిమా స్టూడియోలు నిర్మించుకున్నారు.. రాజధాని జనాభాకు అనుగుణంగా ఫై్ల ఓవర్లు వచ్చాయి. 1956కు ముందు హైదరాబాద్ ఉన్నవైభవానికి తనంత తానుగానే అభివృద్ధి చెందే సహజలక్షణాన్ని ఈ మహానగరం ఎప్పుడో కలిగి ఉంది.
గమ్మత్తేమిటంటే చరిత్రప్రకారం చూస్తే ఎవరు కలవాలో నిర్ణయించాల్సింది హైదరాబాద్ స్టేట్ కదా అని మీరే అన్నారు.. హైదరాబాద్ స్టేట్ అంటేనే తెలంగాణ. దాంతో పాటు ప్రస్తుతం మహారాష్టల్రో, కర్ణాటకలో కలిసిపోయిన ప్రాంతాలు.. ఆంధ్రప్రాంతం కాదు.. మీరన్నట్లు కొత్తగా హైదరాబాద్‌ను తెలంగాణా స్టేట్‌లో కలిపేదేం లేదు.. ఆల్రడీ కలిసే ఉంది.
hyderabadstatelo telanagana bhagama
samaikyandhra vall bhavana.. andhrapradesh ante andhra prantam ane vallu andhrapradesh lo telangana astitvanni gurtinchani vallu chese vyakhyanale ivi
హైదరాబాద్ స్టేటులో ఆంద్ర ప్రాంతమెన్నడూ భాగంగా లేదా.. ఉంటే ఏయే ప్రాంతాలున్నాయో కాస్త ఎవరైనా చెప్పగలరు
ముస్లిం ఫోరమ్ ఫర్ తెలంగాణా వాదన ఇలా ఉందిః
* మజ్లిస్ పార్టీ ఒక్కటే తెలంగాణా ముస్లిములకు ప్రతినిధి కాదు.తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడితే ముస్లిములకు భద్రత ఉండదని మజ్లిస్ పార్టీ చేసే వాదన నిజంకాదు.అలాగైతే తెలంగాణా లోని మిగతా జిల్లాల ముస్లిములు తెలంగాణా కావాలని ఉద్యమాలు ర్యాలీలు ఎందుకు చేస్తున్నారు?సమైక్య రాష్ట్రంలో ముస్లిములకు వచ్చిన 4% రిజర్వేషన్లు జనాభా ప్రాతిపదికన తెలంగాణాలో పెరిగే అవకాశం ఉంటుంది.తెలంగాణా ఏర్పడితే ముస్లిములకు ఉద్యోగాలు,పదవులు జనాభా దామాషాలో పెరుగుతాయి.ఇక్కడ 224 ఏళ్లుగా ఉర్దూ అధికార భాషగా ఉంది.ప్రభుత్వ అధికారిక లావాదేవీలు ఉర్దూ భాషలోనే జరిగేవి.ఉర్దూ స్థానిక ప్రజాభాష కాబట్టి మళ్ళీ ఉర్దూకు మంచి ఆదరణ పూర్వ వైభవం వస్తుంది.గల్ఫ్ దేశాలకు వెళ్లి జైళ్లలో మగ్గుతున్న వేలాదిమంది ముస్లిం యువకులు తిరిగి వచ్చి ఇక్కడే ఉద్యోగాలు,వ్యాపారాలు సంపాదించుకుంటారు.హైదరాబాద్ చుట్టూ రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆక్రమించిన వేలాది ఎకరాల వక్ఫ్ భూములు,ముస్లిం ఆస్తులు విడిపించి పేదముస్లిములకోసం వినియోగించవచ్చు.ఇరుకు సందుల్లో పాతబస్తీల్లో దుర్భర దారిద్య్రంలో జీవిస్తున్నముస్లింలను ఫుట్‌పాత్‌లపైనుండి సొంత గృహాల్లోకి తేవచ్చు.విద్యావంతులైన ముస్లిములు రౌడీషీటర్లు, ఐఎస్‌ఐ ఏజెంట్లు లాంటి నిందలు తొలగించుకొని బాధ్యతాయుతమైన తెలంగాణా సోదరులందరితో సమాన అవకాశాలు సాధిస్తారు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి